E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు  

Brahmamudi Serial Today Episode June 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: మరుసటి రోజు ఉదయం శోభనం గదిలోంచి కిందకు వచ్చిన రాజు అలసిపోయినవాడిలా నాటకం ఆడుతుంటే శేషు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీంతో రాజు ఫస్ట్‌ నైట్‌ రోజు ఏమవుతుందో నీకు తెలియదా మామయ్య అంటాడు రాజు. వెనక నుంచి భ్రమరాంబ, రేఖ అంతా వింటుంటారు. ఇంతలో పై నుంచి ఇందు కిందకు వస్తూ ఉంటుంది. ఇందు కూడా శోభనం అయిపోయినట్టు చీర పూలు బొట్టు చెరిపేసుకుని వస్తుంది. ఇందును అలా చూసిన రేఖ, భ్రమరాంబ షాక్‌ అవుతారు. భ్రమరాంబ మెల్లగా రేఖ ఏంటి నువ్వు ఇచ్చిన టాబ్లెట్‌ పనిచేయలేదు అనుకుంటా..? అసలు గదిలో ఏం జరిగి ఉంటుందో అర్థం కావడం లేదు.. అని చెప్తుంది. ఇంతలో రాజు మనసులో ఏయ్‌ ఇందు ఇప్పుడు చూడు నిన్ను ఓ ఆటాడేసుకుంటాను అనుకుంటూ ఏయ్‌ ఇందు అని పిలుస్తాడు..

దీంతో ఇందు కోపంగా ఏయ్‌ ఏయ్‌ ఏంటి.. అంటూ కోప్పడుతుంది. దీంతో రాజు కోపంగా శేషులో మామయ్య అసలు ఇందు ఎవరు…? అనగానే.. ఇందు ఈ ఇంటి వారసురాలు అని చెప్పగానే.. రాజు విసుగ్గా అది కాదు మామయ్య అసలు ఇప్పుడు ఇందు ఎవరు..? నా పెళ్లామే కదా? పెళ్లాన్ని ఏయ్‌ ఓయ్‌ ఓసేయ్‌ రావే పోవే అనొచ్చు కదా..? మరెందుకు అంతలా ఫీల్‌ అవుతుంది అని రాజు అడగ్గానే.. నువ్వు ఏదైనా అనేసెయ్‌ అల్లుడు నేను చూసుకుంటాను కానీ అంటాడు. ఇంతలో రేఖ ఇందును తీసుకుని కిచెన్‌ లోకి వెళ్తుంది. శేషు మాత్రం రాత్రి ఏం జరిగిందో తెలియకపోతే మనకు కడుపు ఉబ్బిపోతుంది అనుకుంటూ అల్లుడు రాత్రి నీకు ఇందుకు అక్కుంబక్కుం అయిపోయిందా..? అయినా మీకు ముందే అయిపోయింది కదా..? అనగానే.. అది సరే కానీ నువ్వు అర్జెంట్‌గా వెళ్లి ఆయిల్‌ తీసుకురాపో మామయ్య అని చెప్తాడు రాజు. ఎందుకని శేషు అడగ్గానే.. నా ఒంటి నొప్పులు తగ్గాలంటే మినిమం ఓ గంట సేపు నువ్వే నాకు మసాజ్‌ చేయాలి అని చెప్పగానే.. శేషు అలాగే అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

ఇందును పక్కకు తీసుకెళ్లిన రేఖ కోపంగా అసలు నీకు బుద్దిందా నేను చెప్పింది ఏంటి… నువ్వు చేసింది ఏంటి..? అంటూ తిడుతుంది. దీంతో ఇందు నేనేం చేశాను ఆంటీ..? అని అడగ్గానే.. భ్రమరాంబ వదినతో మత్తు మందు కలిపిన పాలు పంపించాను కదా..? వాడిచేత అవి తాగించలేదా..? అని అడగ్గానే.. తాగించాను ఆంటీ.. అని ఇందు చెప్పగానే.. మరి వాడేంటి అలా ఫస్ట్‌ నైట్‌ జరిగింది అని మాట్లాడుతున్నాడు అని రేఖ అడగ్గానే.. వాడి బొంద ఫస్ట్ నైట్‌ లేదు ఏమీ లేదు.. వాడు బిల్డప్‌ కొడుతున్నాడు అని చెప్పగానే.. రేఖ అనుమానంగా నువ్వు చెప్తుంది నిజమేనా.. అని రేఖ అడగ్గానే..

