BigTV English

Brahmamudi Serial Today June 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను కాపాడిన అప్పు – షాక్ లో యామిని

Brahmamudi Serial Today June 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను కాపాడిన అప్పు – షాక్ లో యామిని

Brahmamudi serial today Episode: రాజ్‌ తీసుకొచ్చిన పండ్లు తింటూ కావ్య మీకేమైనా తల తిరుగుతున్నట్టు ఉందా అని అడుగుతుంది. లేదని ఈ అడవే తిరుగుతున్నట్టు ఉందని చెప్తాడు రాజ్‌. అవును నాకు అలాగే ఉందని కావ్య చెప్తుంది. దీంతో ఇద్దరూ మత్తుగా సాంగ్‌ పాడుకుంటారు. కొద్దిసేపటికి మత్తుగా ఇద్దరూ స్పృహ కోల్పోతారు. ఇంతలో రౌడీలు అక్కడకు వస్తారు. ఇద్దరూ మత్తుగా పడి ఉండటం చూసి వెంటనే వాళ్లిద్దరినీ చంపాలని దగ్గరకు వెళ్తుంటారు. మరోవైపు అప్పు కూడా పోలీసులతో రాజ్‌ వాళ్లను వెతుకుతూ వస్తుంది. రౌడీ కత్తి తీసుకుని కావ్యను పొడవబోతుంటే.. కట్‌ అవుతుంది. తెల్లారిన తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ రాజ్‌, కావ్య కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇంద్రాదేవి ఫోన్‌ చేస్తుంది. కానీ కలవదు.


రుద్రాణి మాత్రం మీరు ఎంత ట్రై చేసినా వాళ్లు మీకు  దొరకరు. ఆ యామిని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పాటికి ఆ రౌడీలు ఆ కావ్యను ఫినిష్‌ చేసి ఉంటారు. రాజ్‌ కావ్య శవం ముందు కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అపర్ణ కంగారుగా అత్తయ్యా ఏమైనా తెలిసిందా..? అప్పు ఫోన్‌ రింగ్‌ అవుతుందా..? అని అడుగుతుంది. దీంతో లేదు అపర్ణ ఫోన్‌ నాట్‌ రీచబుల్‌ అని వస్తుంది అంటుంది ఇంద్రాదేవి. అసలు వాళ్లు అడవిలో తప్పిపోవడం ఏంటి..? అప్పు వాళ్లను వెతుక్కుంటూ వెళ్లడం ఏంటి.. అడవిలో రాత్రంతా ఉన్నారంటే నాకు భయం వేస్తుంది అంటుంది ధాన్యలక్ష్మీ.. దీంతో ప్రకాష్‌ ధాన్యం అసలే వదిన కంగారు పడుతుంటే వాళ్లను ఇంకా నువ్వు కంగారు పెడతావేంటి..? అంటాడు. సుభాష్‌ కూడా అవును అపర్ణ అప్పు పోలీసులను తీసుకుని వెళ్లింది కదా..? తప్పకుండా వాళ్లను కాపాడి ఉంటుంది కంగారు పడకు తప్పకుండా వాళ్లు తిరిగి వస్తారన్న నమ్మకం నాకుంది అంటాడు.

దీంతో రుద్రాణి అని వదినను మోసం చేస్తున్నావా..? లేకపోతే నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటున్నావా..? అన్నయ్యా.. కోపంగా కాదు.. కాస్త లాజికల్‌ గా ఆశించండి వెళ్లింది ఏమైనా రుద్రమదేవి అనుకున్నారా..? అందరినీ మట్టు పెట్టి తిరిగి రావడానికి నిన్న కాక మొన్న జాయిన్‌ అయింది డ్యూటీలో అప్పుడు కూడా అంతే రాజ్‌, కావ్య శ్రీశైలానికి వెల్లినప్పుడు రాజ్‌ కనిపించకుండా పోయాడు. ఇప్పుడేమో ఇద్దరూ కనిపించకుండా పోయారు. అంటూ మాట్లాడుతుంటే.. ఇంద్రాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. అసలే మేము వాళ్లకు ఏమైందని కంగారు పడుతుంటే.. అంత క్రూరంగా ఎలా మాట్లాడతున్నావే అంటుంది. దీంతో రుద్రాణి అంతేలేమ్మా..? కాసేపట్లో అప్పు  డల్లుగా వచ్చి ఆపరేషన్‌ ఫెయిల్‌ అయిందని చెప్తుంది చూడండి అంటుంది. దీంతో రుద్రాణి ని ఇంద్రాదేవి తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది.


