E-Paper
Advertisement

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!
Advertisement

Sudigali Sudheer:మెజీషియన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి కమెడియన్ గా జబర్దస్త్ కామెడీ షోలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఇక్కడ తన స్నేహితులతో కలిసి పదుల సంఖ్యలో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఇక్కడే టీం లీడర్ గా ఎదిగి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా పనిచేస్తుండగానే.. అటు సినిమాలలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, సత్తా చాటిన సుధీర్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే గోట్. (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) .

గోట్ ప్రమోషన్స్ లో సందడి చేసిన సుధీర్, దివ్యభారతి..

సుడిగాలి సుధీర్, దివ్యభారతి (Divya Bharathi) ప్రధాన పాత్రల్లో నవంబర్ 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో బ్రహ్మాజీ, నితిన్, ప్రసన్న తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేద వ్యాస్ దర్శకత్వంలో మహా తేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతంతో లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు చిత్ర బృందం ప్రత్యేకంగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగానే ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో దివ్యభారతి, సుధీర్ ఇద్దరూ సందడి చేశారు.

పెళ్లి రూమర్స్ పై సుధీర్ క్లారిటీ..

Advertisement

ఈ సందర్భంగా బిత్తిరి సత్తి సుధీర్ పెళ్లి పై ప్రశ్నించారు. ఇంటర్వ్యూలో భాగంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. “మీకు, ఒక ప్రముఖ యాంకర్ కు మధ్య ఏదో ఉందని అందరూ అంటున్నారు ? అది నిజమేనా ? లేక ఆ రూమర్స్ ని మీరు నిజం చేయబోతున్నారా? అని సత్తి ప్రశ్నించగా.. అది షోలో భాగం మాత్రమే. ప్రస్తుతం నేను సోలోగా ఉన్నాను. సింగిల్ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది.. అందుకే నేను సోలోగా మరింత సంతోషంగా ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు గత కొంతకాలంగా ప్రముఖ సీరియల్ యాక్ట్రెస్ కావ్య శ్రీ (Kavya Shree) తో కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలకి కూడా సుధీర్ చెక్ పెట్టారు. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని , తాను సోలోగా ఉన్నానని, సోలో లైఫ్ సో బెటర్ అనే రేంజ్ లో సుధీర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే సుధీర్ పెళ్లిపై వస్తున్న ఊహగానాలన్నింటికీ ఒక్క ఇంటర్వ్యూ తో క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.

also read:ఆదర్శ కుటుంబం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

ట్రైలర్ తో అంచనాలు పెంచిన టీమ్..

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. ఆ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ ద్వారా అర్థమైన స్టోరీ ఏంటంటే.. ఒక అమ్మాయి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో గుండాలకు 10 లక్షలు ఇస్తాను.. తనను ఎత్తుకెళ్లమని చెబుతుంది. ఇక దాంతో బ్రహ్మాజీ ఈ డీల్ కుదుర్చుకుంటాడు. ఇక ఐదు లక్షల కోసం కక్కుర్తి పడి సుధీర్ ఆమెను ఎత్తుకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆమె పెట్టిన కష్టాలు కామెడీగా ఆకట్టుకున్నాయి. డ్రామాగా కిడ్నాప్ చేయాలనుకుని నిర్ణయించుకున్నా.. ఆ అమ్మాయి వాళ్లకు ఊహించని జలక్ ఇస్తూ ఉంటుంది. ఇక మొత్తానికైతే సరదాగా కామెడీతో ఆకట్టుకున్న ఈ సినిమాతో సుధీర్ ఖచ్చితంగా హిట్టు కొడతాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరి చూద్దాం సినిమా సుధీర్ కి ఏ విధంగా కలిసి వస్తుందో..

Related News

సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఇదేనా?

వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Big Stories

Advertisement
×