BigTV English

Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ కు కావ్య వార్నింగ్‌ – కావ్యను ఓదార్చిన రాజ్‌

Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ కు కావ్య వార్నింగ్‌ – కావ్యను ఓదార్చిన రాజ్‌

Brahmamudi serial today Episode: నా తల్లిదండ్రులకు నాన్నమ్మకు నిజం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆసలు గెస్ట్‌ హౌస్‌ ఎందుకు తాకట్టు పెట్టామంటే.. అని రాజ్‌ నిజం చెప్పబోతుంటే.. కావ్య అడ్డుపడుతుంది. ఈ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. గెస్ట్‌ హౌస్‌ తాకట్టు పెట్టింది నేను.. పది కోట్లు తీసుకున్నది నేను అంటుంది కావ్య. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరికి జవాబు చెప్పకపోతే వీళ్లు తల తీసి మొల వేస్తారా..? ఆస్థి మొత్తం నా పేరు మీద ఉంది. చెప్పాలనిపిస్తే నేను చెప్పాలి.. మీరు మాత్రం సైలెంట్‌ గా ఉండండి.. అని చెప్తుంది కావ్య.


దీంతో రుద్రాణి వదిన చూశావా..? అంతా అయిపోయింది. నీ కొడుకును బొమ్మను చేసి ఆడిస్తుంది నీ కోడలు. రాజ్‌ నోరు మూయించింది నీ కోడలు అంటూ రెచ్చగొడుతుంటే.. సుభాష్‌ కోపంగా రుద్రాణి నువ్వు ఆగు.. ఏ కారణంతో నా కోడలు,  నా కొడుకు నోరు మూయించిందో నేను కనుక్కుంటాను. కానీ నువ్వు మాత్రం మనుషులను రెచ్చగొట్టకు అంటూ కావ్య దగ్గరకు వెళ్లి చూడమ్మా.. ఆస్తి మొత్తం నీ పేరునే ఉంది. నేను కాదనటం లేదు. కానీ ఆప్పు తీసుకున్నది చాలా పెద్దమొత్తంలో ఉంది. అది తాకట్టు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా.. అంత పెద్ద అమౌంట్‌ మీకు ఏం అవసరం వచ్చింది. అది తెలుసుకునే హక్కు నాకు లేదా..? అని సుభాష్‌ అడగ్గానే.. చూడండి మామయ్యగారు. తాతయ్యగారు నన్ను నమ్మి ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. దాన్ని తాకట్టు పెట్టే హక్కు నాకు ఉంది. అవసరం అయితే అమ్మే హక్కు కూడా నాకు ఉంది. కానీ నేను ఏం చేసినా ఎందుకు అని అడిగే హక్కు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు అనగానే అపర్ణ కోపంగా కావ్య ఎంత ధైర్యం నీకు నా భర్తనే ఎదురించి మాట్లాడతావా..? నా భర్తనే అడిగే హక్కు లేదంటావా..? అంటూ కొట్టబోతుంది. సుభాష్‌ ఆపేస్తాడు. రాజ్, కావ్యను తీసుకుని పైకి వెళ్లిపోతాడు.

ప్రకాష్‌ బాధగా ఏంటన్నయ్యా ఇది కావ్య నిన్ను.. అంటూ ఏదో మాట్లాడబోతుంటే.. ఇంతలో రుద్రాణి కల్పించుకుని ఈ ఇంట్లో పెద్దరికం ఇంట్లో కళ్లకు గంతలు కట్టుకుంది. పెడితే తినాలి. తిడితే పడాలి అనే శాసనాలు విలయతాండవం చేయడం మొదలయ్యాయి. దుగ్గిరాల వంశ చరిత్ర కనకం గారి కూతురు చేతిలో చెరిగిపోయే సమయం ఆసన్నమైంది. గుర్తించుకోండి.. ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు.. అడిగే హక్కు లేదు.. కట్టుకున్న మొగుడిని కూడా ఇంత మంది ముందు నోరు మూయించింది అంటే.. అమ్మో మామూలు ఆడది కాదు. మన వంశాన్నే భ్రష్టు పట్టించడానికి వచ్చి మహమ్మారి అమ్మో అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి.


