BigTV English

Brahmamudi Serial Today October 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కళ్యాన్‌ తిట్టి పంపించేసిన రైటర్‌ లక్ష్మీకాంత్‌ – రుద్రాణి భర్త ఎంట్రీకి రంగం సిద్దం

Brahmamudi Serial Today October 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కళ్యాన్‌ తిట్టి పంపించేసిన రైటర్‌ లక్ష్మీకాంత్‌ – రుద్రాణి భర్త ఎంట్రీకి రంగం సిద్దం

Brahmamudi serial today Episode:  అనామికతో ఫోన్‌ మాట్లాడిన సెక్షన్‌ మేనేజర్‌ ను  సెక్యూరిటీ గార్డుగా డీమోట్‌ చేస్తుంది కావ్య. సెక్యూరిటీ గార్డును పిలిచి తనకు యూనిఫాం ఇవ్వమని ఇప్పటి నుంచి నువ్వు పార్కింగ్‌ దగ్గర డ్యూటీ చేయమని.. అతన్ని మెయిన్‌ ఎంట్రన్స్‌ దగ్గర ఉండమని చెప్తుంది. దీంతో ఆ ఉద్యోగి కావ్యను బతిమాలుతాడు. అయినా కావ్య వినదు. ఇక ఎవరి పనుల వాళ్లు చూసుకోండని చెప్తుంది.


అందరూ తమ పనుల్లో నిమగ్నం అయినా శృతి మాత్రం కావ్యను అలాగే చూస్తుంది. నువ్వేంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది కావ్య. ఏం లేదు మేడం మీ పెళ్లి అయి ఆరు నెలలు అయిందా..? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే రాజ్‌ సార్‌ కన్నా ఎక్కువ పవర్‌ఫుల్‌ గా కనిపిస్తున్నారు. ఆరు నెలలు సావాసం చేస్తే లక్షణాలు అబ్బుతాయట కదా. అంటుంది శృతి.. కోపంగా నిన్ను కూడా సెక్యూరిటీగా చేస్తావా? అంటుంది కావ్య. అయ్యో వద్దు మేడం అంటూ వెళ్లిపోతుంది శృతి.

ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవి చిన్నగా మాట్లాడుకుంటుంటే వెనక నుంచి వింటుంది రుద్రాణి. ఏంటి అత్తా కోడళ్లు ఏదో గుసగుసలడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదని మీ ఆయన్ని వెతకడానికి ఒక సెర్చింగ్‌ టీం వెళ్లిందని.. ఎక్కడున్నా వెతికి పట్టుకుని మీ ఆయన్ని దగ్గరకు నిన్ను పంపంచేయాలని మాట్లాడుకుంటున్నాం అని అపర్ణ చెప్పగానే.. అప్పుడు మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని మా అందరి నమ్మకం అంటుంది ఇందిరాదేవి. దీంతో రుద్రాణి.. నేను చచ్చినా వెళ్లను అంటూ దూరంగా వెళ్లి కూర్చుంటుంది.


అప్పుడే రాజ్‌  లుంగీ కట్టుకుని కిందకు వస్తాడు. వెళ్లి అపర్ణ పక్కన కూర్చుంటాడు. రాజ్‌ వాలకం చూసిన రుద్రాణి ఏయ్‌ రాజ్‌ ఏంట్రా ఈ డ్రెస్‌.. అని అడుగుతుంది. ఇది నా ఫ్రీడమ్‌కు గుర్తు అత్తా.. ఈ రోజు నుంచి నాకు కావ్య అనే బాస్‌ లేదు. నాకంతా ఫ్రీడమే.. శాంత ఇటురా ఇదిగో ఈ లిస్టు తీసుకో.. ఇవన్నీ నువ్వు చేసి తీసుకురా ఫుల్లుగా లాగించేస్తాను అని చెప్తాడు. లిస్టు చూసిన శాంత ఇవన్నీ ఎన్నిరోజులకు బాబు అని అడుగుతుంది. ఎన్ని రోజులకా..? కాదు ఈ ఒక్కరోజుకే అని రాజ్‌ చెప్తాడు. రుద్రాణి రాజ్ దగ్గరకు వచ్చి ఇందాక ఈ అత్తాకోడళ్లు కావ్యను నీపైన పోస్టులో వేసినందుకు ఏదో హైపై కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు  హైపై కొట్టరా అంటుంది.

