Haris Rauf: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ జట్టుకు బెల్టు ట్రీట్మెంట్… ఇచ్చింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కాస్త ఓవర్ యాక్ట్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ… రాఫెల్ జెట్ ను కూల్చేసామని అర్థం వచ్చేలా సిగ్నల్స్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత రాఫెల్ ను కూల్చేశామని పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలోనే సంజూ వికెట్ తీసిన తర్వాత… భారత రఫెల్ జెట్ ను కూల్చి వేసామని కౌంటర్ ఇచ్చాడు హరీస్ రఫ్. ఈ తరుణంలోనే.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు టీమిండియా అభిమానులు. పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్ ను ఉద్దేశించి కోహ్లీ కోహ్లీ అంటూ… అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఇక వాళ్లు అరుస్తుంటే వెంటనే రియాక్ట్ అయిన పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్… తనకేం వినిపించడం లేదు అన్నట్లుగా వ్యవహరించారు.
Also Read: Ind Vs Pak: చల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్…సిక్స్ కొట్టి మరీ
చెవులను చూపిస్తూ.. ఏదో అన్నాడు. అయితే అంతకుముందు అభిషేక్ శర్మతో హరీస్ రఫ్ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. విరాట్ కోహ్లీ గతంలో హరీస్ రఫ్ బౌలింగ్లో సిక్స్ లు కొట్టాడు. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ అభిమానులు ర్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read : IND VS PAK: అభిషేక్ దుమ్ములేపాడు… సూపర్ 4 లోనూ టీమిండియా విజయం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు
Indians chanting KOHLI KOHLI after seeing Haris Rauf 🤣🤣🤣#INDvPAK #AsiaCup2025 pic.twitter.com/zL7cRbopQM
— Vinesh Prabhu (@vlp1994) September 21, 2025