రుద్రాణి వెళ్లిపోయాక అపర్ణ కంగారు పడుతుంది. మరోవైపు యామిని రౌడీలకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ కలవదు. యామిని కంగారు పడుతుంది. ఇంతలో వైదేహి కాఫీ తీసుకని వస్తుంది. అవును రాత్రి ఆ కావ్యను ఏదో చేయడానికి ప్లాన్‌ చేశాను అన్నావు ఇంతకీ ఏం ప్లాన్‌ చేశావు అని అడుగుతుంది. కోపంగా యామిని ప్లాన్‌ ఏమీ  లేదు డైరెక్టుగా దాన్ని పైకి పంపించేందుకు టికెట్‌ బుక్‌ చేశాను అని చెప్తుంది. అర్థం కానట్టు వైదేహి అంటే అని అడుగుతుంది. దాన్ని చంపమని రౌడీలకు సుపారి ఇచ్చాను అని చెప్తుంది. షాకింగ్‌గా వైదేహి ఏంటే నువ్వు చెప్పేది.. చంపమని సుపారి ఇవ్వడమేంటి..? అని అడుగుతుంది. దీతో యామిని అవును మమ్మీ నేను బావను  సొంతం చేసుకోవడానికి ప్లాన్‌ వేసి రిసార్ట్‌ కు తీసుకెళితే అక్కడకు వచ్చి నా ప్లాన్‌ వేస్ట్‌ చేసింది. బావను నా సొంతం చేసుకున్నామనుకున్న ప్రతిసారి అది పంటి కింద రాయిలా తయారయింది. అందుకే దాన్ని చంపమని రౌడీలను పంపించాను. అంటూ కోపంగా అక్కడి నుంచి వెల్లిపోతుంది. వైదేహి ఆలోచనలో పడిపోతుంది.

మరోవైపు ఒక దగ్గర పడుకుని ఉంటారు. పక్కనే రౌడీలు చెట్టుకు కట్టేసుకుని ఉంటారు. రాజ్‌ నిద్ర లేచి రౌడీలను చూసి షాక్‌ అవుతాడు. కావ్యనే రౌడీలను కొట్టి చెట్టుకు కట్టేసిందనుకుని కావ్యను నిద్ర లేపి మెచ్చుకుంటాడు. నిద్ర మత్తులో రౌడీలను చూసిన కావ్య షాక్‌ అవుతుంది. వాళ్లను కట్టేసింది తను కాదని చెప్తుంది కావ్య. మరి ఎవరు కట్టేశారని రాజ్‌ అడగ్గానే నేను కట్టేశానని అప్పు వస్తుంది. రాత్రి జరిగింది చెప్తుంది అప్పు. తర్వాత రౌడీలను స్టేషన్‌కు తీసుకెళ్తుంది.

మరోవైపు ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు. ఇంతలో కావ్య, అప్పు ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఏమైందని అందరూ అడగ్గానే రాత్రి అడవిలో జరిగింది మొత్తం చెప్తుంది కావ్య. అసలు ఆ రౌడీలు ఎవరు మీ వెంట  ఎందుకు పడ్డారు. నిజంగా మీతో గొడవ పడిన వాళ్లే అయితే రాత్రంతా మీ వెంట పడాల్సిన అవసరం ఏముంది వాళ్లకు దీని వెనక ఏదో కుట్ర ఉందేమోనని సుభాష్‌ అనుమానిస్తాడు. అదంతా నేను తెలుసుకుంటానని అప్పు చెప్తుంది. కళ్యాణ్‌ వచ్చి అప్పును అప్రిసియేట్‌ చేస్తాడు. అందరూ హ్యపీగా ఉంటారు. వాళ్లను చూసిన రుద్రాణి ఎంత నవ్వుకుంటారో అంత ఇవాళే నవ్వుకొండి రేపటి నుంచి ఆ యామిని ఇచ్చే షాక్‌ మామూలుగా ఉండదు అనుకుంటుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రాజ్‌ అక్కడ పెళ్లి పనులు మొదలు పెట్టడం చూసి షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×