Sudigali Sudheer: ఒకప్పుడు మెజీషియన్ గా కెరియర్ మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రముఖ కమెడియన్ వేణు (Venu ) సహాయంతో జబర్దస్త్ (Jabardast ) కామెడీ షోలోకి అడుగు పెట్టారు. అక్కడ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసి ఆ తర్వాత కమెడియన్ గా సత్తా చాటారు. అతి తక్కువ సమయంలో టీం లీడర్ గా ఎదిగి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad), గెటప్ శ్రీను (Getup Srinu) లతో పదుల సంఖ్యలో షో లు చేసి, తమకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇకపోతే సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ ద్వారా వచ్చిన ఇమేజ్ అటు వెండితెరపై కూడా బాగా పనిచేసింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా కూడా మారారు. అంతేకాదు పలు చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కూడా.
సుధీర్ పెళ్లి పై రోజుకో వార్త..
అయితే ఇక్కడ ఆయన సినిమాలు అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై అడుగులు వేశారు సుధీర్. ఇప్పుడు ‘డ్రామా జూనియర్స్’ షో తో పాటు ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే షోకి కూడా హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నిత్యం సినిమాలు, షోలు అంటూ కెరీయర్ని కొనసాగిస్తున్న సుధీర్.. పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇప్పటికే ఆయన తమ్ముడికి కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు. అయితే సుధీర్ మాత్రం ఇంకా వివాహం చేసుకోక పోవడంపై రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో జబర్దస్త్ లో కమెడియన్ గా చేసేటప్పుడు యాంకర్ రష్మి (Anchor Rashmi Gautam) తో ఈయన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విపరీతంగా వర్క్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగా ఏదో ఉందని అటు ఆడియన్స్ కూడా అనుకున్నారు. అంతేకాదు వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది .ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.. కానీ ఇదే విషయంపై అడిగితే తాము స్నేహితులమని అలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
సుధీర్ పెళ్లి పై స్పందించిన ధనరాజ్ భార్య..
దీంతో సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా ధనరాజ్ భార్య సుధీర్ పెళ్లి పై స్పందించింది. సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం పై ధనరాజ్ భార్య శిరీష మాట్లాడుతూ.. “సుధీర్ కి పెళ్లి పైన ఆసక్తి లేదు. అతడు ఒకే చోట స్థిరపడాలని అనుకోవడం లేదు. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటే ఒకే దగ్గర స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం సుధీర్ కి ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అంటే బాధ్యత అని భావించే సుధీర్ కి ప్రస్తుతం పెళ్లి పైన ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం సుదీర్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇక ఆయన నటిస్తున్న “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” మూవీ కూడా త్వరలో విడుదల కాబోతోంది.
also read:Genelia D’Souza: తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డ జెనీలియా.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..?