BigTV English

Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు వార్నింగ్‌ ఇచ్చిన అనామిక –  రాహుల్‌ మీదకు స్వప్నను ఎగదోసిన అపర్ణ

Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు వార్నింగ్‌ ఇచ్చిన అనామిక –  రాహుల్‌ మీదకు స్వప్నను ఎగదోసిన అపర్ణ

Brahmamudi serial today Episode:  రాజ్‌ వెళ్లిపోయాక అపర్ణ కోపంగా ఎప్పుడూ నా కొడుకు, కోడలు మీద పడి ఏడ్వడం కాదు నీ కొడుకు ఎవరితోనో కారులో తిరుగుతున్నాడు చూసుకో అంటూ స్వప్న  మీ ఆయన కారులో ఎవరితోనో షికార్లు కొడుతున్నాడు నీ కాపురం జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్లిపోతుంది. ఇందిరాదేవి కూడా ఆదేదో తేల్చుకో స్వప్న అంటూ వెళ్లిపోతుంది. రాహుల్‌ ఫోన్‌ వచ్చినట్టు నటిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే స్వప్న ఆపుతుంది. కారులో షికారుకు తీసుకెళ్లిన అమ్మాయి ఎవరో? చెప్పుదువురా.. అంటూ లోపలికి పిలుస్తుంది. రాహుల్‌ భయంగా నాక్కొంచెం పని ఉంది తర్వాత మాట్లాడుకుందాం అంటాడు.


అయితే ఇప్పుడు గనక నువ్వు రాకపోతే ముసుగేసి కొడతానని బెదిరిస్తుంది స్వప్న. ఆ మాటకు రుద్రాణికి ఏదో గుర్తుకు వచ్చినట్టు కోపంగా ఏయ్‌ ఏమన్నావు.. ముసుగేసి కొట్టింది నువ్వా.. అంటూ అడుగుతుంది. నాకు తెలియదు. నేనే కొట్టి ఉంటే మీరిలాగా ఉండేవారా? ఇంట్లో మళ్లీ గొడవలు ఎందుకు పెట్టేవారా?  రాహుల్‌  నువ్వు రా అంటూ కాలర్‌ పట్టుకుని రాహుల్‌ను బెడ్‌ రూంలోకి తీసుకెళ్తుంది. లోపల రాహుల్‌ ను పిచ్చకొట్టుడు కొడుతుంది. హల్లోనే నిలబడ్డ రుద్రాణి పైనుంచి వస్తున్న శబ్దాలు విని భయపడుతుంది.

కావ్య కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్‌ వెళ్తుంటే.. అనామిక వస్తుంది. హాయ్‌ ఎక్స్‌ ఫో అవార్డు విన్నర్‌ ది గ్రేట్‌  కావ్య గుడ్‌ మార్నింగ్‌. ది గ్రేట్‌ సామంత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలో పనిచేసే వెరీ టాలెంటెడ్‌ డిజైనర్‌ ఆఫ్ట్రాల్‌ కూరగాయలు తీసుకురావడానికి వెళ్లడమా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఆప్ట్రాల్‌ కూరగాయలే కదాని తినటం మానేస్తే.. నువ్వు కూడా ఆప్ట్రాల్‌ అనామికవు అయిపోతావు. ఏయ్‌ నువ్వు వెళ్లవే దీనిలాగా వాడిపోయిన పుచ్చిపోయిన కూరగాయలు తీసుకురాకు. వీధి కుక్కలకు వేసినా తినవు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది కనకం. కావ్య మాత్రం అలాగే వెళ్తాను అమ్మా కానీ ఈ అనామకురాలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుని వెళ్తాను అంటుంది.


