Brahmamudi serial today Episode: కావ్యకు ఫోన్ చేసిన రాజ్.. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో రాజ్ కూడా మా ఆంటీ ఇప్పుడే నన్ను వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పింది. నేను కూడా మార్కెట్‌కు వెళ్తున్నాను మీరు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. కూరగాయలు ఎలా కొనాలో తెలియదు. కాస్త మీరే కొనిపెట్టాలి. మీరు ముందుగా మార్కెట్‌కు వస్తే.. నాకోసం వెయిట్ చేయండి.. నేను ముందుగా మార్కెట్‌కు వస్తే నేను వెయిట్ చేస్తాను అంటాడు. దీంతో కావ్య సరే అంటూ ఫోన్ కట్ చేసి దారి చూపించమంటే ఏకంగా గమ్యానికే చేరుస్తున్నావా..? స్వామి అంటూ దేవుణ్ని మొక్కుతుంది. ఉదయం మిస్ అయింది ఇప్పుడు ఎలాగైనా నీ నుంచి నిజం రాబట్టాలి అని రాజ్ మనసులో అనుకుంటాడు.
తర్వాత రాజ్, కావ్య మార్కెట్ లో కలుస్తారు. ఏంటి కళావతి గారు ముందే వచ్చేశారు. ఈ షాపు మీ ఇంటికి చాలా దగ్గర కదా అంటూ రాజ్ అడగ్గానే.. లేదండి మా డ్రైవర్‌కు కొంచెం స్పీడెక్కువ అని చెప్తూ.. ఈ షాపు మీ ఇంటికి కొద్దిగా దూరం కదా అంటుంది. దీంతో రాజ్ భలే కనిపెట్టారే ఎలా అని అడుగుతాడు. ఈ మధ్యన నాకో క్లెవర్ పర్సన్ పరిచయం అయ్యాడు అందుకే కనిపెట్టగలిగాను అంటుంది కావ్య. అవునా ఇంతకీ ఎవరతను అని రాజ్ అడగ్గానే.. రామ్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అని చెప్పగానే.. రాజ్ ఈవిడతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య అసలు ఈ ఇంట్లో ఆడవాళ్లు రాకుండా అసలు కూరగాయలే కొనడం రాని మిమ్మల్ని ఎందుకు మార్కెట్‌కు పంపించారు అని అడుగుతుంది. దీంతో రాజ్ కంగారు పడుతూ.. రేపు గుడిలో అన్నదానం ఉంది అందుకే మార్కెట్‌కు నేను రావాల్సి వచ్చింది అని ఫ్లోలో చెప్తాడు రాజ్.
దీంతో కావ్య షాక్ అవుతుంది. అసలు రేపు స్పెషల్ ఏంటండి అని కావ్య అడగ్గానే.. నాకు చాలా స్పెషల్ అని చెప్తాడు రాజ్. అదే ఏం స్పెషల్ అండి అంటూ కావ్య అడగ్గానే.. రాజ్ తడబడుతూనే అది రేపు మా అమ్మ పుట్టిన రోజు అని చెప్తాడు. దీంతో కావ్య ఎమోషనల్ గా మీ అమ్మగారిదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అవునండి ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజుకు నేను గుడిలో అన్నదానం చేస్తాను. దానికోసమే.. అని చెప్తాడు. దీంతో కావ్య ఎగ్జైంటింగ్ గా అమ్మంటే మీ అమ్మేనా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ అవును.. అన్నదానం చేయడం నాకు చాలా ఇష్టం అండి అని చెప్పగానే.. కావ్య ఈయనకు నిజంగానే గతం గుర్తు లేదా..? లేక గతం మర్చిపోయినట్టు నాతో ఫ్రాంక్ చేస్తున్నారా..? అని మనసులో అనుకుంటుంది. ఏవండి మీ అమ్మగారు అని అడగబోతుంటే.. రాజ్ నీ చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారండి.. ఆవిడ జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తుంటాను అని చెప్పగానే.. ఈయనకు గతం గుర్తు లేదు అని ఆలోచిస్తుంటే.. రాజ్ అమ్మను తలుచుకుని ఎమోషనల్ అవుతాడు. ఇంతలో కావ్య అన్నదానానికి కావాల్సిన కూరగాయల లిస్ట్ చెప్తుంది.
ఈవిడ ఎక్కువ కొనేస్తుంది అని రాజ్ మధ్యలో ఆపేస్తాడు. ఈ వంటలన్నీ మీ చేతులతో మీరే చేస్తే బాగుంటుందండి అని చెప్పగానే.. అంతమందికి నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను అంటుంది కావ్య. దీంతో రాజ్ కావాలంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. మీ చేతులకు ఏమైనా అయితే మసాజ్ చేస్తాను. కావాలంటే ఆయిట్‌మెంట్ రాస్తాను అంటాడు రాజ్. దీంతో కావ్య సరే మీరు ఇంతలా బతిమాలుతుంటే చేస్తాను లేండి. ఇంతకీ అన్నదానం చేసేది ఏ గుడిలో అని అడుగుతుంది. రాజ్ తడబడుతుంటే.. నేను గెస్ చేయనా రామాలయం కదా..? అంటుంది కావ్య. రాజ్ కూడా అవును బలే గెస్ చేశారు అంటూ రేపు గుడిలో కలుద్దాం అంటూ రాజ్ వెళ్లిపోతాడు.
రాజ్ ఇంటికి వెళ్లగానే.. యామిని, వైదేహి నాటకం మొదలుపెడతారు. బావ నువ్వు కూరగాయల తేలేదా..? అని అడుగుతుంది. నేను కూరగాయలు తీసుకురావడం ఏంటి..? అని రాజ్ అడగ్గానే.. నువ్వు కూరగాయల షాపుకు వెళ్లావు కదా అందుకే అడుగుతున్నాను అంటుంది. దీంతో రాజ్ నేను కూరగాయల షాపుకు వెళ్లానని ఎలా తెలుసు అంటూ ప్రశ్నిస్తాడు. నేను ఎక్కడికి వెళ్లేది ఎలా తెలస్తుంది. నన్ను ఫాలో చేస్తున్నావా..? అంటూ నిలదీస్తాడు. దీంతో నేను ఫ్రెండు దగ్గర నుంచి వస్తుంటే నిన్ను కూరగాయల షాపు దగ్గర ఉన్నావు అందుకే అడిగాను అని చెప్తుంది.. సరే బావ నువ్వు వెళ్లి ఫ్రెస్ అయి రా అంటుంది. రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య రాజ్ గురించి ఆలోచిస్తుంది. రాజ్ తన రూంలోకి వచ్చి తనతో మాట్లాడినట్టు కలగంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?