Brahmamudi serial today Episode: కావ్య రిపోర్ట్ లో ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పగానే.. అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. మరి ఇప్పుడు ఏం చేయాలని కళ్యాణ్ అడుగుతాడు. జనరల్‌గా ఇలాంటి కేసుల్లో బేబీని 9 నెలలు మోయడం కష్టం అందుకే ఏడు నెలలకే డెలివరీ చేయాలి. లేదంటే తల్లి బిడ్డకు ఇద్దరికీ డేంజర్ అని చెప్తుంది. దీంతో అప్పు ఏడుస్తుంది. ఆ బిడ్డ మీద మా అక్క ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుంతుంది. ఇప్పుడు ఇలా జరుగుతుందని తెలిస్తే మా అక్క చనిపోతుంది డాక్టర్. ఫ్లీజ్ ఎలాగైనా మా అక్కను ఆ బిడ్డను కాపాడండి.. అంటూ ఎమోషనల్ అవుతుంది. అయితే మా సుపీరియర్స్ తో మాట్లాడి ఏదైనా ఆప్షన్ ఉందేమో తెలుసుకుని చెప్తాను మీరు వెళ్లండి అని చెప్తుంది. దీంతో సరే అంటూ అప్పు వాళ్లు వెళ్లిపోతారు.
హాల్లో కూర్చున్న అపర్ణ, ఇంద్రాదేవి దగ్గరకు కావ్య వెళ్లి మిమ్మల్ని చూస్తుంటే.. జాలి వేస్తుంది అంటుంది. ఏంటే మమ్మల్ని చూస్తే నీకు వెటకారంగా ఉందా..? అంటుంది అపర్ణ. దీంతో నిజం చెప్తున్నాను అత్తయ్యా నాకు మీలా ఎదురుచూడాల్సిన పని లేదు ఇలా చిటికె వేశాను అనుకో అలా వచ్చేస్తుంది అంటుంది కావ్య. అవునా ఏదమ్మా ఒక్కసారి చిటికె వేయ్.. అంటుంది ఇంద్రాదేవి. ముందు మీకేం కావాలో కోరుకోండి అని చెప్తుంది కావ్య. కోరుకోగానే తీసుకురావడానికి నీ దగ్గరేమైనా అల్లా ఉద్దీన్ అద్బుత దీపం ఉందా.. లేక ఏమైనా మాయలు ఉన్నాయా ఏంటి..? అని అపర్ణ అడుగుతుంది. మాయో మంత్రమో మీకేం కావాలో కోరుకోండి అంటుంది కావ్య.. దీంతో నాకు ఆరెంజ్ జ్యూస్ అంటుంది ఇంద్రాదేవి. నాకు ఫైనాపిల్ జ్యూస్ అంటూ చెప్తుంది అపర్ణ.
అంతే కదా ఇప్పుడు చూడండి అంటూ కావ్య చిటికె వేయగానే.. ఆరంజ్, ఫైనాపిల్ తొక్కలతో రాజ్ ప్రత్యక్షమవుతాడు. రాజ్‌ను చూసిన అపర్ణ, ఇంద్రాదేవి షాక్ అవుతారు. అపర్ణ కోపంగా ఏంటి ఈ తొక్కలు తినాలా మేము అంటుంది. సారీ సారీ మర్చిపోయాను.. అంటూ మళ్లీ రాజ్ మాయం అయిపోయి జ్యూస్ తీసుకుని వస్తాడు. ఆ జ్యూస్ తీసి వాళ్లిద్దరికి ఇవ్వగానే.. రాజ్ కోపంగా కళావతి నేను తీసుకొచ్చింది నీకోసం వాళ్లకు కాదు అంటాడు. దీంతో ముగ్గురు కలిసి రాజ్‌ను తిడుతుంటారు.. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. అందరూ కలిసి వినాయక విగ్రహం గురించి మాట్లాడుకుంటారు. మూర్తి, రాజ్ కలిసి విగ్రహం తయారు చేయాలనుకుంటారు. తర్వాత రాత్రికి అందరూ కలిసి విగ్రహం తయారు చేస్తుంటారు. రాజ్ మాత్రమే విగ్రహం తయారు చేయడానికి రెడీ అవుతాడు. అందరూ చూస్తుంటారు. రాజ్ విగ్రహం చేయడానికి నానా ఇబ్బంది పడుతుంటాడు. కొద్ది సేపటికే రాజ్ అలసిపోతాడు.
దీంతో ఇంద్రాదేవి ఏంట్రా మనవడా..? పాట పూర్తి అయ్యేలోపు విగ్రహం పూర్తి అయిపోతుందన్నావు.. చూస్తుంటే వీడు అయిపోయేలా ఉన్నాడు అత్తయ్యా.. అంటుంది అపర్ణ. ఏవండి ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? విగ్రహం చేయడం అంత ఈజీ కాదని అంటుంది కావ్య.. దీంత రాజ్ కోపంగా హలో ఏ పనైనా సరే మధ్యలో వదిలేయడం ఇష్టం లేదు ఈ స్వరాజ్‌కు మీరందరూ వెళ్లిపోండి అంటాడు రాజ్. ఎందుకని కావ్య అడగ్గానే.. డిస్టబెన్స్ గా ఉంది నాకు .. నేను కాన్‌సంట్రేషన్ చేయలేకపోతున్నాను.. అంటాడు. అందరూ వెళ్లిపోయాక రాజ్ రిక్వెస్టుగా మూర్తిని విగ్రహం చేయడానికి హెల్ప్ అడుగుతాడు. సరేనని మూర్తి చెప్తుంటే.. రాజ్ విగ్రహం చేస్తాడు. విగ్రహం పూర్తి అయ్యాక మామయ్య ఎలా ఉంది..? అని అడుగుతాడు. సూపర్ అల్లుడు గారు అంటాడు మూర్తి ఇంతలో కావ్య లోపలి నుంచి వస్తుంటే..
రాజ్ కంగారుగా మామయ్య మీరు పక్కకు వెళ్లండి అంటాడు.. సరే బాబు అంటూ బయటకు వెళ్తాడు. కావ్య రాగానే.. ఇద్దరూ కలసి నవ్వుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే.. అప్పుడే కళ్యాణ్, అప్పు వస్తారు.. వాళ్ల సంతోషాన్ని చూసి ఎమోషనల్ అవుతారు.. తర్వాత అప్పు ఇంట్లో దేవుడి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ.. అసలేం చేస్తున్నావు నువ్వు.. మా అక్క జీవితంలో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు.. తను ఏం తప్పు చేసిందని తనకు ఇన్ని శిక్షలు విధిస్తున్నావు.. నిన్ను నమ్మడమే తను చేసిన తప్పా..? అంటూ ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. అప్పును ఓదారుస్తాడు. మనం కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్మి.. ఇష్టం వచ్చినప్పుడు మర్చిపోవడానికి దేవుడు అనేది గుడిలో రూపం కాదు మనలో నమ్మకం.. అంటూ కళ్యాణ్ మోటివేట్ చేస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం