Gundeninda GudiGantalu Today episode june 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాకు బాలు 500 మాలలు కట్టే ఆర్డర్ ఇప్పించడంతో ఇంట్లో సందడి వాతావరణం ఏర్పడింది. ఈ క్రాంట్రాక్ట్ ఎలాగైన పూర్తి చెయ్యాలని మీనా కంకణం కట్టుకుంది. బాలు సాయంతో మాలలు కట్టెందుకు మీనా రెడీ అవుతుంది. బస్తి జనాలు మాలలు కట్టడం కోసం మీనాకు సాయంగా వస్తారు. సత్యం ఇల్లంతా పూలతో నిండిపోతుంది. ఇక రవి తన కిచిడీతో అందరికీ కడుపునిండా భోజనం పెడతాడు. మనోజ్, రవిలు మాత్రం మేము ఆర్డర్ పెట్టుకుంటాం మాకొద్దు అనేసి అంటారు. ఈ విన్న బాలు మనోజ్ పై సెటైర్లు వేస్తాడు. అందరు మౌనిక మాట్లాడుతుంటే రోహిణి, మనోజ్ మాత్రం కిచిడి దొంగలుగా మారుతారు. ఎవరికి తెలియకుండా కిచెన్ లో కిచిడిని తినేస్తారు. ఇక సుమతి ప్రవర్తన పై ప్రభావతి సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుమతి రవి తో క్లోజ్ గా ఉండడం ఓర్వలేని ప్రభావతి శృతికి క్లాస్ పీకుతుంది. సుమతికి వార్నింగ్ ఇవ్వాలని కోరుతుంది. శృతి మాత్రం బయటకు వచ్చి అందరికి అభిప్రాయం కనుక్కుంటుంది. రవి, శృతి క్లోజ్ గా ఉండటం మీకు ఎవరికైనా అభ్యంతరంగా ఉందా అనేసి అడుగుతుంది. మా సుమతి చాలా మంచిది మాకెందుకు అభ్యంతరమవుతుందని బస్తీ జనాలు అంటారు. ఇక రవి శృతి ఏమైంది ఏం చేస్తున్నావ్.? నాకేమీ అనుమానం లేదు మీ అమ్మకే అనుమానంగా ఉంది అందుకే క్లారిటీ ఇద్దామని ఇలా తీసుకొచ్చాను అని శృతి ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.
అంకుల్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్లు మీతో మాట్లాడితే అంకుల్ మిమ్మల్ని అనుమానిస్తున్నాడా..? ఆ కాలంలో పద్ధతులు వేరు ఈ కాలంలో పద్ధతులు వేరు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానంగానే ఉంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలా మీకు మీ కొడుకు మీద నమ్మకం లేదేమో కానీ నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అంటూ ప్రభావతి గూబ మీద కొట్టినట్లు సమాధానం చెప్తుంది.
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రభావతి బుద్ధి పై మండిపడతారు. మా బస్తి పిల్లల్ని మేము చిన్నప్పటినుంచి చూస్తున్నాం మాకు ఎవరెలాంటోలో తెలియదా మీరు ఇలా అనుమానించడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి అంటూ అందరూ ప్రభావతి తలా ఒక మాట అనేస్తారు. ఆ మాటలు విన్న సత్యం ప్రభావతిని లోపలికి తీసుకెళ్లి గట్టిగా చివాట్లు పెడతాడు. అనుమానించాల్సిన వయసులో ఉన్నావా.. చిన్నపిల్లలకు ఉన్న జ్ఞానం కూడా నీకు లేకపోయా. అందరి ముందర నా తల కొట్టేసినట్లు అనిపించింది అందుకే అక్కడికి ఏమీ మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడుతున్నానని ప్రభావతికి క్లాస్ పీకుతాడు. దాంతో ప్రభావతి ఫీల్ అవుతుంది.. ఈయన మాటలకు ఏం కానీ శృతి నన్ను అడ్డంగా ఇరికించిందని ఫీల్ అవుతుంది.
రవి, శృతిల రొమాన్స్, మనోజ్, రోహిణిల ఆటలు, మీనా బాలు కౌంటర్స్ అన్ని సరదాగా ఉన్నాయని సత్యం హ్యాపిగా ఫీల్ అవుతాడు. ఇక మొత్తానికి రాత్రి పూలమాలలు పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు. అందరూ కలిసి మాలలు కంప్లీట్ చేసినందుకు సెల్ఫీలు దిగుతారు. ఎలాగైనా సరే ఈ మాలల్ని జాగ్రత్తగా ఎమ్మెల్యే దగ్గరికి పంపించాలని మీనా బాలు అనుకుంటారు. ఇక బస్తి జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ మాలల కోసం బాలు ఆటోను పిలుస్తాడు.. గుణ మాత్రం శివకి తెలియకుండా ఎలాగైనా సరే ఆ మాలల్ని మండపానికి చేరనివ్వకుండా దాచాలని అనుకుంటాడు. తన మనుషులకి ముందుగానే ప్లాన్ చేసి చెప్తాడు. ఉదయం లేవగానే బాలు వాళ్ళ ఇంటి దగ్గర గుణ మనుషులు కాపలా ఉంటారు.. బాలు అదే గమనించడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లోఏం జరుగుతుందో చూడాలి…