Brahmamudi serial today Episode: కళ్యాణ్, అప్పు కారులో వెళ్లిపోతుంటే ధాన్యలక్ష్మీ చూస్తుంది. తను చూసింది నిజంగా కళ్యాణేనా.. వెళ్లింది వాళ్లేనా..? ఒకవేశ నాకు మస్కా కొట్టి పారిపోయారా ఏంటి అయినా ముందు వాళ్లు గదిలో ఉన్నారేమో చూద్దా అనుకుని లోపలికి వెళ్తుంది. మరోవైపు గదిలో ఉన్న రాజ్, కావ్య గొడవపడుతుంటారు. బయటి నుంచి ధాన్యలక్ష్మీ వచ్చి డోర్ దగ్గర వింటుంది. అది పసిగట్టిన రాజ్.. కావ్యను మౌనంగా ఉండమని చెప్పి తన దగ్గర ఫోన్‌లో ఉన్న కళ్యాణ్ వాయిస్ ప్లే చేస్తాను మీరు మీ ఫోన్‌లో ఉన్న అప్పు వాయిస్ ప్లే చేయండి అని చెప్తాడు. సరేనని కావ్య అంటుంది. ఇద్దరూ ఇద్దరి వాయిస్ ప్లే చేయగానే బయటి నుంచి విన్న ధాన్యలక్ష్మీ చీ అనవసరంగా అనుమానించాను వీరు నిజంగా గదిలోనే ఉన్నారు అనుకుంటుంది.
ఇంతలో వెనక నుంచి ప్రకాష్ వస్తాడు. కంగారు పడిన ధాన్యలక్ష్మీ.. ఏంటండి మీరు అలా వెనక వచ్చి నిలబడ్డారు. ఎవరో అనుకుని బయపడ్డాను అంటుంది. దీంతో ప్రకాష్ కోపంగా నీకసలు బుద్దిందా..? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అంటాడు. ధాన్యలక్ష్మీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు అని అడుగుతుంది. ఎందుకు తిడుతున్నానో నీకు ఇంకా అర్తం కాలేదా..? కొడుకు కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ల మాటలు వినడానికి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా..? అంటాడు ప్రకాష్. దీంతో చాల్లే ఊరుకోండి నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు అంటుంది ధాన్యం. అందుకేనా ఇలా చాటుగా వింటున్నావు అంటాడు. అయ్యో అది కాదండి ఇందాక ఎవరో బయటకు వెళ్లారు. మన కళ్యాణ్ వాళ్లేమోనని అనుమానం వచ్చి గదిలో ఉన్నారేమోనని వచ్చి వాళ్ల మాటల వింటున్నా… అని చెప్తుంది ధాన్యలక్ష్మీ. అయినా నేను చూశాను కాబట్టి సరిపోయింది కానీ వేరే ఎవరయినా చూస్తే అంటూ ధాన్యలక్ష్మీని తీసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు ప్రకాష్.
మరోవైపు అప్పు, కళ్యాణ్ ఇద్దరూ కారులో మణికొండ వైపు వెళ్తుంటారు. ఇంకోవైపు హాల్లో కూర్చున్న అపర్ణ, ఇంద్రాదేవి మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ అప్పు శోభనం గదిలోకి వెళ్లారు. మరి రాజ్, కావ్య వాళ్లు ఎక్కడికి వెళ్లారు అంటుంది ఇంద్రాదేవి. ఇల్లు మొత్తం చూశాను అత్తయ్యా ఎక్కడా కనిపించలేదు అని చెప్తుంది అపర్ణ. ఇందాక పెళ్లికి వద్దన్నాను కదాని ఏకంగా శోభనానికే ప్లాన్ చేశాడా ఏంటి వీడు అంటుంది ఇంద్రాదేవి. దీంతో ఊరుకోండి అత్తయ్యా నా కొడుకు అలాంటి వాడేం కాదు అంటుంది అపర్ణ. దీంతో అవునా అందుకేనా బూత్ బంగ్లాకు తీసుకెళ్లాడు.. ఉండూ ఫోన్ చేస్తాను అంటూ రాజ్ కు ఫోన్ చేస్తుంది ఇంద్రాదేవి. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ఇంద్రాదేవి ఎక్కడున్నావు ఇందాకటి నుంచి నీ కోసం చూస్తున్నాము.. నువ్వు కనిపించడం లేదు. నా మనవరాలు కనిపించడం లేదు అని అడుగుతుంది. దీంతో రాజ్ వావ్ నాన్నమ్మ నీకు పదికి పది మార్కులు పడ్డాయి. కళావతి గారు నాతోనే ఉన్నారు. అని చెప్పగానే.. అనుకున్నాను.. ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు..అని అడుగుతుంది. దీంతో కావ్య ఫోన్ లాక్కుని ఏం లేదు అమ్మమ్మ ఇందాక మీ మనవడు పూలు ఎక్కువ తెచ్చారు కదా వాటిని ఆరబెట్టి అగరబత్తీలు చేద్దామని టెర్రస్ మీద ఉన్నామని చెప్తుంది.