ఇంతలో రాజ్‌కు కావ్య ఫోన్‌ చేస్తుంది. దీంతో ఇదిగోండి మీ కొత్త సీఈవో ఆఫీసులో పని  చేయడం చేత కాక నాకు ఫోన్‌ చేస్తుంది అని బిల్డప్‌ ఇచ్చి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి ఏంటి నేను ఆఫీసులో లేకపోతే పనులు ఆగిపోయాయా అని అడుగుతాడు. అంతలేదు మీరు ఉన్నప్పటి కంటే స్పీడుగా జరుగుతున్నాయని కావ్య చెప్పగానే రాజ్‌ టక్కున స్పీకర్‌ ఆఫ్‌ చేస్తాడు. మరి ఎందుకు ఫోన్‌ చేశావు అని అడుగుతాడు. సిస్టం పాస్‌వర్డ్‌ చెప్పండి అని కావ్య అడుగుతుంది. నేను చెప్పను దమ్ముంటే నువ్వే తెలుసుకో అంటూ రాజ్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఆ పాస్‌వర్డు ఏదో చెప్పొచ్చుగా అంటూ అపర్ణ, ఇందిరాదేవి చెప్పినా అబ్బచా నేనెందుకు చెప్పాలి అంటూ వెటకారంగా మాట్లాడతాడు రాజ్‌.

పాస్‌వర్డ్‌ కోసం టెక్నీషియన్‌ ను పిలిపించమంటారా మేడం అని శృతి అడుగుతుంది. దీంతో అవసరం లేదని దమ్ముంటే నన్నే కనుక్కోమన్నారు కదా? నా దమ్మేంటో చూపిస్తాను.. పాస్‌ వర్డ్‌ నేనే కనుక్కుంటాను అని కావ్య చెప్పగానే పాస్‌ వర్డ్‌ ఏం పెట్టారో ఎలా గెస్‌ చేస్తారు మేడం అని శృతి అడగ్గానే ఆయన మహా అయితే ఏం పెట్టి ఉంటారు. కంత్రి కళావతి లాంటివేవో పెట్టి ఉంటారు.  అని కావ్య రెండు మూడు సార్లు ట్రై చేస్తుంది. చివరికి పాస్‌ వర్డ్‌ సక్సెస్‌ అయి సిస్టం ఓపెన్‌ అవుతుంది. దీంతో ఆశ్చర్యంగా శృతి ఏం టైప్‌ చేశారు మేడం అని అడుగుతుంది. ఐ హేట్‌ కలావతి అటా.. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అంటూ పాస్‌వర్డ్‌ మార్చేస్తుంది కావ్య.

రైటర్‌ లక్ష్మీకాంత్‌ ఇంట్లోకి కళ్యాణ్‌  వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్‌ ఆపుతాడు. నీ గెస్ట్ హౌస్‌ లోకి వెళ్లినట్లు దర్జాగా వెళ్తున్నావేంటి అంటాడు. దీంతో కళ్యాణ్‌ ఆయన నాకు తెలుసు.. తనను కలవమని నాకు కార్డు కూడా ఇచ్చారని కళ్యాణ్‌ చెప్పగానే ఆయన రాష్ట్రంలో అందరికీ తెలుసు.. ఎంతో మందికి కార్డు ఇస్తుంటాడు అని చెప్తుండగానే ఫోన్‌ మాట్లాడుతూ లక్ష్మీకాంత్‌ బయటకు వస్తాడు. కళ్యాణ్‌ ఆయన్ని పిలిచి తనను తాను ఆయనకు గుర్తు చేస్తాడు. దీంతో లక్ష్మీకాంత్‌ కోపంగా కళ్యాణ్‌ ను దగ్గరకు పిలిచి తిట్టి అక్కడి నుంచి పంపించి వేస్తాడు.

కిచెన్‌లోకి వెళ్లిన రాజ్‌ ను అపర్ణ తిడుతుంది. దీంతో అక్కడి నుంచి హాల్లోకి వచ్చిన రాజ్‌ కు ఇందిరాదేవి ఖడ్గ తిక్కన కథ చెప్తుంది. ఆ కథ విన్న శాంత నవ్వడంతో ఇరిటేటింగ్‌ రాజ్ శాంతను పిలిచి కిచెన్‌ లో ఉన్న ఆవాలు తీసుకురమ్మని చెప్తాడు. శాంత ఆవాలు తీసుకురాగానే అవి ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. ఇవి అరకిలో ఉన్నాయి బాబు అంటుంది శాంత. దీంతో అవి అరకిలో ఉన్నాయా.. కిలో ఉన్నాయా.. అని కాదు నేను అడిగింది. అవి మొత్తం ఎన్ని ఆవాలు ఉన్నాయో కౌంట్‌ చేయ్‌ అంటాడు.

షాకింగ్‌ గా కిచెన్‌లోకి వెళ్లిన శాంత విషయం మొత్తం అపర్ణకు చెప్తుంది. దీంతో అపర్ణ ఓస్‌ ఇంతేనా.. వెళ్లి నేను చెప్పినట్టు చేయ్‌ అంటుంది. అలాగేనని శాంత హాల్లోకి వెళ్లి అవాలు రాజ్ కు ఇస్తూ ఇవి ఐదు లక్షల ఇరవై అయిదు వేల ముఫ్పై మూడు ఉన్నాయి బాబు అని చెప్తుంది. ఇంత త్వరగా కౌంట్‌ చేశావా అని రాజ్‌ అడగ్గానే మీకు డౌటుగా ఉంటే మీరే లెక్క పెట్టుకోండి అని శాంత చెప్తుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. శాంత నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×