E-Paper
Advertisement

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!
Advertisement

Priyanka Jain: ప్రముఖ బుల్లి తెరనటి ప్రియాంక జైన్(Priyanka Jain) నటుడు శివకుమార్ (Shiva Kumar) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శివకుమార్ బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10) కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక జైన్ బయట తన ప్రియుడు శివకు కావలసిన మద్దతును కోరుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ముఖేష్(Mukesh) శివకుమార్ దేబ్జానీ(Debjani) మధ్య సంబంధం ముడి పెడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

నా జీవితంలో అందమైన అమ్మాయి ఉంది..

ముఖేష్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వద్దకు వెళ్లి శివకుమార్ దేబ్జానీ వెంటపడుతున్నారని అందరికీ ప్రచారం చేశారు. అయితే ఈ విషయం కాస్త శివకుమార్ చెవిన పడటంతో ఆయనే నేరుగా వెళ్లి ఇదే విషయం గురించి దేబ్జానీతో మాట్లాడారు. నా జీవితంలో అందమైన అమ్మాయి ఉంటే నేనెందుకు పోగొట్టుకుంటాను అంటూ స్పష్టంగా తనకు దేబ్జానీ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సంఘటన పట్ల ప్రియాంక జైన్ తాజాగా స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.

శివ్ ను డిస్టర్బ్ చేయడమే ఉద్దేశం ..

Advertisement

ఈ వీడియోలో భాగంగా ప్రియాంక మాట్లాడుతూ .. శివ్ దేబ్జానీ వెంటపడుతున్నాడా? ఆ మాట అనడానికి ముఖేష్ కు నోరు ఎలా వచ్చింది? ఒక అమ్మాయిగా తాను ఈ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుందని కాస్త ఘాటుగా స్పందించారు. ముఖేష్ తో పాటు మరొక అమ్మాయి అంటూ వర్షిణిను ఉద్దేశించి కూడా ప్రియాంక జైన్ మాట్లాడారు. శివ్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు ఆయన గేమ్ పైన ఫోకస్ పెట్టడంతో తనని డిస్టర్బ్ చేయడం కోసమే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ముఖేష్ ఇలాంటి గొడవలతో ఫేమ్ ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే తన కోసం బయట ఎంతో మంది మేనేజర్లు పి ఆర్ టీమ్ లు పనిచేస్తున్నారని ప్రియాంక తెలిపారు.

Advertisement

శివకుమార్ లైఫ్ పార్టనర్ గా నేను కచ్చితంగా ఇదే అంశాల గురించి మాట్లాడుతాను నేను శివ్ కు మద్దతుగా పోస్టులు పెడితే కామెంట్ల రూపంలో నన్ను చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ప్రియాంక జైన్ తెలిపారు. అయితే తాను ఇలాంటి బెదిరింపులకు ఏమాత్రం భయపడను కచ్చితంగా శివ కోసం నేను నిలబడతానని ఈమె తెలిపారు. ఇక శివ చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నారని ఆయన కల కప్పు తీసుకొని బయటకు రావడమేనని తెలిపారు. చివరిలో శివకుమార్ మాట్లాడిన మాట నాకు జీవితంలో అందమైన అమ్మాయి ఉంటే ఎందుకు పోగొట్టుకుంటాను అని మాట్లాడటం తనకు చాలా బాగా నచ్చింది అంటూ శివకుమార్ కు మద్దతుగా ముఖేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఝాన్సీ వర్షిని రోహిత్ గురించి కూడా ఈమె ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: ఆ వార్తలను నమ్మొద్దు.. కొరటాల బాలయ్య సినిమా రూమర్ల పై టీం క్లారిటీ!

Related News

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

పెళ్లి కాకుండా కర్వా చౌత్.. నీ ‘అతి’ తట్టుకోలేకపోతున్నాం అక్కా!!

పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×