VC Sajjanar: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందో బస్తుగా ఎర్పడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ఈ అత్యంత వైవంగా జరుగుతున్న వినాయక శోభ యాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఈ ఆసక్తికరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక విషయాపికి వస్తే ఎప్పుడూ డ్యూటీలో సీరియస్‌గా ఉండే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గణేష్ భక్తులు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులతో కలిసి వినాయకుడి పాటకు డ్యాన్స్ వేస్తు చిందులు వేసారు. దీంతో అక్కడివారందరి ఉత్సాహంతో సజ్జనార్‌తో అందరూ కలిసి చిందులు వేసారు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో భాగంగా ఊరేగింపులో “ఆయా షేర్” అనే పాటకు సజ్జనార్ చిందులు వేసారు. ఆయన చూట్టూ ఉన్న పోలీసులు, భక్తులు, యువత అందరూ కలిసి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చిందులేసారు.
Also read: జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి
సజ్జనార్‌తో డ్యాన్స్ వేస్తున్న క్రమంలో అక్కడున్నవారు ఆయనను తమ భుజాలపైకి ఎత్తుకుని అక్కడి జనం చేసిన హంగామా అందరినీ ఆనందింపచేసింది. సాదారనంగా ఎప్పుడూ కఠినమైన విధుల్లో బాధ్యతల్లో బిజీగా ఉండే ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఈ విధంగా చిందులేయడంతో సర్వత్రా ప్రశంసలు కురిపించారు. దీంతో సోషల్ మీడియాలో సైతం సీపీ సజ్జనార్ డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జన ప్రక్రియ ముగిసింది. నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడంతో.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. pic.twitter.com/yI20fXYGme
— BigTV APP (@BigtvApp) September 26, 2026