Ariyana Glory: ప్రముఖ యాంకర్ గా, ఆర్జీవీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా (Ariyana Glory ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా సందడి చేసిన ఈ చిన్నది.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తూ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతోంది. అలాంటి ఈమెపై తాజాగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్(Baba Bhaskar) ఫైర్ అవడం వైరల్ గా మారింది. “మా పనే అది.. నువ్వు చెప్పక్కర్లేదు” అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. వేణు వుడుగుల సమర్పణలో శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న చంద్రయాన్ అనే తెలుగు అడ్వెంచర్ కామెడీ చిత్రం నవంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించి “చంద్రయాన్ రాకెట్ రివీల్ ఈవెంట్” పేరిట ఒక ఈవెంట్ నిర్వహించారు. అందులో బాబా భాస్కర్ సందడి చేయగా.. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది అరియానా. హోస్ట్ గా వ్యవహరించిన అరియానా బాబా భాస్కర్ తో మాట్లాడుతూ.. “ఒక్క స్టెప్పు మీరు అలా మాతో పాటు వేస్తే.. మేము చాలా అదృష్టంగా, హ్యాపీగా ఫీల్ అవుతాము మాస్టర్..డాన్స్ వేయాలి లేదా ఒక్క స్టెప్ వేయమని చెప్పండి ప్రేక్షకులు.. మీరు చెప్పండి ” అంటూ కాస్త ఓవర్ చేసి మాట్లాడినట్లు అనిపించింది.
ఇక దీనికి బాబా భాస్కర్ మాట్లాడుతూ.. నేను చేస్తాను.. అంతా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు.. మా పనే అది కదా.. ఏంటిది.. మీరు ఒక స్టెప్ వెయ్యాలి అని ఓవరాక్షన్ చేస్తోంది” అంటూ కాస్త అరియానాను ఇమిటేట్ చేసి మరీ ఫన్నీ గా చూపించారు. మొత్తానికైతే అరియానా ఓవర్ యాక్టింగ్ చేయడం , బాబా భాస్కర్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం వైరల్గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
చంద్రయాన్ సినిమా విషయానికి వస్తే.. ప్రవీణ్ మొలక సింబ స్క్రీన్ స్టోరీస్ పై నిర్మిస్తున్న ఈ అడ్వెంచర్ కామెడీ చిత్రం చంద్రయాన్ నవంబర్ 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇందులో శివకుమార్ ధీ కొండ, స్వప్న ప్రియదర్శిని, శివ రవితేజ, వంశీధర్, లోకేష్, బలం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
also read: అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిగుణ్!
అరియానా విషయానికి వస్తే.. ఆర్జీవి ఇంటర్వ్యూతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ తర్వాత ఊహించని క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతో కష్టపడ్డానని కూడా చెప్పుకొచ్చింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ..” మా అమ్మ నాన్న నాకు అర్చనా అని పేరు పెట్టారు. కానీ కష్టాలు ఎక్కువ అవడంతో నేనే పేరు మార్చుకున్నాను. ఇక మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను ఒకరోజు టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెను అనే ప్రకటన వచ్చింది. అది చూసి ఆడిషన్స్ కి వెళ్ళాను అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యి ఇప్పుడు యాంకర్ అయ్యాను. డబ్బుల కోసం రకరకాల జాబులు కూడా చేశాను . లైన్ లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. ఇక డబ్బులు సరిపోక ఒకేసారి ఐదు ఆరు జాబులు చేసిన రోజులు కూడా ఉన్నాయి.. ఇక అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నాను “అంటూ ఆమె తెలిపింది.