E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!
Advertisement

CID Director B.P.Singh:ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సినీ పరిశ్రమను ఇటు బుల్లితెర ఇండస్ట్రీని దుఃఖంలో ముంచేస్తున్నాయి. గత పది రోజులుగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులను ఆందోళనలకు గురి చేస్తుండగా.. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. సీఐడీ డైరెక్టర్ మృతి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

సీఐడీ డైరెక్టర్ మృతి..

సీఐడీ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ బ్రిజేంద్రపాల్ సింగ్ కన్నుమూశారు. అక్టోబర్ 27న ముంబైలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటుకు గురవడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను శాంతా క్రూజ్ లోని సూర్య హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన వయసు 77 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈయన మరణంతో పలువురు బాలీవుడ్, సౌత్ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అంతేకాదు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

సీఐడీ సిరీస్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు..

Advertisement

1973లో దూరదర్శన్ లో కెమెరామెన్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు సీఐడీ టీవీ సిరీస్ ను తెరకెక్కించి ,ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈయన తన కెరియర్లో 12 సిరీస్ లు, రెండు సినిమాలను రూపొందించారు.

బీ.పీ. సింగ్ అంత్యక్రియలపై చిత్ర నిర్మాత అశోక్ కామెంట్స్..

ప్రముఖ చిత్ర నిర్మాత అశోక్ పాండిట్ బ్రిజేంద్రపాల్ మరణాన్ని ధ్రువీకరిస్తూ.. అక్టోబర్ 27 మంగళవారం ఉదయం గుండెపోటుతో బాధపడుతూ బీ.పీ.సింగ్ మరణించారు. భారత టెలివిజన్ పరిశ్రమలో తన అద్భుతమైన దర్శకత్వ విలువలతో ముద్ర వేసుకొని, అద్భుతమైన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన దర్శకత్వం వహించిన సీఐడీ, ఆహట్ వంటి క్రైమ్ షోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బీపీ సింగ్ అంత్యక్రియలు అక్టోబర్ 28 బుధవారం జరిగేలా ఏర్పాటు చేస్తున్నాము. అంటూ పేర్కొన్నారు.

సంతాపం వ్యక్తం చేసిన సీఐడీ నటుడు దయానంద శెట్టి..

Advertisement

సీఐడీలో దయ పాత్ర పోషించిన దయానంద శెట్టి బీపీ సింగ్ మరణం గురించి మాట్లాడుతూ..” బీ.పీ.సింగ్ గారికి కంటెంట్ తయారు చేయడం తప్ప మరో ఇతర జీవితం లేదు. ఆయన తన పనికి ఎప్పుడూ అంకితభావంతో ఉన్నారు. ఆయనకు ఎన్నో అభిరుచులు ఉన్నాయి. అత్యుత్తమ కెమెరామెన్లలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఇక ఈరోజు ఉదయం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను” అంటూ తెలిపారు.

also read: గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం..

సిఐడి క్రైమ్ సిరీస్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “ది ఇన్హెరిటెన్స్/CID 111” అనే ప్రత్యేక ఎపిసోడ్ ను గంట 51 నిమిషాల పాటు ఒకే షాట్లో చిత్రీకరించారు. అయితే పొడవైన నిరంతర షాట్ గా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో దీనికి స్థానం కలిగింది. పైగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా కూడా పనిచేశారు.

Related News

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

‘సరిగమప’ కంటెస్టెంట్స్ కి అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్!

బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

Big Stories

Advertisement
×