E-Paper
Advertisement

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’.. అసలు కారణం ఏంటంటే?

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రంభ ఊర్వశి మేనక’.. అసలు కారణం ఏంటంటే?
Advertisement

Rambha Urvashi Menaka OTT streaming:గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడ్డ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ పాత జానర్ ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా ,చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకోవడం గమనార్హం.

సైలెంట్ గా 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన రంభ ఊర్వశి మేనక..

అలాంటి ఈ సినిమా థియేటర్లలో ఎక్కువ కాలం నిలబడకపోవడం, దీనికి తోడు మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్ నుండి తొలగించి, 20 రోజుల్లోనే సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేశారు. సెప్టెంబర్ 25 అనగా నేటి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎటువంటి ముందస్తు హడావిడి కానీ, ప్రచారం కానీ లేకుండానే నేరుగా, సైలెంట్ గా ఓటీటీలోకి తీసుకురావడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వెన్నెల కిషోర్ , విష్ణు ప్రియ, హరితేజ, రాశి సింగ్, ప్రిషా సింగ్ ,వీకే నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

also read:శ్రీకాళహస్తీశ్వరాలయంలో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా?

రంభ ఊర్వశి మేనక స్టోరీ..

రంభ ఊర్వశి మేనక సినిమా కథాంశం విషయానికి వస్తే.. నాటక కళాకారుడైన సూరి (అల్లరి నరేష్) కుటుంబంలో తన తండ్రి వద్ద నుంచి ఒక పురాతన మాయా పుస్తకాన్ని సొంతం చేసుకుంటాడు. దాని ద్వారా దేవలోకసుందరులైన రంభ, ఊర్వశి, మేనక లను భూమిపైకి రప్పించవచ్చని వారి నమ్మకం . ఈ క్రమంలో అనారోగ్యం పాలైన తన తల్లిని కాపాడుకోవడానికి సూరి ఆ మాయ పుస్తకాన్ని ఉపయోగిస్తాడు. అనుకున్నట్టుగానే ఆ ముగ్గురు దేవకన్యలు భూమి పైకి వస్తారు. ఆ తర్వాత చోటు చేసుకున్న వినోదాత్మక గందరగోళమే ఈ సినిమా కథ. అటు థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ .. అల్లరి నరేష్, వెన్నెల కిషోర్ , వీకే నరేష్ ల కామెడీ టైమింగ్ కి మంచి ప్రశంసలు లభించాయి . ఇక థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్లో ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

అల్లరి నరేష్ తదుపరి చిత్రాలు..

Advertisement

అల్లరి నరేష్ ప్రస్తుతం మెహర్ తేజ్ దర్శకత్వంలో ఆల్కహాల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నిహారిక ఎన్ ఎమ్, రుహాని శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సతీష్ మల్లంపాటి దర్శకత్వంలో సభకు నమస్కారం అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. నవ్వించే ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో బివిఎస్ రవి రచనలో, యాక్షన్ ,డివోషనల్ భావోద్వేగాల మేళవింపుగా రాబోతున్న మరో చిత్రం కనకదుర్గ. ఈ మూడు చిత్రాలలో ప్రస్తుతం నరేష్ నటిస్తున్నారు. కనీసం ఇవైనా ఆయనకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజు స్ట్రీమింగ్ ఇవే. .

మృణాల్ ఠాకూర్‌ ఫేవరేట్ మూవీ… బ్రేకప్ తర్వాతే అసలు కథ మొదలైతే? ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్

కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్‌లో వరుస హత్యలు… అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హై టెన్షన్ క్రైమ్ థ్రిల్లర్

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

చనిపోయినా ఇంటి నుంచి కదలని శవం… వణుకు పుట్టించే హారర్ మిస్టరీ

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

Big Stories

Advertisement
×