Radha – Sanjay Thumma: బుల్లి తెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతి ఒక్క ఛానల్లోనూ ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ ద్వారా సరికొత్త కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక స్టార్ మా విషయానికి వస్తే ఇప్పటికే ఈ కార్యక్రమంలో స్టార్ మా పరివార్ తో పాటు, కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్, ఇస్మార్ట్ జోడి, వంటి పలు కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ కార్యక్రమం త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ తరుణంలోనే ఈ స్థానంలో మరొక కొత్త కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు.
సందడి చేయబోతున్న జాతి రత్నాలు…
ఇకపోతే ఈసారి స్టార్ మా సరికొత్తగా కుకింగ్ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. “కుక్ విత్ జాతి రత్నాలు”(Cook With jathirathnalu) అనే కొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్లతో పాటు బుల్లితెర నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ షో చాలా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
వినోదాత్మకంగా కుకింగ్ షో..
ఇక ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని అందిస్తారని స్పష్టమవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రదీప్ (Pradeep)యాంకర్ గా వ్యవహరించగా సీనియర్ నటి రాధ(Radha) జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ(Sanjay Thumma) ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ లోని నటీనటులు భాగం కాబోతున్నారు. ఇక ఈ కుకింగ్ షో ద్వారా సరికొత్త వంటకాలను తయారు చేస్తూ అదే సమయంలోనే ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని కూడా పంచబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే ఎన్నో కుకింగ్ షోస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ, కుక్ విత్ జాతి రత్నాలు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షో మాత్రం చాలా విభిన్నంగా మరింత వినోదాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది కానీ ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రసారమవుతుందనే తేదీని మాత్రం అధికారికంగా తెలియజేయలేదు. ప్రస్తుతం శని, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఇది పూర్తి అయిన తరువాతనే ఈ కుకింగ్ షో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమం కూడా శని, ఆదివారం ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమవుతోంది.
Also Read: ఎవరనీ నమ్మకూడదు? కావాలానే మా ఇద్దరిని ఫ్రేమ్ చేస్తున్నారు.. ‘కిస్సిక్ టాక్స్’లో నిఖిల్