BigTV English

Kazipet CI: కాజీపేట్ సీఐ కామాంధుడు.. బాలికపై సీఐ అత్యాచారయత్నం.. ఆపై

Kazipet CI: కాజీపేట్ సీఐ కామాంధుడు.. బాలికపై సీఐ అత్యాచారయత్నం.. ఆపై

Kazipet CI: కామంతో కళ్లు మూసుకుపోయాడు ఆ సీఐ. బాధితులకు న్యాయం చెయ్యాల్సిన ఆయన, చివరకు నిందితుడిగా మారాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు.. అడ్డంగా దొరికిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.


సీఐ పేరు రవికుమార్. కాజీపేట్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసు డిపార్ట్‌మెంట్ సీఐ అంటే చుట్టు పక్కలవారు మంచి గౌరవం ఇస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వడ్డేపల్లిలోని పీజీఆర్ లేక్‌వ్యూ టవర్స్‌లో ఉంటున్నాడు.

సీఐ ఉంటున్న ఫ్లోర్‌లో నాలుగేళ్ల బాలిక ఫ్యామిలీ నివాసం ఉంటోంది. చిన్నారి తన ఇరుగు పొరుగు స్నేహితులతో మాట్లాడుతోంది. దీన్ని గమనించిన ఈ సీఐ, వాళ్లతో ఎందుకు మాట్లాడుతున్నావు, వారిని పంపించి ఇంట్లోకి రావాలని బాలికను బెదిరించాడు.


భయంతో బెదిరిపోయింది బాలిక. వెళ్లకపోతే పేరెంట్స్‌తో చెబుతాడని భయపడింది. భయంతో బాలిక సీఐ ఇంట్లోకి వెళ్లింది. బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. చివరకు సీఐ నుంచి తప్పించుకున్న బాధిత బాలిక, సీఐ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

ALSO READ: యువతిని చంపి శవంపై సిమెంట్ పోసి.. హంతకుడు ఎలా చేశాడంటే?..

వెంటనే బాలిక పేరెంట్స్ కాజీపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్నాడు సీఐ రవి కుమార్. ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఈ లెక్కన సీఐ బాధితులు ఇంకెంత మంది బయటపడతారో చూడాలి.

Related News

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Big Stories

×