E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 12th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ కు షాక్ ఇచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీ 

Brahmamudi Serial Today November 12th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ కు షాక్ ఇచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీ 
Advertisement

Brahmamudi serial today Episode:

కిచెన్‌లో రాజ్‌ చికెన్‌ మంచూరియా చేస్తుంటే అందరూ వస్తారు. దీంతో రాజ్‌ ఇదేటి కళావతి ఇలా ఇరికించావు నన్ను అంటాడు. దీంతో కావ్య భార్య కోసం మీరు పడుతున్న తిప్పలు నలుగురికి తెలియకపోతే ఎలాగా..? పెళ్లాం కోసం చేసిన ఈ చికెన్‌ మంచూరియా టేస్ట్‌ పది మందికి తెలియకపోతే మీ శ్రమక విలువ ఏముంటుంది అండి అందుకే తీసుకొచ్చానండి అంటుంది కావ్య. నన్ను వీళ్లకు బలి ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యావన్నమాట అంటాడు. ఇంతలో ఇంద్రాదేవి ఏరా ఈ ముసల్ది నడుం నొప్పిగా ఉంది కాస్త మందు రాయరా అంటే ఖాళీగా లేను అంటావా..? కానీ పెళ్లానికి చికెన్‌ మంచూరియా.. అని అడగ్గానే.. అది కూడా అర్ధరాత్రి అత్తయ్యా అని ధాన్యలక్ష్మీ చెప్తుంది.

అపర్ణ కూడా కన్నతల్లిని కాస్త హెడేక్‌ టాబ్లెట్‌ తెచ్చివ్వరా అంటే హెడ్‌ తిప్పుకుని వెళ్లిపోతావా.? అంటుంది. అందరూ కలిసి నీ పెళ్లానికి చికెన్‌ మంచూరియా..? అంటారు ఇంతలో ప్రకాష్‌ ఆఫీసుకు రావడానికి బిజీ.. అంటే సంతకాలు చేయడానికి మాత్రం బిజీ అని ధాన్యలక్ష్మీ అంటుంది.. మీటింగ్‌ లకు ఆటెండ్‌ కావడానికి మాత్రం బిజీ అని ప్రకాష్‌ అంటాడు. కానీ నీ పెళ్లానికి చికెన్‌ చేయడానికి.. అనబోతుంటే.. రాజ్‌ బాధగా మీక దండం పెడతాను నన్ను వదిలేయండి.. నా పెళ్లాం నాకు ఇంత ట్విస్ట్‌ ఇస్తుందని అనుకోలేదు.. అనగానే.. కావ్య వాళ్లు నీ వంటకు రివ్యూ ఇస్తున్నారండి అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా రూంలోకి వెళ్లిపోతాడు.  తెల్లవారని వాడి పని చెప్తాను అంటుంది ఇంద్రాదేవి.

Advertisement

పొద్దున్నే అందరూ హాల్లో కూర్చుని రాజ్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. అపర్ణ రాత్రి అనుకున్నది గుర్తు ఉందా..? అని అడగ్గానే.. అపర్ణ ఎలా మర్చిపోతాను అత్తయ్య అంటుంది. మర్చిపోయే పని చేశాడా సారూ.. మీరు చెప్పాక షాక్‌ అయ్యాను నేను అంటాడు సుభాష్‌. ఇంతలో రాజ్‌ రూంలోంచి వచ్చి అందరినీ చూసి హాయ్‌ నాన్న ఏంటి పొద్దున్నే మీటింగ్‌ పెట్టారు. ఎవర్ని మోసేద్దాం అని అడగ్గానే.. ఏరా ఇప్పుడా లేవడం అని ఇంద్రాదేవి అడగ్గానే.. ఇంట్లో పనులుంటాయని తెలియదా..? అంటూ సుభాష్‌ అనగ్గానే.. ఎవరికి ఏం కావాలో చూసుకోవాలని తెలియదా..? అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ.. దీంతో రాజ్‌ అయోమయంగా చూస్తుంటాడు. అందరూ తమకేం కావాలో రాజ్‌ కు చెప్తుంటారు. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు.

