Uppu Kappurambu Trailer:మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh), ప్రముఖ యంగ్ హీరో సుహాస్ (Suhas) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉప్పుకప్పురంబు (Uppu Kappurambu). నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల కాబోతోంది. ఐ.వి. శశి దర్శకత్వంలో వసంత్ మురళీకృష్ణ కథ అందిస్తున్నారు. ఎల్లనార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధిక లావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు ఒక సామాజిక సమస్య గురించి ప్రస్తావించినట్లు మేకర్స్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆహ్లాదకరంగా, సెటైరికల్ గా ఉంటూనే చూసే ఆడియన్స్ ను ఈ సినిమా ఆలోచింపచేసే దిశగా ఉండనుందట. అంతేకాదు ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానున్నట్టు తెలిపారు. తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇప్పుడు తమిళ్, హిందీ, మలయాళం , కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్తో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని విడుదల చేయగా ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదల చేశారు.
ఉప్పుకప్పురంబు ట్రైలర్..
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తాజాగా ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఊరి స్మశానంలో ఇంకా కేవలం నలుగురికి మాత్రమే చోటు ఉంది.. ఇక దీనిని బేస్ చేసుకుని సస్పెన్స్ పాటు హిలేరియస్ గా ట్రైలర్ ను కొనసాగించారు. ఊరు పెద్దగా అధికారంలోకి వచ్చిన కీర్తి సురేష్.. ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసింది? అనేది ఈ సినిమా స్టోరీ. ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కీర్తి తన లుక్ మొత్తం మార్చేసిందని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత ప్రముఖ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ (Babu Mohan) కూడా మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు సుహాస్ కూడా కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. మొత్తానికైతే ఈ ట్రైలర్ ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
ఉప్పుకప్పురంబు ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్ ఓపెన్ అవ్వగానే పాడెను మోసుకెళ్తూ స్మశానం లోకి వెళ్తున్న సన్నివేశాన్ని చూపించారు. అసలు ఏమీ తెలియని ఒక అమ్మాయి.. వూరి పెద్దగా బాధ్యతలు తీసుకొని, ఎలాంటి పాట్లు పడింది అనేది ఈ ట్రైలర్లో చాలా చక్కగా చూపించారు. ఆ అమాయకపు అమ్మాయి పాత్రలో మహానటి మరొకసారి జీవించేసింది. ఊరి పెద్దగా అవతరించిన తర్వాత.. ఊరి ప్రజలతో ఏంటి మీ సమస్య? అని కీర్తి సురేష్ అడగగా.. సుహాస్ మాట్లాడుతూ.. “స్మశానానికి వెళ్లి వచ్చిన తర్వాత మన ఊరి స్మశానంలో కేవలం నలుగురికి మాత్రమే పూడ్చి పెట్టడానికి అవకాశం ఉంది”.. అంటూ చెబుతాడు. ఇక దీనికి పరిష్కారం ఎలా కనుగొనాలి అనే డైలమాలో పడిపోతుంది కీర్తి సురేష్. ఆఖరికి హీరో సహాయంతో ఆ స్మశానంలో ఆ నలుగురికి చోటు కల్పించడానికి లిస్టు తయారు చేసామంటూ చెబుతుంది. అయితే స్మశానంలో ఎవరికి చోటు కల్పించాలి అనే విషయంలో ఊరి ప్రజల మధ్య వాగ్వాదం నెలకొంటుంది. ఆ గొడవలో ఒకేసారి నలుగురు చనిపోతారు.. దాంతో స్మశానానికి కూడా హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తారు. ఆ తర్వాత చనిపోయే వ్యక్తిని ఎక్కడ పూడ్చిపెట్టారు? అసలేం జరిగింది? ఈ సమస్యను కీర్తి సురేష్ సాల్వ్ చేసిందా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే సస్పెన్స్ తో పాటు కామెడీ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ALSO READ: Ram Charan: పెద్ది మూవీలో మీర్జాపూర్ నటుడు.. బుచ్చిబాబు ప్లాన్ అదుర్స్!