E-Paper
Advertisement

దీప్తి సునైన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. స్టెప్పులు అదుర్స్!వీడియో వైరల్

దీప్తి సునైన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. స్టెప్పులు అదుర్స్!వీడియో వైరల్
Advertisement

Deepthi Sunaina Dance Video:దీప్తి సునయన ..ఇప్పుడంటే కాస్త స్పీడ్ తగ్గించింది కానీ ఒకప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో ఎలా సందడి చేసిందో చెప్పక్కర్లేదు .ఇక అసలు విషయానికొస్తే తాజాగా ”ఓరోరియోగి నన్ను కొరికేరో” అంటూ యోగి సినిమాలోని మాస్ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తెగసందడి చేసింది .ముఖ్యంగా ఈ సాంగ్ లో దీప్తి సునైనా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, చేసిన బాడీ మూమెంట్స్ హైలెట్ అని చెప్పాలి.

దీప్తి సునైన విషయానికి వస్తే

Advertisement

ఇక దీప్తి సునైన విషయానికి వస్తే హైదరాబాద్ లోని  స్టెవెన్స్ అన్సాస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ భామ మోడలింగ్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెల్సిందే,ముఖ్యంగా ఈమె నటించిన సీత ఐ యామ్ నాట్ వర్జిన్ అనే షార్ట్ ఫిల్మ్‌ అప్పట్లో తెగ వైరల్ అయింది కూడా .

ఇక రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే.. రంగమ్మా, మంగమ్మా కవర్ సాంగ్స్ తో ఆడియన్స్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  ముఖ్యంగా ఈ భామ అందానికి స్టెప్పులకు యూత్ ఫిదా అయ్యారనడంలో ఆశ్చర్యం లేదు !

Advertisement

షణ్ముఖ్ జస్వంత్ తో ఈ భామ ప్రేమాయణం

ఇక షణ్ముఖ్ జస్వంత్ తో ఈ భామ ప్రేమాయణం నడిపించిందంటూ అప్పట్లో సోషల్ మీడియా లో వార్తలు కొట్టాయి కూడా.ఇక వీరిద్దరూ కలిసి చేసిన కవర్ సాంగ్స్ మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం,క్రమంగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఇక వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారని ,త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా ఊదరగొట్టేసింది కూడా.

ప్రేమాయణానికి బ్రేకప్

ఇక వీరిద్దరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో షణ్ముఖ్ జస్వంత్ సిరి హనుమంతుతో చనువుగా ఉండటంవల్లే దీప్తి సునయనతో ప్రేమాయణానికి బ్రేకప్ అయిందన్న టాక్ కూడా వినిపించింది .అయితే ఈ విషయంపై వీరిద్దరిలో ఎవరు అఫీషియల్ గా మాట్లాడే పోవడంతో దీన్ని రూమర్ గాని పరిగణించాల్సిన పరిస్థితి.

ఇక షణ్ముఖ్ జస్వంత్ విషయానికి వస్తే యూట్యూబ్ లో ఇతను చేసిన డాన్స్ వీడియోలు , వెబ్ సిరీస్ లు కి యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.ఈ క్రమంలోనే సూర్య ,సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ కూడా మంచి పేరుని తీసుకొచ్చాయి .

ఈ భామ త్వరలో అయినా పెళ్లి పీటలెక్కుతుందో లేదో

ఇక ఫిబ్రవరి 25, 2026 న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ జూన్ 22, 2026 న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ చెపీసిన దీప్తి సునయన ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏమైనా ఈ భామ త్వరలో అయినా పెళ్లి పీటలెక్కుతుందో లేదో!

https://x.com/Madhavi219/status/2109209802769678586/video/

Tags

Related News

ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా… అపూర్వ పై శివాజీ ఫైర్!

పవన్ తో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!

ఒక్కో ఈవెంట్‌కు లక్షల్లో పారితోషికం.. స్టార్ యాంకర్ల రేంజే వేరు!

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

Big Stories

Advertisement
×