BigTV English

Brahmamudi Serial Today September 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్‌ – ఆందోళనలో దుగ్గిరాల కుటుంబం  

Brahmamudi Serial Today September 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నిజం తెలుసుకున్న రాజ్‌ – ఆందోళనలో దుగ్గిరాల కుటుంబం  

Brahmamudi serial today Episode: పుట్టబోయే పిల్లలకు కొత్త డ్రెస్సులు తీసుకొస్తాడు రాజ్‌. అది చూసి మరింత ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్‌. రాజ్ తో పర్సనల్‌ గా మాట్లాడాలని చెప్తాడు. సరే చెప్పు అనగానే.. ఇక్కడ కాదు అన్నయ్య బయటకు వెళ్దాం అంటాడు. సరే అంటూ రాజ్‌, కళ్యాణ్‌ వెళ్లబోతుంటే కావ్య వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. కళ్యాణ్‌ ఏదో మాట్లాడుతానంటే.. బయటకు వెళ్తున్నాము అని రాజ్‌ చెప్పగానే.. ఇక్కడ చెప్పేది కాదు వదిన అందుకే బయటకు వెళ్తున్నాము అంటాడు కళ్యాణ్‌. ఓహో మీ ఇద్దరికి అంత పర్సనల్ విషయాలు ఉన్నాయా. సరేలేండి వెళ్లి మాట్లాడుకోండి అంటూ కావ్య చెప్పగానే.. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.


రాజ్‌, కళ్యాణ్‌ కారులో వెళ్తుంటారు. ఇప్పుడు చెప్పరా కళ్యాణ్‌ ఏంటి విషయం అని రాజ్‌ అడుగుతాడు.. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నయ్య అంటాడు కళ్యాణ్‌. ఎలా చెప్పడం ఏంటిరా..? నోరు ఉంది కదా నోటితో చెప్పు అంటాడు రాజ్‌. కానీ ధైర్యం సరిపోవడం లేదు అన్నయ్య అంటాడు కళ్యాణ్‌. అరే పెద్ద సమస్యే వచ్చి పడిందే.. పోనీ మందేసి మాట్లాడుకుందాం అనుకుంటే మనకు ఆ అలవాటు లేదు. ఓకే నేనే గెస్‌ చేస్తాను. ఇంత రాత్రి పూట అంత అర్జెంట్‌గా మాట్లాడాలి అన్నావంటే ఏదో పెద్ద మ్యాటరే అయ్యుంటుంది అంటాడు రాజ్‌. దీంతో కళ్యాణ్‌ మనసులో అవును అన్నయ్య చాలా పెద్ద మ్యాటరే కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుండగానే.. రాజ్‌ కారు పక్కన ఆపేస్తాడు. అసలు ఏం చెప్పాలో చెప్పరా..? అంటూ రాజ్ అడగ్గానే..

కళ్యాణ్‌ హాస్పిటల్‌కు వెళ్లిన విషయం డాక్టర్‌ చెప్పిన విషయం చెప్పి అది అప్పుకు జరుగుతుంది అని చెప్తాడు. అప్పుకు అబార్షన్‌ చెయ్యాలని చెప్పారు. అనగానే ఏంట్రా నువ్వు చెప్పేది అంటాడు రాజ్‌. అవును అన్నయ్య ఒకవేళ వినకుండా అలాగే 9 నెలలు క్యారీ చేస్తే అప్పు ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. తనని కాపాడే అవకాశం లేదు అని చెప్పారు. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే తర్వాత అబార్షన్‌ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందన్నారు అనగానే.. మరి ఈ విషయం అప్పుకు చెప్పావా..? అంటాడు రాజ్. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నయ్య అసలు ముందు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకే తెలియడం లేదు. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోని బిడ్డ ఒకవైపు.. తన మీద ఆశలు పెంచుకున్న తల్లి మరోక వైపు. ఇప్పుడు చెప్పు అన్నయ్య నన్నేం చేయమంటావు. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతాడు.


