E-Paper
Advertisement

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్స్ ను మూడు లెవెల్స్ గా విడగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 5 మంది గోట్స్ గా మారి, 2 వారాల ఇమ్యూనిటీని దక్కించుకున్నారు. ఇకపోతే ఎనిమిదవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కాస్త చప్పగా సాగినప్పటికీ.. ముఖేష్ (Mukhesh) ప్రవర్తన మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు చిన్నచితక గొడవలతో సరిపెట్టుకున్న ఈయన.. గోట్ గా మారిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా దేబ్జానినీ మరింత హీనంగా చూస్తూ.. చేస్తున్న కామెంట్లు కూడా వైరల్ గా మారుతున్నాయి.

నామినేషన్స్ లో జడ్జెస్ గా గోట్స్..

ఇకపోతే 51వ రోజుకు సంబంధించి మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో మిగిలిన నలుగురి గోట్స్ మాట ముఖేష్ వినకుండా, వాళ్లను పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటే.. అమన్ కూడా తనదైన శైలిలో వాదించే ప్రయత్నం చేశారు. ఇక వీరి మధ్య గొడవ చూస్తుంటే.. అసలు వీళ్ళ మధ్య ఐక్యత లేదు.. వీరిని జడ్జెస్ గా పెట్టడం ఏంటి? అంటూ బిగ్ బాస్ పై మండిపడుతున్నారు ఆడియన్స్. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

జడ్జెస్ మధ్య ఐక్యత లేదా?

Advertisement

“రెండవ దశ నామినేషన్ లో గోట్ సభ్యులు జడ్జెస్ గా ఉంటారు. ఎల్లో లెవెల్ లో ఉన్న సభ్యుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఏ నామినేషన్ ను ఆమోదించాలి అనేది ఈ జడ్జెస్ మాత్రమే తీసుకుంటారు అంటూ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇక యెల్లో లెవెల్ లో ఉన్న సభ్యుల్లో నామినేషన్ పొందే హక్కును సొంతం చేసుకున్నారు నరేష్. అందులో తన మొదటి నామినేషన్ వర్షిణి అని చెబుతూ.. నీకు అవకాశం కల్పించినా సరే నువ్వు ఆడలేకపోయావ్ అనేది నా బాధ అంటూ నరేష్ చెప్పాడు. ఇక తర్వాత శివ మాట్లాడుతూ త్రిగుణ్ నా ఫ్రెండ్. నేను అతనితో మాత్రమే మాట్లాడతాను. నేనెవరితోనూ మాట్లాడదల్చుకోలేదు అని చెప్పినా కూడా.. అని శివ మాట్లాడుతుండగానే.. మరి నీ మాటల అర్థం ఏంటి అంటూ వర్షిని ప్రశ్నించింది. నేను లోపలికి రావచ్చా? నేను మీతో మాట్లాడవచ్చా? అని అడగాల్సిన బేసిక్ సెన్స్ కూడా మీకు లేదు అంటూ శివపై మండిపడింది వర్షిణి..

దెబ్జానీనీ లెక్కచేయని ముఖేష్..

ఇక శివ వంశీ ని నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ లో ముఖేష్ వంశీ గారిని నామినేట్ చేశారు అని చెబుతుండగానే.. గోట్ గా ఉన్న ముఖేష్ మాట్లాడుతూ.. “ఇక్కడ కంపారిజన్ చేసి మాట్లాడొద్దు “అంటూ వేలు చూపించి మరీ శివతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో వారితోనే మాట్లాడు అంటూ చెబుతుండగానే.. మధ్యలో మెయిన్ జడ్జిగా కూర్చున్న అమన్ గొడవ పడకండి అంటూ చెప్పాడు. ఇక ముగ్గురు జడ్జెస్ లో ఒకరైన దేబ్జానీ మధ్యలో మాట్లాడుతుండగా.. నేను మెయిన్ జడ్జితో మాట్లాడుతున్నాను. నువ్వు సైడ్ లో కూర్చున్నావు సైడ్ లో ఉండు అంటూ ఆమెతో వాదించాడు. దీంతో ఫైర్ అయిన దేబ్జానీ ఇది పర్సనాలిటీ షో అని చెబుతుండగా.. మళ్లీ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇక మధ్యలో శివ మాట్లాడుతుండగా.. నువ్వు ఆగవయ్య ముందు అంటూ శివ పై కూడా ఫైర్ అయ్యాడు ముఖేష్.

Advertisement

also read:తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

ముఖేష్ భయపడుతున్నారా?

దీంతో శివ మాట్లాడుతూ .. మాట్లాడితే ఇక్కడ నిజాలు బయటకు వస్తాయేమో అని ఆయనకు భయమేమో అంటూ కామెంట్ చేశారు. త్రిగుణ్ మాట్లాడుతూ.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి అంటూ శివా కి అవకాశం ఇచ్చారు. దాంతో మళ్లీ ముందుకొచ్చిన ముఖేష్ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. మీలో ఇక్కడ ఎవరు ఎవరికి చెప్పకుండా మీకేం మాట్లాడాలనిపిస్తుందో అది మాట్లాడండి అంటుండగా.. త్రిగుణ్ ఆపే ప్రయత్నం చేశారు. కానీ ముఖేష్ మాత్రం ఆగవయ్య అంటూ త్రిగుణ్ ను అడ్డుకున్నారు. “ఆపేవాడికి జ్ఞానం ఉంది ఆగేవాడికి జ్ఞానం ఉంది. ఆగని వాడికి జ్ఞానం లేదంటే ఏం చేస్తాం” అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే తాజా ప్రోమో కాస్తా వైరల్ గా మారింది.

 

Related News

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

‘సరిగమప’ కంటెస్టెంట్స్ కి అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్!

బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

Big Stories

Advertisement
×