అవును ఆంటీ.. నిజమే వాడు ఆ పాలు తాగి రాత్రంతా పడుకున్నాడు. అసలు వాడంటేనే నాకు చిరాకు అసహ్యం  అసలు వాడంటనే నాకు పడదు. ఆంటీ త్వరగా వాణ్ని ఇంట్లోంచి పంపించేయండి అని చెప్పగానే.. రేఖ అనుమానంగా మనసులో నిజంగానే ఏమీ జరగలేదా..? ఇది ఏమైనా కవర్‌ చేస్తుందా..? అని అనుకుంటుంటే.. ఇందు ఏంటి ఆంటీ మీరు నన్ను ఇంకా అనుమానిస్తున్నారా..? అని అడగ్గానే.. అనుమానం కాదు కానీ వాడు చెప్పే దానికి నువ్వు చెప్పే దానికి ఎక్కడ పొంతన లేదు ఏంటి..? అని అడగ్గానే.. వాడొక లూఫర్‌ వాడి మాటలు నువ్వు నమ్ముతావా…?అంటూ రేఖకు నమ్మకం కలిగేలా ఇందు చెప్తుంది. రేఖ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రూంలోకి వెళ్లిన రాజును ఇందు తిడుతుంది. ఏంటి చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు అని అడగుతుంది. దీంతో రాజు నా పరువు కాపాడుకోవడానికి నేనేవో తిప్పలు పడ్డాను.. అయినా నువ్వేంటి నన్ను మరీ చిన్న పిల్లాడిని చేసి ఆడుకుంటున్నావు అంటూ రాజు బాధపడుతుంటే.. నువ్వు చేసిన ఈ ఎక్స్‌ట్రాలకు నీ పెమెంట్‌లో కొంత కట్‌ చేస్తున్నాను అంటూ చెప్పగానే.. రాజు కోపంగా ఇందును బ్లాక్‌ మెయిల్‌ చేయగానే.. సరే పేమెంట్‌ ఏమీ కట్‌ చేయనులే అంటూ వెళ్లిపోతుంది. అప్పుడే రాజుకు ఫోన్ వస్తుంది. కాల్ మాట్లాడిన రాజు వెంటనే భయంగా ఇప్పుడే వస్తున్నాను అంటూ వెళ్లిపోతాడు.

ఇంటి దగ్గర వెంకట్‌ సూసైడ్‌ అటెంప్ట్‌ చేసి ఉంటాడు. రాజు వెళ్లి వెంటక్‌ ను తిట్టి పక్కనే కూర్చుని తింటున్న చలపతిని తిడుతూ.. అసలు నువ్వు కన్నతండ్రివేనా..? అని అడగ్గానే.. చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. దీంతో చలపతి కోపంగా నేనే నీ కన్నతండ్రి, అదే నిన్ను తొమ్మిది నెలల మోసి కన్న తల్లి అంటూ చెప్తాడు. అలాగే వెంకట్‌ పరిస్థితి చూసి ఏం జరిగిందని రాజు అడగ్గానే.. జరిగిన విషయం మొత్తం చెప్పి ఎమోషనల్ అవుతాడు. దీంతో రాజు తాను బిజినెస్‌లో సక్సెస్‌ అవుతానని మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంత వరకు మీరు ఓపిక పట్టండి అని చెప్తాడు. మరోవైపు నిద్రలేచిన ఐశ్వర్య కిందకు వస్తూ ఇందును పిలుస్తుంది. కిచెన్‌ వర్క్‌ చేస్తున్న ఇందు పలకకపోవడంతో కోపంగా తిడుతుంది. నీ కళ్లు నెత్తికెక్కాయి అంటూ కోప్పడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×