OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో స్ట్రిమింగ్ అవుతున్నాయి. అయితే వాటిలో మంచి ఫీలింగ్ తెప్పించే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. తాత, మనవడు కాన్సెప్ట్ తో తెలుగులో ఒక మూవీ వచ్చింది. ఎస్వీ రంగారావు నటించిన ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఈ తాత మనవళ్ళు దొంగతనాలు చేస్తుంటారు. ఎమోషనల్ డ్రామాతో వీళ్ళిద్దరి చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘లోలో అండ్ ది కిడ్‘ (Lolo And The Kid). 2024లో రిలీజ్ అయిన ఈ ఫిలిప్పైన్ డ్రామా మూవీకి బెనెడిక్ట్ మిక్ దర్శకత్వం వహించారు. ఇందులో యువెన్ మైకేల్, జోయెల్ టోర్రే నటించారు. ఈ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా మూవీ తాత, మనవడు చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
తాత, మనవడు ఒక ఫుట్ పాత్ మీద కూర్చుని భోజనం చేసి పడుకుంటారు. వాళ్లకి ఎదురుగా ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి పిల్లలు లేనందువలన, ఆ పిల్లవాడిని చూసి దత్తత తీసుకోవాలనుకుంటారు. అందుకు తాతతో మాట్లాడి విషయం చెప్తారు. మనవడిని వదిలి ఉండటం కష్టమని చెప్తూ, మీ దగ్గర ఉంటే అతని భవిష్యత్తు బాగుంటుందని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వెళ్లిపోయే ముందు తాతకి ఆ ఓనర్ కొంత డబ్బు కూడా ఇస్తాడు. అయితే రాత్రి అందులో ఉన్న సామాన్లు, ఇద్దరు దొంగతనం చేసి వెళ్లిపోతారు. దొంగలించిన సామాన్లు ఒక షాపులో విక్రయిస్తూ డబ్బులు తీసుకుని నచ్చింది చేస్తూ ఉంటారు. అలా వీరి దినచర్య కొనసాగుతూ ఉంటుంది. డబ్బులు అయిపోయాక, మళ్ళీ డబ్బున్న వాళ్ళ ఇంటి మీద పడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్లను టార్గెట్ చేసి, అమాయకులుగా నటించి దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఒకరోజు తాతకి మనవడు ఇలా ఉంటే భవిష్యత్తు ఉండదని గ్రహిస్తాడు. దత్తత తీసుకొనే ఒక జంట ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు తాత. పిల్లవాడు ఎంత ఏడ్చినా వినిపించుకోకుండా, అతడి బాగు కోసం ఈ పని చేస్తాడు.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత చివరి దశలో మనవడిని చూడడానికి తాత వస్తాడు. అప్పటికే పెరిగి పెద్దవాడైన మనవడిని చూసి, తాత చాలా సంతోషిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకప్పుడు ఎలా సరదాగా తిరిగారో అలా తిరుగుతారు. ఆరోజు మనవడి చేతిలో తాత ఊపిరి ఆగిపోతుంది. తాత దగ్గర మనవాడికి ఒక బ్యాగ్ దొరుకుతుంది. అందులో చిన్నప్పటి నుంచి, పెద్ద అయ్యేంతవరకు తాత తీసిన ఫోటోలు ఉంటాయి. నిత్యం అతన్ని గమనిస్తూనే, పెద్దయ్యేంతవరకు కనిపించకుండా తోడుగా ఉంటాడు తాత. ఈ విషయం తెలుసుకొని మనవడు బోరున విలపిస్తాడు. ఈ ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ప్రసారమవుతుంది.