E-Paper
Advertisement

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!
Advertisement

Suzuki ‘REVV Light’ Hybrid: పెట్రోల్, CNG కార్లతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు కూడా మారుతి సుజుకి వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చిన్న, కాంపాక్ట్ కార్లలో ఖర్చు, బరువు రెండింటినీ అదుపులో ఉంచుతూ మెరుగైన మైలేజీ అందించే టెక్నాలజీపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్లగ్‌ ఇన్ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన రేంజ్ ఎక్స్‌ టెండర్ హైబ్రిడ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ కన్ఫార్మ్ చేసింది.

 రీవ్ లైట్ అంటే ఏంటి?   

సుజుకి ఈ కొత్త వ్యవస్థకు ‘రీవ్ లైట్’ అనే పేరు పెట్టింది. సాధారణ పెట్రోల్ కారులో ఇంజిన్ నేరుగా చక్రాలకు శక్తిని అందిస్తుంది. కానీ, సిరీస్ హైబ్రిడ్‌ లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చక్రాలను నడిపేది ఎలక్ట్రిక్ మోటార్. ఇంజిన్ మాత్రం ప్రధానంగా విద్యుత్తును ఉత్పత్తి చేసే జనరేటర్‌గా పనిచేస్తుంది. దీనికి అదనంగా బయట నుంచి ఛార్జ్ చేసుకునే అవకాశం, అవసరానికి సరిపడే బ్యాటరీని యాడ్ చేయాలని సుజుకి భావిస్తోంది. అంటే, రోజువారీ చిన్న ప్రయాణాల్లో బ్యాటరీ పవర్‌ ను ఉపయోగించుకోవచ్చు. సుదూర ప్రయాణంలో బ్యాటరీ ఛార్జ్ తగ్గితే ఇంజిన్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

పెద్ద బ్యాటరీ అవసరం లేకుండానే..  

Advertisement

ఈ టెక్నాలజీలో ప్రధాన ఉద్దేశం పెద్ద బ్యాటరీని అమర్చడం కాదు. పెద్ద బ్యాటరీ అంటే వాహనం బరువు పెరగడంతో పాటు తయారీ ఖర్చు కూడా ఎక్కువవుతుంది. చిన్న కార్లలో ఈ రెండూ కీలక అంశాలు. అందుకే సుజుకి వినియోగానికి తగినంత సామర్థ్యం ఉన్న చిన్న బ్యాటరీని ఉపయోగించే విధానాన్ని ఎంచుకుంటోంది. రోజువారీ ప్రయాణాలకు బ్యాటరీ సరిపోతుంది. లాంగ్ డ్రైవ్‌లో మాత్రం ఇంజిన్ జనరేటర్‌ గా పనిచేసి అదనపు విద్యుత్తును అందిస్తుంది. దీంతో రేంజ్ గురించి డ్రైవర్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

ఫ్రాంక్స్, బాలెనోలకు వస్తుందా?

మారుతి సుజుకి ఈ తరహా సిరీస్ హైబ్రిడ్ వ్యవస్థను చిన్న మోడళ్ల కోసం అభివృద్ధి చేస్తోంది. ఫ్రాంక్స్, బాలెనో వంటి కార్లు ఈ టెక్నాలజీకి అనువైన మోడళ్లుగా అప్పట్లో ప్రస్తావించబడ్డాయి. 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్‌ను జనరేటర్‌గా ఉపయోగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే, రీవ్ లైట్‌ లో ఇదే ఇంజిన్ ఉపయోగిస్తారా? ఏ మోడల్‌కు మొదట అందిస్తారు? అనే విషయాలను సుజుకి ఇంకా వెల్లడించలేదు.

ఖర్చు తగ్గించడంపైనే ఫోకస్

Advertisement

చిన్న కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావడంలో  ముఖ్యమైన సవాలు ఖర్చు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ లాంటి భాగాలన్నింటినీ పెద్ద స్థాయిలో అమర్చితే కారు ధర పెరిగే అవకాశం ఉంటుంది. సిరీస్ హైబ్రిడ్ లేఅవుట్ ద్వారా ఈ వ్యయాన్ని నియంత్రించాలని సుజుకి చూస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఉన్నత శ్రేణి మోడళ్లలో టయోటా నుంచి వచ్చిన సిరీస్-ప్యారలల్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అయితే చిన్న కార్ల కోసం సొంతంగా అభివృద్ధి చేస్తున్న సిరీస్ హైబ్రిడ్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. అయితే, రీవ్ లైట్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, పూర్తిగా ఎలక్ట్రిక్‌పై ప్రయాణించే రేంజ్ వంటి వివరాలను సుజుకి ఇంకా ప్రకటించలేదు. పెట్రోల్, CNGతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారుతి సుజుకి విస్తరిస్తున్న సమయంలో ‘రీవ్ లైట్’ టెక్నాలజీ చిన్న కార్లకు మరో ప్రత్యామ్నాయ పవర్‌ ట్రెయిన్‌ గా మారే అవకాశం ఉంది.

Read Also: రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

Tags

Related News

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

రైడర్లకు పండుగే పండుగ.. అక్టోబర్‌ లో 5 కొత్త బైక్‌ల ఎంట్రీ!

టాటా To హ్యుందాయ్.. అక్టోబర్‌ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!

అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ To సుజుకి.. అక్టోబర్‌లో దుమ్మురేపే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

Big Stories

Advertisement
×