Brahmanandam:బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక తాజాగా పదవ సీజన్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే . దాదాపు పది మంది సెలబ్రిటీలు , 6 మంది కామనర్స్ తో ప్రారంభమైన ఈ సీజన్లో అప్పుడే రెండు వారాలు పూర్తయ్యాయి. మొదటి రెండు వారాల్లో భాగంగా చైత్ర, కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు .ప్రస్తుతం 8 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో మరో ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. అందులో ఇద్దరికీ అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని కలిగిస్తుంటే.. మరొకవైపు వచ్చీ రానీ తెలుగుతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానుల హృదయాలు దోచుకుంటున్న కంటెస్టెంట్లు మరొకవైపు.. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ కూడా ఒకరనే చెప్పాలి. బెంగాలీ నేపథ్యం నుండి వచ్చిన ఈమె తెలుగులో మాట్లాడే విధానం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హౌస్ మేట్స్ అందరితో కలివిడిగా కలిసిపోయే విధానం, అటు హౌస్ మేట్స్ కే కాకుండా బయట ప్రేక్షకులకు కూడా ముచ్చట అనిపిస్తుంది.
అంతేకాదు మనసులో ఏది పెట్టుకోకుండా హౌస్ లోకి వచ్చిన తొలి వారమే తనకు ముఖేష్ అంటే ఇష్టం అని హోస్ట్ నాగార్జున ముందే చెప్పేసి తనలోని నిజాయితీని నిరూపించుకుంది. ఇక దీంతో నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తూ ఉండడం గమనార్హం. అందులో భాగంగానే ఈమెకు సంబంధించిన పాత వీడియోలను, మీమ్స్ ను ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
also read:సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’.. అసలు కారణం ఏంటంటే?
అందులో భాగంగానే శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన ఒక టీవీ షో కి టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో ఆమె మాట్లాడే తెలుగు పై ప్రశంసలు కురిపించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోలో భాగంగా శ్రీముఖి దేబ్జానీ గురించి చెబుతూ ఈమెకు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాకపోయినా.. తెలుగు పాటలు చాలా బాగా పాడుతుంది సార్ అంటూ బ్రహ్మానందం కి ఆమెను పరిచయం చేసింది. బ్రహ్మానందం ఆమె మాటలను విని ప్రశంసిస్తూ.. దేబ్జానీ నిన్ను చూస్తుంటే చాలా జలసీగా ఉంది. తెలుగు తెలియదు. మేము ఏం మాట్లాడుతున్నామో అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె పాడిన పాటలు విని.. అబ్బా.. చాలు.. చాలా బాగా పాడావు. చాలా సంతోషం తల్లి.. అంటూ ఎప్పటిలాగే తన మార్క్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.