Health Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సరికొత్త ఆరోగ్య విధానం తీసుకొచ్చింది. ప్రతి కుటుంబం ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించే యూనివర్సల్ ఆరోగ్యం స్కీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చంద్రబాబు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఏపీలో ప్రతి కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య సేవలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది చంద్రబాబు సర్కార్. అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతోపాటు ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటివరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదంటూ చాలామంది ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన చంద్రబాబు కేబినెట్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌కు ఆమోద ముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయం ప్రకారం.. ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఫ్యామిలీకి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువనున్న కుటుంబాలు, ఉద్యోగులు, జర్నలిస్టులు అన్నివర్గాల ప్రజలకు 3,257 రకాల చికిత్సలకు ఉచితంగా సేవలు అందనున్నాయి.
ALSO READ: స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం
ఏపీలో 1.63 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా సేవలు పొందుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లతో కలిసి 8.60 లక్షల కుటుంబాలున్నాయి. తొలుత బీమా ద్వారా రూ.2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన సొమ్ము బీమా కంపెనీ తొలుత చెల్లిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని రీయింబర్సు చేస్తుంది.
ఆ తర్వాత రెండున్నర లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం. దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారికి రూ.2.5 లక్షల వరకు బీమా వర్తించనుంది. అలాగే జర్నలిస్టులు ఈ పథకంలోకి రానున్నారు. ఉద్యోగుల వైద్య పథకం పరిధిలోకి వచ్చేవారికి తప్పా, మిగతా వారంతా ఈ పథకానికి అర్హులు.
3,257 రకాల వైద్య సేవలకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 324 రకాల వైద్య సేవలకు కూడా. అనారోగ్యంతో సిక్ అయినవారు ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపు ఉచితంగా వైద్యానికి అనుమతి ఇస్తారు. రెండువారాల్లోగా ఆసుపత్రులకు ఆయా బిల్లులు చెల్లిస్తారు. ప్రతి పేషెంట్ క్యూఆర్ కోడ్ ఇచ్చి అమలు తీరుపై పర్యవేక్షణ చేస్తారు.
అందుకోసం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. అక్రమాలు జరిగితే పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం కింద వాటిపై చర్యలు తీసుకోవడం ఖాయం.
మరో విప్లవాత్మక, సంచలన పధకంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. మ్యానిఫెస్టోలో చెప్పిన మరో హామీ అమలు..
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
* ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత… pic.twitter.com/muVXtA9YJX
— Telugu Desam Party (@JaiTDP) September 4, 2025