BigTV English

Brahmamudi Serial September 25th episode promo: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కనకం రాయబారం ఫలిస్తుందా? – కావ్య కాపురం చక్కబడుతుందా?

Brahmamudi Serial September 25th episode promo: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కనకం రాయబారం ఫలిస్తుందా? – కావ్య కాపురం చక్కబడుతుందా?

Brahmamudi serial 25th Episode promo : తన కూతురు కాపురం సరిద్దిదేందుకు కనకం దుగ్గిరాల ఇంటి గడప తొక్కుతుంది. కనకం రావడం ఇష్టం లేని రుద్రాణి వెటకారంగా కనకాన్ని తిడుతుంది. ఇంకా నీ కూతురు కాపురం నిలబడతుందని నీకు నమ్మకం ఉదా? అని అడుగుతుంది. దీంతో నమ్మకం ఉందని నా కూతురు ఇక్కడ లేకపోయినా పూజలో తన చీర ఉండటం చూస్తే నమ్మకం వస్తుందని  చెప్తుంది కనకం.


బ్రహ్మముడి సీరియల్‌ రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే రాజ్‌ ను దుగ్గిరాల కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన కావ్య తన పుట్టింట్లోనే ఉండి బతుకుతుంది. రుద్రాణి కూడా మళ్లీ కావ్య పుట్టింటికి నుంచి మెట్టినిటికి వస్తుందేమోనని భయంతో కావ్యను పర్మినెంట్‌ గా రాకుండా చేయాలని చూస్తుంది. ఇందిరాదేవి, అపర్ణ మాత్రం రాజ్‌ను ఫోర్స్‌ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు సందు దొరికితే అప్పుడు కావ్యను ఇంటికి తీసుకురమ్మని  రాజ్ కు హితబోధ చేస్తుంటారు.  వాళ్ల ప్రెషర్  తట్టుకోలేని రాజ్‌ ఒక సారి కావ్య కోసం అత్తాగారింటికి వెళ్లి ఉట్టి చేతులతో తిరిగి వస్తాడు.

ఇదిలా ఉండగా వినాయక చవితి పూజ ఇంట్లో గ్రాండ్‌ గా చేయాలని సీతారామయ్యా, ఇందిరాదేవి నిర్ణయించుకుంటారు. అందర్నీ పిలిచి గణపతి పూజలకు ఎవ్వరూ ఏర్పాట్లు చేయట్లేదని కోప్పడతారు. ఈ సారి ఇంట్లో గణపతి నవరాత్రులు బ్రహ్మండంగా నిర్వహించాలని అందంతా రాజ్‌ చూసుకోవాలిన బాధ్యతలు రాజ్‌కు అప్పగిస్తారు. దీంతో రాజ్‌ సరేనని ఒప్పుకుంటాడు.  వినాయకుని విగ్రహం తీసుకురావడానికి రాజ్‌ మార్కెట్‌ కు వెళ్తుంటాడు. అటు వైపుగా రాజ్‌ కు ఎదురుగా సైకిల్‌ మీద వస్తున్న కావ్యను రాజ్‌ చూసుకోకుండా కారుతో డాష్‌ ఇస్తాడు.


దీంతో కావ్య కింద పడిపోతుంది. చేతికి దెబ్బలు తగులుతాయి. ఇంతలో కావ్య కోపంగా తిట్టబోయి రాజ్‌ ను చూసి ఆగిపోతుంది. రాజ్‌ కూడా కావ్యను చూసి షాక్ అవుతాడు. మరోసారి నాతో డబ్బులు డిమాండ్‌ చేయడానికి ఇలా చేశావా? అని అడుగుతాడు. దీంతో కావ్య కోపంగా డబ్బుల కోసం ఆశపడే క్యారెక్టర్‌ కాదు నాది. మీ ఇంట్లోనే ఉన్నారుగా రుద్రాణి, రాహుల్‌ వాళ్లకు ఇవ్వండి డబ్బులు అప్పుడైనా పచ్చని కాపురాలు కూల్చకుండా ఉంటారు. మీ ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుదని కావ్య అనగానే రాజ్‌ కోపంగా నువ్వు ఎప్పుడైతే మా ఇంటి గడప దాటావో అప్పుడే మా ఇంటికి పట్టిన దరద్రం వదిలిందని అంటాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. తర్వాత రాజ్‌ మార్కెట్‌ కు వెళ్లి కావ్య తయారు చేసిన గణపతిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తాడు.

ఇంటికి వెళ్లిన రాజ్‌  గణపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేశానని.. ఇంట్లో వాళ్లకు చెప్పగానే ఇందిరాదేవి సరే అయితే కావ్యకు ఫోన్‌ చేయ్‌ అంటుంది. ఏ పూజలోనైనా పెళ్లి అయిన దంపతులు మాత్రమే కూర్చోవాలి అని చెప్తుంది. దీంతో ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా అంటాడు రాజ్‌.  ముందే చెప్పడం ఏంటి రాజ్‌ నీకు తెలియదా? పెళ్లైన వాళ్లు భార్య బతికి ఉండగా పూజ ఒంటరిగా చేయకూడదని అంటుంది అపర్ణ. ఎంత చెప్పినా రాజ్‌ వినకపోయే సరికి కావ్య చీరను రాజ్‌ పక్కన పెట్టుకుని పూజ చేయమంటారు. రాజ్ అలాగే చేస్తాడు.

పూజ అయిపోయాక రాజ్‌ అందరికీ ప్రసాదం పంచుతుంటాడు ఇంతలో కనకం వస్తుది. రాజ్‌ ప్రసాదం ఇస్తాడు. రుద్రాణి విసుగ్గా చూస్తూ.. ఏంటి కనకం పిలవని పేరంటానికి వచ్చావు అని అడుగుతుంది. పండగ సాకుగా చూపించి  కూతురిని అల్లుడిని కలపి కావ్యను మళ్లీ అత్తారింటికి పంపిద్దామని వచ్చావా? కనకం అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. కనకం. దీంతో  అపర్ణ, ఇందిరాదేవి షాక్‌ అవుతారు.  కనకం మాత్రం అవునని అసలు వాళ్లిద్దరి మధ్య బంధం తెగిపోతే కదా నేను కలపడానికి అంటుంది.

రాముడి పక్కన కాంచన సీత లాగా.. నా కూతురికి, అల్లుడికి మధ్య బంధం ఇంకా ఉందనడానికి ఈ పూజలో నా అల్లుడి పక్కన ఉన్న నా కూతురి చీరే సాక్ష్యం అని చెప్తుంది. నా కూతురు తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం ఈ ఇంటికే వచ్చి చేరింది. అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. అపర్ణ, ఇందిరాదేవి ఆశ్చర్యంగా చూస్తుటారు. ఇంతలో కనకం నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికి వచ్చి చేరాడు. నా కూతురు రాదా? ఆ దేవుడే నా కూతురిని ఇక్కడికి రప్పిస్తాడు అంటుంది. కననం. ఇది రేపటి ఏపిసోడ్‌ ప్రోమో..

కనకం తన కూతురిని అల్లుడి దగ్గరకు చేర్చేందుకు వచ్చిందా? లేక మరోదైనా పని మీద వచ్చిందా? ఒకవేళ కనకం రాయబారానికి వచ్చినట్లయితే తన రాయభారం సక్సెస్‌ అవుతుందా? కావ్య కాపురం చక్కబడుతుందా? అనేది రేపటి ఏపిసోడ్‌ లో తెలిసిపోతుంది.

Tags

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×