Tollywood Heroine:ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన ఈమె సడన్గా బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడే బాలీవుడ్ నటుడు ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీ (Jackie bhagani) ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక మొదట వీళ్ళిద్దరూ పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని.. ఆ తర్వాత జాకీ సాంప్రదాయం ప్రకారం సింధీ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు. అలా రెండుసార్లు వివాహం చేసుకున్న వీరు.. ఇటీవల తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.
గర్భం దాల్చిన రకుల్ ప్రీత్ సింగ్..
ఇకపోతే అప్పుడే ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరొకవైపు వీరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అసలు విషయంలోకి వెళితే.. జాకీ – రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరిలో ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినా సరే ఇదే నిజమని నెటిజన్స్ చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం రకుల్ తన గర్భాన్ని దాస్తోందని, కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల్లో బయటపెడుతుందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలాంటి వార్తలు రావడానికి కారణం రకుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా టైట్ ఫిట్ గ్లామర్ డ్రెస్ లో కనిపించే ఈమె.. ఇప్పుడు ఫుల్లుగా కంఫర్ట్ గా ఉండే డ్రెస్సుల్లో మాత్రమే అలరిస్తోంది. వాటి వెనుక కారణం తెలియకపోయినా గర్భిణీ అవడం వల్లే డ్రెస్సింగ్ సెన్స్ లో ఛేంజ్ చేసిందని నెటిజన్ లు అంటున్నారు.
ఎగ్జాంపుల్స్ తో సహా వార్తలు వైరల్ చేస్తున్న నెటిజన్స్..
అయితే ఇప్పుడు వీటికి తోడుగా జాకీ భగ్నానీ షేర్ చేసిన వీడియో కూడా కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. కిచెన్ లో ఎంతో ప్రేమగా జాకీ వంట చేస్తూ కనిపించాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకుల్ కోసమే జాకీ వంట చేస్తున్నాడని, దీనికి తోడు ఆమె కొంతకాలం కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని, పర్సనల్ బ్రేక్ తీసుకుంటానని ఆమె చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వీటన్నింటినీ కూడా ఉదాహరణగా చూపిస్తూ రకుల్ గర్భవతి అయిందని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారుm ఏది ఏమైనా ప్రస్తుతం రకుల్ తన ప్రెగ్నెన్సీ పీరియడ్ను ఎంజాయ్ చేస్తోందని, దగ్గరుండి జాకీ మరి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారని సమాచారం. మరి రకుల్ ప్రెగ్నెన్సీ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఇదే వార్తలు నిజమవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది దీనిపై రకుల్ అధికారిక ప్రకటన ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు.
Kubera Update: ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్.. అంచనాలు పెంచేసిన రష్మిక..!