Tollywood:సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని.. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని ఒడిసి పట్టుకుంటూ తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే.. ఎన్నో ఇబ్బందులు తెలియకుండానే వారిని మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలోనే తనను కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారని, ప్రత్యేకించి ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని బలవంత పెట్టారు అంటూ ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్ అయింది. ఆమె ఎవరో కాదు సమీరారెడ్డి (Sameera Reddy). ఎన్టీఆర్ (NTR) తో కలిసి నరసింహుడు ,అశోక్ వంటి చిత్రాలలో నటించి రూమర్స్ కూడా మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాధను వెళ్లబుచ్చుకుంది.
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం..
తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె మోడల్ గా కెరియర్ ఆరంభించింది. తెలుగులో హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘జై చిరంజీవ’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఈమెకు మంచి గుర్తింపును అందించింది. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో ‘అశోక్’ సినిమా చేసి.. ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత చాలాకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ రానా (Rana )హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక తర్వాత హిందీ సినిమాలలో ఎక్కువగా కనిపించింది. అంతేకాదు అప్పుడప్పుడు తమిళ్లో పలు చిత్రాలలో నటించిన ఈమె.. 2013 తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని బలవంత పెట్టారు- సమీరా రెడ్డి
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో నా శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయి. ఆ సమయంలో చాలామంది నన్ను ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు అంటూ కూడా ఎమోషనల్ అయింది. సమీరా రెడ్డి మాట్లాడుతూ..” శరీరంలో అనూహ్య మార్పులు రావడం వల్ల చాలామంది నన్ను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. అయితే చాలామంది చేయించుకుంటున్నారు.. నీకేమైంది అని పదే పదే నన్ను ఇబ్బంది పెట్టేవారు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. కానీ నా సమస్యను నేను పరిష్కరించుకోగలను. అవేవీ ఆలోచించకుండా నాపై ఒత్తిడి తీసుకురావడం నన్ను మరింత మానసిక వేదనకు గురిచేసింది” అంటూ సమీరారెడ్డి ఎమోషనల్ అయ్యింది. ఇక ప్రస్తుతం సమీరా రెడ్డికి సంబంధించి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే చాలా రోజుల తర్వాత ఒక ఈ అవార్డు వేడుకలో కనిపించిన ఈమె.. అక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
ALSO READ:Kamal Haasan: క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. కమలహాసన్ షాకింగ్ కామెంట్స్..!