దీంతో రాజ్‌ నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే డాక్టర్‌ చెప్పిన మాట వినడం మంచిది అనిపిస్తుంది. వెంటనే ఈ విషయం అప్పుకు చెప్పి తనను ఎలాగైనా ఒప్పించాలిరా..? అనగానే కళ్యాణ్‌ అయితే ఒప్పించు అన్నయ్య అంటాడు. దీంతో రాజ్‌ నేను ఒప్పించడం ఏంటిరా..? భర్తకు తనను నువ్వే ఒప్పించాలి అనగానే అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను అన్నయ్య.. వదినకు ఆ నిజాన్ని నువ్వే చెప్పు అనగానే.. ఏంటి వదినకు చెప్పాలా..? అరేయ్‌ ఏం మాట్లాడుతున్నావురా..? అంటూ రాజ్‌ అడగ్గానే.. అవును అన్నయ్య ప్రాబ్లం వచ్చింది అప్పుకు కాదు వదినకు అన్నయ్య అనగానే.. రాజ్‌ షాక్‌ అవుతాడు. వణుకుతున్న స్వరంతో ఏంటి..? అని అడుగుతాడు. ఇది నువ్వు నమ్మడానికి నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు.. కానీ ఇది నిజం అన్నయ్య.. వదినకే వచ్చింది ఈ ప్రాబ్లం.. నేను అప్పు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అక్కడ డాక్టర్‌ ఈ విషయం చెప్పారు.

అసలు ఈ విషయం నేరుగా వదినకే చెప్పాలనుకున్నాం. కానీ తను ఎదురుపడిన ప్రతిసారి మాలో మేమే కుమిలిపోయాం. అందుకే ఈ విషయం నీకు చెబితే ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావని చెప్పాను అన్నయ్య.. ఇప్పటికే మేము చాలా టైం తీసుకున్నాము వెంటనే నువ్వు వదినను హాస్పిటల్‌ కు తీసుకెళ్లి వదినను బతికించు అన్నయ్య అంటూ చెప్పగానే.. నిజం చెప్పాలి అంటూ ఇంత పెద్ద శిక్ష వేశావేంట్రా.. నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకు ఎలా చెప్పగలను.. చెబితే ఆ పిచ్చిది బతకగలదా..? నన్ను పెళ్లి చేసుకున్న దగ్గరి నుంచి తనకు ఏ సంతోషం లేదురా..? ఇప్పుడుఇప్పుడే దానిలో సంతోషాన్ని చూస్తున్నానురా..? ఇప్పుడు ఆ సంతోషం కూడా దూరం చేయాలా..? అంటూ రాజ్‌ ఏడుస్తూ ఉంటాడు.

తర్వాత అపర్ణ, ఇంద్రాదేవి, కావ్య, స్వరాజ్‌ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే రాజ్‌, కళ్యాన్‌ వస్తారు. ఏంటి కళ్యాన్ నీకు అంత సీక్రెట్‌ ఏమున్నాయి. కొంపదీసి రాహుల్‌ లాగా ఎవరైనా కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను పట్టావా అంటుంది. దీంతో కావ్య అంత లేదులే అమ్మమ్మ కళ్యాణ్‌ తప్పు చేస్తే అక్కడున్నది స్వప్న కాదు అప్పు.. తాట తీస్తుంది అని చెప్తుంది. దీంతో రాజ్‌ బాధగా దేవుడి రూంలోకి వెళ్లి దేవుడితో బాధపడుతూ కావ్య గురించి ఎమోషనల్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

GudiGantalu Today episode: మనోజ్ పై కక్ష్య తీర్చుకున్న బాలు.. ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. ఇంట్లో చిచ్చు పెట్టిన శోభన..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ భయాన్ని పోగొట్టేందుకు ధీరజ్ ప్లాన్.. నర్మదకు మాటిచ్చిన సాగర్.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ పరువు తీసేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కలిసిన విచిత్ర గుప్తుడు  

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. ప్రేమ కోసం ధీరజ్ షాకింగ్ నిర్ణయం.. చందు, వల్లి మధ్య దూరం మాయం…

Intinti Ramayanam Today Episode: గీత పై బాస్ సీరియస్.. పల్లవికి మైండ్ బ్లాక్ దెబ్బ.. పార్వతికి షాకిచ్చిన అక్షయ్..

Big Stories

×