E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: చలపతి ఇంట్లో రాజు, ఇందును చూసి షాకైన రేఖ 

Brahmamudi Serial Today Episode July 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: చలపతి ఇంట్లో రాజు, ఇందును చూసి షాకైన రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: ఎవరెన్ని చెప్పినా తన మనసు మారదని దుగ్గిరాల ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని రాజు, ఇందుకు చెబుతూ.. నాన్న ఈ అమ్మాయిని పంపించేయండి అని చెప్పగానే.. చలపతి సారీరా నేను అలా చెప్పలేను.. ఎందుకంటే మీరిద్దరూ భార్యాభర్తలు.. నీకు ఈ ఇంట్లో ఉండటానికి ఎంత హక్కు ఉందో కోడలిగా ఆ అమ్మాయికి అంతే హక్కు ఉంటుంది అయినా లక్ష్మీ భార్యాభర్తల మధ్య మనమెందుకు వెళ్దాం పద అంటూ చలపతి లక్ష్మీని తీసుకుని వెళ్లిపోతాడు. రాజు కోపంగా బయటకు లోపలికి వెళ్లబోతూ కింద పడబోతుంటే.. ఇందు పట్టుకుంటుంది. రాజు ఇరిటేటింగ్ గా ఏయ్‌ వదిలేయ్‌ నన్ను అంటాడు.. వదిలేస్తే పడిపోతావు అంటూ ఇందు చెబితే.. పడిపోతే పడిపోతాను వదిలేయ్‌ అంటే.. ఇందు ప్రేమగా పడిపోతే నీకంటే ఎక్కువ ఫెయిన్ నాకే ఉంటుంది అంటుంది. రాజు ఆశ్చర్యంగా చూస్తుంటాడు.

అప్పుడే అక్కడకు రేఖ వస్తుంది. ఇదేంటి చావు ఇల్లులా కాకుండా నార్మల్ గానే ఉంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ రాజు, ఇందు కలిసి ఉండటం చూసి షాక్‌ అవుతుంది. ఈ రాజు గాడు చచ్చిపోలేదా..? ఆ రౌడీ గాడు సగం సగం పని చేశాడా..? అంటూ ఆలోచిస్తుంటే.. రాజు పిన్ని ఏంటి అక్కడే ఆగిపోయావేం.. రా అంటూ పిలుస్తాడు.. దగ్గరకు వెళ్లిన రేఖ రాజు నీకు యాక్సిడెంట్‌ అయిందని ఇప్పుడే తెలిసింది అంటూ చెప్పగానే.. ఎవరో నన్ను గట్టిగా చంపేయాలని చూశారు.. కానీ మనం గట్టి పిండం కదా..? ఇలా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాను.. రా పిన్ని అలా కూర్చుని మాట్లాడుకుందాం ఏంటి..? పిన్ని ఇందు ఇక్కడ ఉందని చూస్తున్నావా..? ఎంత కాదనుకున్నా భార్యాభర్తలం కదా..? ఇలా జరిగింది అని తెలిశాక నా మీద ఉన్న ప్రేమతో ఉండబట్టలేక నా దగ్గరకు వచ్చింది. నాకు సపర్యలు చేస్తుంది. ఏయ్‌ ఇందు.. అలా చూస్తున్నావు.. ఫస్ట్‌ టైం మీ రేఖ ఆంటీ మన ఇంటికి వచ్చింది కదా..? కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటూ ఇందును లోపలికి పంపిస్తాడు.. ఇందు లోపలికి వెళ్లగానే..

Advertisement

నువ్వు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని అనగానే.. నువ్వు చాలా అదృష్టవంతుడివి అనుకుంటాను అంటూ రేఖ చెబితే.. అదృష్టం నాది కాదు పిన్ని నీది.. ఎందుకంటే యాక్సిడెంట్‌ చేయించింది నువ్వే కదా..? అనగానే.. రేఖ కోపంగా ఏయ్‌ రాజు ఏం మాట్లాడుతున్నావు.. అంటూ నిలదీస్తే.. పిన్ని నాకు తెలుసు నువ్వే నన్ను చంపాలనుకున్నావు.. అనగానే.. నిన్ను నేను ఎందుకు చంపాలనుకుంటాను అంటూ రేఖ అడగ్గానే.. లక్కీ విషయం బయటకు రాకుండా ఉండటానికి నువ్వే ఇలా చేశావు.. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను.. లక్కీ గాడి కన్నతల్లివి నువ్వే అన్న విషయం నేను ఇంకొకరికి చెప్పాను.. ఒకవేళ నేను కనక పోయి ఉంటే ఆ నిజం బయటపడిపోయేది. నేను అలా సెట్‌ చేసి పెట్టాను.. నీ అంతట నువ్వే ఒప్పుకోవాలి. ఇంత చేశావు కాబట్టి నీ నోట నుంచే ఆ నిజాన్ని బయట పెట్టిస్తాను.. అనగానే.. రేఖ కోపంగా చాలా కాన్పిడెంట్‌గా ఉన్నట్టు ఉన్నావు.. అనగానే.. అవును చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను.. నీకో షాకింగ్‌ నిజం చెప్పనా..? నేను మళ్లీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాను.. అప్పుడు నీ చేత నిజం చెప్పిస్తాను అనగానే.. ఇందు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రేఖ కాఫీ వద్దని ఇందు నీతో మాట్లాడాలి కొంచెం పక్కకురా అంటూ ఇందును పక్కకు తీసుకెళ్తుంది రేఖ.

పక్కకు వెళ్లిన రేఖ కోపంగా ఇందును ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. దీంతో ఇందు కూడా మీరెందుకు వచ్చారు ఆంటీ అంటూ అడగ్గానే.. నేను రాజు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను నువ్వెందుకు వచ్చావు అని అడగ్గానే.. నేను రాజును చూడటానికి వచ్చాను అంటూనే.. రాజును మనం ఇంటి నుంచి పంపించాము.. మనమే ఇలా చేశాము అని అందరూ అనుకుంటారు.. ఎందుకంటే రాజును వాళ్ల అమ్మానాన్న బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక మాట అన్నారు.. మనలాంటి డబ్బున్న వాళ్ల ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు అంటూ చెప్పారు కదా..? ఆ నింద ఇప్పుడు మన మీదకు ముఖ్యంగా మీ మీదకు రాకూడదని నేను ఇక్కడకు వచ్చి రాజుకు సేవలు చేస్తున్నాను అంటూ రేఖను కన్పీజ్‌ చేస్తుంది. ఇందు మాటలకు రేఖ కన్పీజ్‌ అవుతూ ఇందును అక్కడే ఉండమని చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

ఉప్మా బాగాలేదని ఐశ్వర్య కోపంగా అపర్ణను తిడుతుంది. భ్రమరాంబ కూడా అంత మన కర్మ ఆ రాజు గాడు వచ్చాక అంతా ఇలా మారిపోయింది. ఆ రాజు గాడు వెళ్లిపోయాడని సంతోషించే లోపే ఆ నందు వచ్చింది. అంటూ తిడుతుంటే.. నందు వస్తుంది. శేషు చూసి భ్రమరాంబ అటు చూడు అంటూ రౌడీ మొత్తం చూసేసింది ఇక వీళ్లకు చుక్కలు చూపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. నందు దగ్గరకు వచ్చి భ్రమరాంబ, ఐశ్వర్యకు సపోర్టుగా అపర్ణను ఉప్మా చేయడం నీకు రాకపోతే.. నేను చేసేదాన్ని కదా అంటుంది. ఆ మాటలకు శేషు షాక్‌ అవుతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×