BigTV English

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను గుర్తు చేసుకున్న సీతారామయ్య – కనకంపై కోప్పడిన కావ్య

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను గుర్తు చేసుకున్న సీతారామయ్య – కనకంపై కోప్పడిన కావ్య

Brahmamudi serial today Episode :  సీతారామయ్య స్నేహితుడు వచ్చి స్వరాజ్‌ కంపెనీలో జరుగుతున్న విషయాలు చెప్తాడు. నా మనవడు మీ కంపెనీతో ఉన్న బిజినెస్‌ ను వదులుకున్నాడని.. మనిద్దరం మంచి స్నేహితులం కాబట్టి నేను వచ్చి నీకు చెప్తున్నానని.. ఇక నేను ఏమీ చేయలేనని వ్యాపారాలు అన్ని తన మనవడే చూసుకుంటున్నాడని నేను కూడా చెన్నై వెళ్తున్నానని ఇక ఇప్పట్లో ఇక్కడకు రానని వెళ్లిపోతాడు.


రాహుల్‌ చేసిన నిర్వాకం తెలిసిన ఇంట్లో వాళ్లందరూ రాహుల్‌ ను కోపంగా చూస్తుంటారు. ఇంతలో రుద్రాణి కూడా కోపంగా రాహుల్‌ ను తిడుతుంది.  అసలు నీకు బుద్దుందా? రాహుల్‌  నిన్ను నమ్మి కంపెనీని అప్పగిస్తే నువ్వు ఇలాగేనా చేసేది. క్లయింట్స్‌ తో ఎలా మాట్లాడాలో తెలియదా? అంటూ తిడుతుంది. దీంతో రాహుల్‌  మమ్మీ ఒకసారి నేను చెప్పేది కొంచెం విను అంటాడు.

దీంతో కోపంగా  ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది. నీవల్ల ఎంత నష్టం జరిగిందో చూశావా? అంటూ ఏదో మాట్లాడుతుంటే ఇంతలో ఇందిరాదేవి ఆపండి మీ డ్రామాలు అంటూ  నీ కొడకు చేసిన పనికి మేమందరం ఎక్కడ తిడతామోనని ముందే నువ్వు కోప్పడి తిట్టి మా నుండి వాడిని కాపాడాలని చూస్తున్నావా? అంటుంది.  అదేంటమ్మా అలా అంటావు. కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా? నిజంగానే వాడు తప్పు చేశాడు కాబట్టే తిడుతున్నాను. అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న కలగజేసుకుని  తప్పు చేసిన ప్రతిసారి మీరు ఇలా తిడుతూ దారిలో పెట్టి ఉంటే ఈరోజు ఇలా తయారయ్యే వాడే కాదు అంటుంది.


అయినా  తిట్టడానికి, తిడుతున్నట్లు నటించడానికి తేడా తెలుసుకోలేనంత చిన్న పిల్లలు ఎవరూ లేరిక్కడ అంటుంది అపర్ణ. దీంతో రుద్రాణి నేను నటిస్తున్నాను అనుకుందాం. అయితే  నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి అంటుంది. దీంతో సుభాష్‌ శిక్ష వేసినంత మాత్రానా జరిగిన నష్టాన్ని పూడ్చలేము కదా అంటాడు. ఇంతలో సీతారామయ్య, సుభాష్‌ నువ్వు ఇప్పుడు మా స్నేహితుడు వచ్చి చెప్పాడు కాబట్టి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. అసలు ఇలా మన కంటికి కనిపించకుండా ఎంత నష్టం జరిగిందో ఎంతమంది వెళ్లిపోయారో.. వెళ్లిపోవాలనుకుంటున్నారో అంచనా వేయగలవా? అని అడుగుతాడు.

తెలుసుకోగలను నాన్నా అంటాడు. ఇంతలో సీతారామయ్య బాధపడతాడు. నేను తప్పు చేశాను అంటూ ఆరోజు కావ్య వద్దు అంటున్నా రాజ్‌ ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి చాలా పెద్ద తప్పు చేశానురా..? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆరోజు కావ్య నన్ను హెచ్చరించింది.  అంటూ రాహుల్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమంటాడు. మరి కంపెనీ బాధ్యతలు ఎవరు చూసుకోవాలని సుభాష్,  ప్రకాష్‌ అడగగానే రాజ్‌ చూసుకుంటాడని చెప్తాడు.