హలో ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు..? అనగానే.. నిన్నే అడుగుతున్నాము అని ఇంద్రాదేవి చెప్తుంది. అవన్నీ నువ్వే స్వయంగా చేసుకుని తీసుకురావాలి అని చెప్తుంది అపర్ణ. దీంతో రాజ్‌ కోపంగా నేనేమన్నా హోటల్‌ లో సర్వర్‌ ను అనుకుంటున్నారా… లేకపోతే ఈ ఇంట్లో సర్వెంట్‌ ను అనుకుంటున్నారా..? రాజ్‌.. స్వరాజ్‌ ది గ్రేట్‌ బిజినెస్‌ మ్యాన్‌.. తెలుసా..? అని చెప్పగానే..అవునా అలాగా.. మరి నిన్నటి చికెన్‌ మంచూరియా సంగతేంటి బాబు అని ఇంద్రాదేవి అడగ్గానే.. పెళ్లాలకు బిజినెస్‌ మ్యాన్స్‌ అలాగే చికెన్‌ మంచూరియా చేసి పెడతారు మీకు తెలియదా అత్తయ్యా అంటుంది ధాన్యలక్ష్మీ.. దీంతో ఇంద్రాదేవి ఎందుకు తెలియదు.. బాబు గారికి పెళ్లాం బెల్లం అయింది. అందుకే రాత్రి అల్లం నూరాడు.. అని చెప్పగానే.. మనం కాఫీలు అడిగితే మాత్రం కారాలు నూరుతున్నాడు అని అపర్ణ అంటుంది. చికెన్‌ అదిరిపోయిందట గదా  అని సుభాష్‌ అడగ్గానే..

Advertisement

అబ్బో మామూలుగా కాదు అన్నయ్యా.. అంటాడు ప్రకాష్‌.. పెళ్లాం కోరిక మరి ఎంత  కష్టపడ్డాడో అని ధాన్యలక్ష్మీ.. ఇంతలో అందరికీ కాఫీ తీసుకుని వచ్చిన కావ్య హలో హలో ఏంటి అందరూ మా ఆయన మీద పడ్డారు అసలే మా  ఆయన నాజూకు అందరూ పడితే పచ్చడి అయిపోతారు.. అంటూ ఎవరికి ఏ కాఫీ కావాలో చెప్పి మరీ ఇస్తుంది కావ్య. దీంతో నిన్ను ఎవరు చేయమన్నారే అని అపర్ణ అడగ్గానే.. మా ఆయనకు కొంచెం శ్రమ తగ్గిద్దామని నేనే చేశాను. అని కావ్య చెప్పగానే. శ్రమ తగ్గించడం ఏంటి..? అని అందరూ అడగ్గానే.. తన కోరిన వంటలన్నీ ఆయన చేసి పెడతారని అందుకే నేను చేశను అంటుంది. దీంతో అపర్ణ, ధాన్యలక్ష్మీ తమ మొగుళ్లు ఎప్పుడూ తమకు చేయలేదని బాధపడగానే.. సుభాష్‌, ప్రకాష్‌ రోషంగా లేచి కిచెన్‌లోకి వెళ్తారు. అతి కష్టం మీద.. ఉప్మా చేసి తీసుకొస్తారు. ఆ ఉప్మా తిన్న ధాన్యలక్ష్మీ, అపర్ణ వాంప్టింగ్స్‌ చేసుకుంటారు. ప్రకాష్‌, సుభాష్‌ను తిడతారు.

రాహుల్‌కు తన ఫ్రెండ్‌  ఫోన్‌ చేసి నేను ఇచ్చే డీల్‌ విన్న తర్వాత నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్లిపోతాను అని చెప్పగానే.. రాహుల్‌ సరే అంటూ బయటకు వెళ్తాడు. తన ఫ్రెండ్‌ను కలిసి నేను ఇప్పుడు ఇలాంటి పనులు చేయడం లేదు అని చెప్తాడు. ఈ డీల్‌ చేస్తే నీకు ఇరవై లక్షలు లాభం వస్తుంది అని చెప్పగానే.. రాహుల్ చేయనని చెప్తాడు. ఒకవైపు నుంచి స్వప్న, ఇంకోవైపు నుంచి రుద్రాణి వింటుంటారు. రాహుల్‌ తాను తప్పుడు పనులు చేయనని ఇంకెప్పుడూ ఇలా చేయనని తనను కలవద్దని చెప్పి వెళ్లిపోతుంటే రుద్రాణి వెళ్లి రాహుల్‌ను ఆపి తిడుతుంది. ఇంతలో స్వప్న వచ్చి రాహుల్‌ ను మెచ్చుకుని రుద్రాణిని తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

Big Stories

Advertisement
×