మరోవైపు స్టేషన్ లోంచి తప్పించుకున్న దొంగ చార్లెస్ ను చేజ్ చేస్తూ అప్పు, కళ్యాణ్ వెళ్తుంటారు. వాడు తప్పించుకుని పారిపోతాడు. అలా పారిపోయిన చార్లెస్ దుగ్గిరాల ఇంట్లో దూరతాడు. రాజ్, కావ్య ఉన్న శోభనం గదిలోకే దొంగతనానికి వెళ్తాడు. ఇంట్లో కరెంట్ తీసి రూంలో దొంగతనం చేయాలనుకుంటాడు అందుకోసం ఇంట్లో కరెంట్ తీసేస్తాడు. చీకట్లో రూంలోకి వెళ్లి రాజ్, కావ్యలను తాడుతో కట్టేస్తాడు. తర్వాత వెళ్లి కరెంట్ వేస్తాడు. రాజ్, కావ్య కంగారుపడుతుంటే.. చార్లెస్ కనిపిస్తాడు. ఇద్దరూ భయపడతారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు.. అసలు నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా అని అడుగుతారు. శోభనం చేసుకోవడానికి రెడీగా ఉన్న ఒక కొత్త జంట దగ్గరకు వచ్చాను అంటాడు.
వాడి మాటలకు రాజ్ ఉబ్బిపోతాడు. వీడు మనల్ని భార్యాభర్తలు అనుకుంటున్నాడండి అంటాడు రాజ్. వాడు అనడం కన్నా మీ సిగ్గు ఎక్కువై పోయింది అంటుంది కావ్య. చార్లెస్ కంగారుగా మీరిద్దరూ భార్యాభర్తలు కాదా అని అడుగుతాడు. కాదు అని కావ్య చెప్తుంది. అంటే ఈ ఫస్ట్ నైట్ మీది కాదా..? అని అడుగుతాడు చార్లెస్. ఇందాకటి నుంచి అదే కదరా చెప్తున్నాము అంటూ కావ్య కోప్పడుతుంది. దీంతో చార్లెస్ ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నా సిక్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు కాదే.. మీ ఇద్దరు భార్యాభర్తలు గానే కనిపిస్తున్నారు.. అని చెప్పగానే రాజ్ హ్యాపీగా థాంక్యూ బ్రో అంటాడు.
దీంతో చార్లెస్ గాడు మీరిద్దరూ ఉదయం వరకు నాకు ఇలాగే కో ఆపరేట్ చేయాలి అంటాడు. దీంతో కావ్య కోపంగా ఒరేయ్ నిన్ను వెతుకుతున్న పోలీస్ నా చెల్లెలు.. మర్యాదగా మమ్మల్ని వదిలి నా చెల్లికి లొంగిపో అంటుంది. అలా చేయను కదా.. ఆ పోలీసు రాత్రంతా నాకోసం సిటీ మొత్తం వెతికి అలిసిపోయి ఇంటికి వచ్చే టైంకు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటూ వెళ్లి స్వీట్లు తింటుంటాడు. రాజ్, కావ్య కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అది కాకపోవడంతో మెల్లగా ఫోన్ తీసుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?