రూంలోకి వెళ్లిన రాజ్‌, కావ్య బాధపడుతుంటారు. ఏవండి మీరు నన్ను ఏమీ అడగరా..? ఏమీ అనరా..? అని రాజ్‌ను అడుగుతుంది. ఏ విషయంలో అని రాజ్‌ అడుగుతాడు. దీంతో దేవుడి లాంటి మామయ్యగారిని పట్టుకుని నేను నోరు జారానండి.. ఇది నాకే తెలియకుండా నోరు జారడం కాదని మీకు అర్థం కాలేదా..? అని అడుగుతుది. ఎందుకు అర్థం కాలేదు అంటాడు రాజ్. మరి మీకు నా మీద కోపం రాలేదా..? అని కావ్య అడిగితే..కోపం వచ్చింది. కానీ నీ మీద కాదు.. మన నిస్సహాయత మీద. మనల్ని ఇలా నిలబెట్టిన వాడి మీద నా అసమర్థత మీద అంటూ రాజ్‌ బాధపడుతుంటే.. అయ్యో మీరెందుకు బాధపడతారు అంటుంది కావ్య. మనం అప్పుగానో బదులుగానో తీసుకోలేని డబ్బు.. మనం ఎంతో కష్టపడి అప్పుగా తీర్చాల్సి వచ్చింది. ఇన్ని సమస్యల మధ్య ఇంట్లో వాళ్ల ముందు మనం దోషిగా నిలబడాల్సి వచ్చింది. తప్పంతా నీ మీద వేసుకున్నావు. నీ వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుని అలా మాట్లాడావు.

బాధపెట్టే నిజం చెప్పడం కన్నా సంతోషపెట్టే అబద్దం చెప్పడంతో ఏ తప్పు లేదంటారు. ఇదంతా చూసి కూడా తెలిసి కూడా ఇంకా నిన్ను అపార్థం చేసుకుంటే నా అంత మూర్ఖుడు ఎవ్వడూ ఉండడు. ఈరోజు నువ్వు మా నాన్న ఏమన్నా ఆయన మాత్రం నిన్ను అపార్థం చేసుకోడు అనుకుంటున్నాను. భర్తగా నేను నీకు ఎప్పుడూ ఏమీ చేయలేదు. కానీ ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా ఉండాలనుకున్నాను అంటూ రాజ్‌ ఎమోషనల్‌ అవుతాడు.  దీంతో కావ్య ఏడుస్తూ రాజ్ ను హగ్‌ చేసుకుని. ఇంతసేపు మామయ్యగారిని మాట అన్నానే అనే బాధతో నలిగిపోయాను. కానీ ఇప్పుడు అపరాధ బావం అంతా పోయింది. మీ నుంచి నా కావాల్సినంత ఓదార్పు దొరికింది. చాలండి నాకిప్పుడు ధైర్యంగా ఉంది.

కళ్యాణ్‌ పాట రాస్తూ.. సరిగ్గా రావడం లేదని పేపర్స్‌ చింపివేస్తుంటే.. అప్పు వచ్చి మోటివేట్‌ చేస్తుంది. దీంతో ఆ అనామిక నిన్ను అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అందుకే పాట రాయలేకపోతున్నాను. అనగానే అప్పు తన మాటలతో కళ్యాణ్‌ను తన మాటలతో కన్వీన్స్‌ చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. మరోవైపు సుభాష్‌ ఒక్కడే బయట నిలబడి ఆలోచిస్తుంటే.. ప్రకాష్‌ వెళ్లి ఓదారుస్తుంటాడు. కావ్య వచ్చి దూరం నుంచి వింటుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి సేఫ్.. నర్మద మాటతో మైండ్ బ్లాక్.. ప్రేమ ధీరజ్ ఫైట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. ప్రణతికి పెళ్లి చెయ్యబోతున్న పార్వతి.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నెల తప్పిన అప్పు – తప్పు చేసిందన్న రుద్రాణి

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు డబ్బులిచ్చిన కల్పన.. బాలునే సాక్ష్యం.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

Big Stories

×