ఏం లేదు కావ్య నిన్ను ఆఫీసుకు మా కారులో తీసుకెళ్లడానికి వచ్చాను అంటుంది అనామిక. అవునా..  ఇంత జరిగినా నేను  ఎలా వస్తానని అనుకున్నావు.. అసలు ఏ ముఖం పెట్టుకుని నన్ను అడగడానికి మా ఇంటికి వచ్చావు అంటూ తిడుతుంది కావ్య. నిన్ను అడగడానికి ముఖం పెట్టుకుని రావడం దేనికి నువ్వు సైన్‌ చేసిన అగ్రిమెంట్‌ ఉంటే చాలు కదా అటుంది అనామిక. అగ్రిమెంటా అంటూ కావ్య షాక్‌ అవుతుంది. అవును కావ్య నువ్వు మా ఆఫీసులో పని చేస్తానని నీ స్వహస్తాలతో రాసిచ్చిన అగ్రిమెంట్‌ ప్రకారం నువ్వు ఆఫీసుకు రావాల్సిందే. లేదంటే నిన్ను కోర్టుకు లాగుతాను. జైలుకు పంపిస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది అనామిక.

దీంతో కనకం భయపడుతుంది.  ఏంటే అది జైలు గియిలు అంటుంది. నిజంగా అగ్రిమెంట్‌ ప్రకారం నువ్వు వెళ్లి పని చేయకపోతే సమస్య పెద్దది అవుతుందా? అని అడుగుతుంది కనకం. అవును అమ్మా అగ్రిమెంట్‌ ప్రకారం అయితే నేను వెళ్లాలి. కానీ దుగ్గిరాల ఇంటికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయనమ్మా.. ఇప్పటికే ఆ ఇంటికి ద్రోహం చేశానని ఆయన నా మీద కోపం పెంచుకున్నారు అని చెప్పి కావ్య మార్కెట్‌ కు వెళ్లిపోతుంది. అగ్రిమెంట్‌ అడ్డం పెట్టుకుని మా కావ్యను బెదిరిస్తావే ఎలాగైనా ఆ అగ్రిమెంట్‌ లేకుండా చేస్తాను అని కనకం మనసులో అనుకుంటుంది.

అప్పును తీసుకుని కళ్యాణ్‌ కోచింగ్‌ సెంటర్‌ కు వెళ్లి ఫీజు కడతాడు. ఐదు వేలు మాత్రమే ఇచ్చారని ఇంకా ఐదు వేలు కట్టాలని వాళ్లు అడగ్గానే రెండు రోజుల్లో ఇస్తానని కళ్యాన్‌ చెప్తాడు. సరేనని అప్పును రేపటి నుంచి క్లాస్సెస్‌ కు రమ్మని చెప్తారు. బుక్స్‌ ఇస్తారు. బుక్స్‌ తీసుకుని బయటకు వచ్చిన అప్పును కళ్యాణ్‌ను చూస్తూ ఇంత వరకు అమ్మా నాన్నలదే అసలైన ప్రేమ అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని సెంటిమెంట్‌ గా ఫీలవుతుంది.

కావ్య అగ్రిమెంట్‌ పేపర్స్‌ ను ఎలాగైనా సంపాదించాలనుకున్న కనకం ఇద్దరూ అసిస్టెంట్స్‌ ను తీసుకుని లేబర్ ఆఫీసర్‌ లాగా సురేష్‌ ఆఫీసు మీద రైడ్‌ చేస్తుంది. మీ ఆఫీసులో స్టాఫ్‌ ను ఇబ్బంది పెడుతున్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయని హడావిడి చేస్తుంది. కనకం దెబ్బకు భయపడిపోయిన సురేష్‌. ఇప్పుడు మేం ఏం చేయాలి మేడం అని అడుగుతాడు. దీంతో మీ ఎంప్లాయూస్‌ అందరివి అగ్రిమెంట్స్‌ పేపర్స్‌ తీసుకురా చెక్‌ చేయాలని చెప్తుంది.

సురేష్‌ ఫైల్స్‌ తీసుకురాగానే వాటిని తన అసిస్టెంట్స్‌ కు ఇస్తుంది. సురేష్‌ ను వాటర్‌ తీసుకురమ్మని చెప్తుంది. వాటర్‌ కోసం సురేష్‌ బయటకు వెళ్లగానే కావ్య అగ్రిమెంట్‌ తీసుకుని బ్యాగులో దాచేస్తుంది కనకం. ఇక అంతా అయిపోయాక అక్కడి నుంచి వెళ్లేముందు అనామిక వస్తుంది. కావ్య అగ్రిమెంట్‌ పేపర్‌ ఇవ్వమని లేకుంటే పోలీసులకు కంప్లైంట్‌ చేస్తానని బెదిరిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Big Stories

×