E-Paper
Advertisement

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!
Advertisement

Daiwik Singer: ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’…జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఎంతో మంది కొత్త టాలెంట్ కి ఒక వరమని చెప్పుకోవచ్చు.

తాజాగా ఇదే ప్లాట్ ఫామ్ ని ఉపయోగించుకుని తనదైన స్వరంతో అటు ఆడియన్స్ ని ,ఇటు జడ్జిల మనసుల్ని దోచుకుంటున్నాడు వైజాగ్ నుండి వచ్చిన సింగర్ దైవిక్.ఇక అన్నింటి కన్నా మించి దైవిక్ గొంతు గాన గంధర్వుడు sp బాల సుబ్రహ్మణ్యం గొంతుని పోలి ఉండటంతో దైవిక్ వాయిస్ కి అంతా ఫిదా అవుతున్నారు.

Advertisement

కన్నుల నీలమై నవ్వులా వెన్నెలై 

ఇక తాజాగా ఈ షోలో సండే వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.అందులో దైవిక్, తన కో సింగర్ శ్రీనిధి కలిసి కీరవాణి చిలకలా –( అన్వేషణ -1985)అనే పాటని పాడిన తీరు అందరిని ఆకట్టుకుంది.ముఖ్యంగా అందులోని ‘నీ కన్నుల నీలమై నవ్వులా వెన్నెలై సంపెంగలా గాలినై…’ అనే చరణంని దైవిక్ పాడుతుంటే స్వర్గం నుండి బాలుగారే దిగివచ్చి ఈ పాట పాడారా అన్నట్టు అనిపిస్తుంది.అలా దైవిక్ డిట్టో దించేయడంతో ఫిదా అయిపోయారు జడ్జస్. ఇక చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఫహద్ కూడా దైవిక్ పాటకి ముగ్ధుడైపోయాడు.

Advertisement

అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతూ

ఇక దైవిక్ పాట విన్న అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతూ అంత ఎఫర్ట్ లెస్ గా అంత కూల్ గా ఆ సాంగ్ ని ఎలా పాడగలుగుతున్నావ్ అంటూ దైవిక్ ని ఆకాశానికి ఎత్తేశాడు .ముఖ్యంగా పాటలో ఉండే కష్టతరమైన నోట్స్ ని కూడా దైవిక్ అద్భుతంగా, అలవోకగా పాడటం ఈ ఎపిసోడ్ లో హైలెట్ అని చెప్పాలి.

ఇక దైవిక్ కి జోడీగా శ్రీనిధి కూడా “విరబూసిన ఆశలు… విరి తేనెలు చల్లగా… అలరులు పూసిన ఋతువుల తడిసిన…” అంటూ ఇళయరాజా అందించిన పాటకి తన వంతు నిండు తనం చేకూర్చింది. మొత్తంగా ఇద్దరు పోటాపోటీగా కలిసి పాడిన తీరుని మెచ్చుకోవాల్సిందే.

దైవిక్ జతగా శ్రీనిధి కూడా

ఇక దైవిక్ ఎప్పుడు స్టేజ్ పై పాడినా కేవలం పాట పాడిపోవడమే కాకుండా ఆ పాటలోని భావాన్ని ఆడియన్స్ కి చేరవేయడంలో తనవంతు ప్రయత్నం చేసి ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు.ఆ క్రమంలోనే ఇపుడు దైవిక్ పాడగా,అతనికి జతగా శ్రీనిధి కూడా భావాన్ని పలకించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

మాములుగా ఫాస్ట్ అండ్ మాస్ బీట్స్ మాత్రమే ఎక్కువ ఆడియన్స్ అట్రాక్షన్ ని గ్రాబ్ చేస్తాయి.మెలోడీ అండ్ స్మూతీ సాంగ్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే అంత ఆషామాషీ కాదు.కానీ ఆవిషయంలో మాత్రం వీరిద్దరూ తమ స్పెషాలిటీ ఏంటో చూపించారు.

జూనియర్ బాలు అంటూ ఆకాశానికి ఎత్తేసిన sp శైలజ

ఇక దైవిక్ పాట విన్న అనంత్ శ్రీరామ్ పాట చాలా దైవికంగా ఉందని పొగడగా, sp శైలజ గారు అయితే జూనియర్ బాలు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఈ ప్రోమో ఇలా వచ్చిందో లేదో తమదైన కామెంట్స్ తో పొగిడేస్తున్నారు అభిమానులు.దైవిక్-శ్రీనిధిల మధ్య సింగింగ్ కెమిస్ట్రీ అదిరిపోయింది అని కొంతమంది అంటే సంగీతాభిమానులకి,ముఖ్యంగా మెలోడీ లవర్స్ కి ఇదొక మంచి ట్రీట్ అని తమ అభిప్రాయాలని తెలుపుతున్నారు.

మొత్తానికి దైవిక్, శ్రీనిధి కలిసి పాడిన ‘నీ కన్నుల నీలమై’ పెర్ఫార్మెన్స్‌ పాట ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ మరో బెస్ట్ మెలోడీగా అనడంలో సందేహంలేదు. ఇక దైవిక్ పాటల విషయానికి వస్తే ‘జాబిలి కోసం ఆకాశమల్లే’, ‘మాటరాని చిన్నదాని’, ‘ప్రేమ ప్రేమ’ మరియు ‘నీ కన్నుల నీలిమయి’ అంటూ పాడిన ఎన్నో సాంగ్స్ మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన సంగతి తెల్సిందే.

దీంతో వీడెక్కడ దొరికాడ్రా సామీ..అచ్చం బాలు గారి గొంతుని దించేస్తున్నాడుగా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు !

Tags

Related News

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

Big Stories

Advertisement
×