Hyderabad News: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బుక్కైపోతారు. కనిపించని నిఘా నేత్రం ఉంటుందనే విషయం మరిచిపోవద్దు. హైదరాబాద్‌లో 18 మంది యువకులు అలాగే చేశారు. పిల్లల సంబంధించిన ఆ‘’ తరహా వీడియోలు డౌన్‌లోడ్ చేసి వాటిని షేర్ చేయడం మొదలుపెట్టారు. అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్ వీటిని పసిగట్టింది. వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు.
అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత యువత రెచ్చిపోతోంది. మంచికి ఉపయోగించినవారు కొందరైతే, విచ్చల విడిగా దుర్వినియోగం చేసినవాళ్లు ఇంకొందరు. అలా వ్యవహరించినవారిపై నిఘా ఉంటుంది. అలాగే చిక్కారు హైదరాబాద్‌కి చెందిన 18 మంది యువకులు.
చిన్నారుల వల్గర్ వీడియోలు డౌన్‌లోడ్ చేశారు. ఆ తర్వాత వాటిని మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెట్టింది అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్. ఆయా వ్యక్తుల సమాచారాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి అందించింది.
రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, వారిని అరెస్టు చేశారు. ఈ తరహా వీడియోల విషయంలో ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తమను ఎవరు చూడరని భావించారు యువకులు. పోలీసులు చేసిన హెచ్చరికలు పట్టించుకోలేదు. పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: ప్రభాకర్ రావు అరెస్ట్? కేసీఆర్‌కు కష్టాలే?
దీనిపై విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఒక్కో వ్యక్తిపై కనీసం ఐదు ఫిర్యాదులు నమోదైనట్టు సమాచారం. నిందితుల డివైజ్‌లను స్వాధీనం చేసుకొని డేటాను పరీక్షలకు పంపారు. ఆయా వీడియోల షేరింగ్ విషయంలో కఠిన చట్టాలు ఉన్నాయి. కానీ, ఆ యువకులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు.
పిల్లల భద్రత, గౌరవం కాపాడాల్సినవారు ఇలాంటి కార్యకలాపాలు పాల్పడడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు అధికారులు. ఈ తరహా వీడియోల డౌన్‌లోడ్ లేదా షేరింగ్ చేయడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. చట్ట రీత్యా తీవ్రమైన నేరమని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయినవారిపై పోస్కో యాక్ట్ , ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలియజేశారు.
ఇంటర్నెట్‌లో జాగ్రత్తగా ఉండకుంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ప్రస్తుత ఘటన ఓ ఎగ్జాంఫుల్. ఈ విషయంలో తల్లిదండ్రులు, యువత, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ విభాగం పోలీసులు.