BigTV English

Brahmamudi Serial Today October 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య వస్తువులు కాల్చేయబోయిన రాజ్‌ – రుద్రాణికి ఇందిరాదేవి  వార్నింగ్‌

Brahmamudi Serial Today October 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య వస్తువులు కాల్చేయబోయిన రాజ్‌ – రుద్రాణికి ఇందిరాదేవి  వార్నింగ్‌

Brahmamudi serial today Episode:  దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవి, కావ్య ను సమర్థిస్తారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. లేదంటే కావ్య అలాంటి పని చేయదు అంటూ  వెనకేసుకొస్తారు. దీంతో రాజ్‌ నా కళ్లతో నేను  ప్రత్యక్షంగా చూశాను. మీరు కూడా చూశారుగా అయినా ఇంకా నమ్మడం లేదా? అంటూ కావ్యను తిడతాడు. రుద్రాణి కూడా ఆ కావ్య, అనామికతో చేతులు కలపి మన కంపెనీని దెబ్బకొట్టింది.. కుటుంబ పరువు కోసం ప్రాణాలు  అర్పించే త్యాగమూర్తిలా చూశారు కదా ఇప్పుడు ఏం చేసింది పది సంవత్సరాల గెలుపునంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. ఇంకా నమ్మలేము అంటూ దీర్ఘాలు తీస్తున్నారా..? అంటుంది.


కోపంగా అపర్ణ, రుద్రాణిని  తిడుతుంది. కళ్యాణ్‌ కాపురాన్ని ముక్కలు చేశావు. ఇప్పుడు నా కొడుకు కాపురం మీద  పడ్డాయా నీ కళ్లు అంటుంది. ఇందిరాదేవి, అపర్ణను లోపలికి వెళ్లమని గద్దిస్తుంది. దీంతో కోపంగా నాన్నమ్మా  వ్యక్తిగతమైన కోపాన్ని వృత్తి వ్యాపారాల మీద చూపించింది. తనకు వచ్చిన విద్యను అడ్డుపెట్టుకుని నా మీద పగ తీర్చుకుంది అంటూ  బెడ్‌ రూంలోకి వెళ్లి  కావ్య పోటోలు, బట్టలు తీసుకొచ్చి బయట పడేసి  పెట్రోల్‌ పోసి తగులబెట్టబోతుంటే అందరూ అడ్డుపడతారు.

రాహుల్‌, రుద్రాణి మాత్రం హ్యాపీగా చూస్తూ ఉంటారు. మమ్మీ ఏమైనా ప్లాన్‌ వేశావా? ఇక రాజ్‌ జీవితంలో కావ్యను రానివ్వడు అంటాడు రాహుల్‌. మరేమనుకున్నావురా ఈ రుద్రాణి అంటే.. అని గొప్పగా ఫీలవుతుంది రుద్రాణి. రాజ్‌ అగ్గి పుల్ల గీసి బట్టల మీద వేయగానే సడెన్‌ గా వర్షం పడుతుంది. అగ్గిపుల్ల చల్లారిపోతుంది. దీంతో అపర్ణ అడది అంటే ప్రకృతి అని అలాంటి అడదానికి అవమానం జరుగుతుటే ప్రకృతే కాదు పంచభూతాలు సహించవు ఈ వస్తువులను దూరం చేసుకున్నంత సులువుగా ఆ జ్ఞాపకాలను చెరపలేవురా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్య నిర్ధోషి అని ప్రకృతే చెప్తుంది. రా లోపలికి అని రాజ్‌  ను తీసుకుని లోపలికి వెళ్తుంది.


కావ్య బయట మెట్ల మీద  కూర్చుని ఎక్స్‌ ఫో లో జరుగుతున్న విషయాలు  గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఇంతలో కనకం లోపలి నుంచి వచ్చి కావ్య ఎప్పుడు వచ్చావు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడుగుతూ కావ్య ఏడుస్తుండటం చూసి ఏమైంది కావ్య అని అడుగుతుంది. దీంతో ఎక్స్ ఫో లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది కావ్య. దీంతో కనకం షాక్‌ అవుతుంది.  నీకు తెలియకుండానే నీ వల్ల తప్పు జరిగిపోయింది కావ్య. ఇక అల్లుడు గారు నిన్ను క్షమిస్తాడా? అని అడుగుతుంది. ఆయనే కాదు  అమ్మా ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా నన్ను నమ్మరు అమ్మా కానీ అత్తయ్యగారికి మాత్రం నేను క్షమాపణ చెప్పుకోవాలి అంటుంది.

సామంత్‌ టెన్షన్‌ తో అటూ ఇటూ నడుస్తుంటాడడు. అనామిక వచ్చి ఏంటి సామంత్‌  ఏమైంది అని అడుగుతుంది. లాస్ట్‌ వరకు వచ్చి ఎందుకిలా చేశావు. ఇప్పుడు మనం వెనకుండి నడిపిస్తున్నామని చెప్పడం వల్ల లాభం ఏంటి? అని  అడుగుతాడు సామంత్‌. ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏంటి? అంటుంది అనామిక. కష్టం కాదు నష్టం వచ్చింది. ఆ కావ్య ఇప్పుడు డిజైన్స్‌ వేయనని చెప్పేసింది కదా? అని చెప్తాడు సామంత్‌. దీంతో ఆ కావ్యను తీసుకొచ్చింది నేనే కదా? మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నాదే అంటుంది అనామిక.

కానీ ఆ రాజ్ గురించి నీకు తెలియదు.. చాలా డేంజర్‌ అంటాడు. అబ్బా ఇప్పుడేదో కొంపలు  మునిగినట్లు  ఎందుకలా టెన్షన్‌ పడుతున్నావు. ముందు ఇలా రా కూర్చో.. అంటూ సామంత్ కు మందు  అందిస్తూ కూల్‌ గా  ఉండు అన్ని నేను చూసుకుంటాను కదా? అంటూ రుద్రాణికి ఫోన్‌ చేస్తుంది అనామిక. హ్యాపీగా మందు తాగుతున్న రుద్రాణి ఫోన్‌ లిఫ్ట్  చేసి మత్తుగా హలో అనామిక అంటుంది. మీ గొంతు  వింటుంటే మంచి పార్టీ మూడ్‌ లో ఉన్నట్టున్నారు ఆంటీ అంటుంది. ఈ మూడ్‌ కు కారణం నువ్వే కద అనామిక. ఇన్ని రోజులుగా నేను చేయలేని పని ఈరోజు నువ్వు చేశావు అంటుంది రుద్రాణి.

దీని కోసమే కదా ఆంటీ ఇష్ట కష్టపడింది. ఇదే కాదు ఆంటీ ఆ దుగ్గిరాల కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను అంటుంది అనామిక. అదంతా ఎలా ఉన్నా.. సొంత భార్య చేతిలో ఓడిపోయినందుకు తట్టుకోలేకపోతున్న రాజ్‌ ను చూస్తుంటే నా కెంత ఆనందంగా ఉందో తెలుసా? అంటుంది రుద్రాణి. నాకు  మాత్రం బాధగా ఉంది ఆంటీ ..  ఆ మధురమైన సన్ని వేశాలు చూడలేపపోతున్నందుకు అంటుంది అనామిక. ఇంతలో స్వప్న వచ్చి అంతా విని రుద్రాణిని ముసుగు  వేసి కొట్టి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×