రాజ్‌ తాను కంపెనీ బాధ్యతలు చూసుకోలేనని చెప్తాడు. ఎందుకు అని అందరూ అడగ్గానే నేను కళ్యాణ్‌ ను ఇంటికి తీసుకొచ్చేంత వరకు ఆఫీసుకు వెళ్లనని పిన్నికి మాటిచ్చాను. అందుకే నేను బాధ్యతలు తీసుకోలేను అంటాడు రాజ్‌. ఇంతలో ధాన్యలక్ష్మీ తనకు రాజ్‌ ఆఫీసుకు వెళ్లడానికి ఏటువంటి అభ్యంతరం లేదని కానీ కళ్యాణ్‌ను తీసుకొచ్చే బాధ్యత కూడా తనదేనని గుర్తుపెట్టుకోమని చెప్తుంది.

రాజ్‌ మళ్ళీ ఆఫీసుకు వెల్లబోతున్నాడని తెలుసుకున్న కనకం చాలా హ్యాపీగా కావ్య దగ్గరకు వచ్చి చెప్తుంటే కావ్య విసుక్కుంటుంది. ఆ విషయాలు నాకు  చెప్పొద్దని కోప్పడుతుంది. అయినా ఆ ఇంటితో నాకేం సంబంధం ఉందని చెప్తున్నావు అంటూ కనకాన్ని తిడుతుంది. అయితే కనకం నీకెవరు చెప్పారు మా ఆయనకు చెప్తున్నాను. అంటూ రాజ్‌ మళ్లీ ఆఫీసుకు వెళ్లాలని ఇంట్లో వాళ్లందరూ చెప్పారట. కావ్య చెప్పిందే నిజమని అందరూ అనుకున్నారట.

రాహుల్‌ ఏదో తప్పు చేశాడట కంపెనీకి చాలా నష్టం జరిగిందట అని కనకం చెప్తుంటే అవునులే ఆయనకు మంచి చెప్పే వారంటే అసలు నచ్చదు అంటుంది. దీంతో కనకం నేను నీకు చెప్పలేదు నువ్వు నాకెందుకు చెప్తున్నావు అంటుంది. నీకు చెప్పలేదు మా నాన్నకు చెప్పాను అంటుంది కావ్య. ఇక ఆఫీసుకు వెళ్లిన వాడు.. రేపే మాపో తన భార్యను కూడా ఇంటికి తీసుకెళ్లడానికి వస్తాడు అని ఆశపడుతుంది కనకం.

రాహుల్‌ కోపంగా రుద్రాణిని చూస్తుంటాడు.  ఏంట్రా ఇందాక అలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అది కాదురా ఒకసారి నేను చెప్పేది విను అంటుంది రుద్రాణి. దీంతో కోపంగా రాహుల్‌ అసలు నువ్వు నాతో మాట్లాడకు మమ్మీ అంటాడు. రాహుల్‌ కోపానికి రుద్రాణి సారీ చెప్తుంది. అందరి ముందు అరిచేసి ఇప్పుడు వచ్చి సారీ చెబితే సరిపోతుందా? నీ స్వార్థం కోసం ఆఖరికి కొడుకుని కూడా బలి చేసేస్తావా? అంటూ బాధపడతాడు రాహుల్‌.

దీంతో రాహుల్‌ చెంప మీద కొడుతుంది రుద్రాణి. నేను చెప్పేది వింటావా? లేదా? అంటూ  నేను కనక అలా మాట్లాడి ఉండకపోతే ఇంట్లో అందరూ కలిసి నువ్వు చేసిన పనికి చీవాట్లు పెట్టేవారు. అలా జరగకూడదనే ఇలా చేశాను అంటుంది. ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి మీరిక మారరా? చీ మీరు మనుషులేనా అంటూ తిడుతుంది. డబ్బుల కోసం మరీ ఇంత దిగజారుతావా? అంటూ రాహుల్‌ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న.

పోలీస్‌ జాబ్‌ ఇంట్లో ఉండి చదువుకుంటున్న అప్పును కోచింగ్‌ సెంటర్ లో జాయిన్‌ అవ్వొచ్చు కదా అని చెప్తాడు కళ్యాణ్‌. కోచింగ్‌ తీసుకోవాలంటే చాలా డబ్బులు కావాలని మనం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు ఎలా వస్తాయని అప్పు బాధపడుతుంది. దీంతో అప్పును ఎలాగైనా కోచింగ్‌ సెంటర్‌ లో జాయిన్‌ చేయించాలని కళ్యాణ్‌ డిసైడ్‌ అవుతాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×