Kadapa Crime: భారతదేశపు చట్టాల్లో చిన్నారుల రక్షణ కోసం పలు నిబంధనలు ఉన్నా, వాటిని ఉల్లంఘించే ఘటనలు ఇంకా మన సమాజంలో జరుగుతుండటమే బాధాకరం. తాజాగా ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకున్న దారుణం దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరిని కలిచివేసింది.
దారుణం ఎలా చోటుచేసుకుంది?
కడప జిల్లా మైలవరం మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో మూడేళ్ల చిన్నారి పెళ్లికి తల్లిదండ్రులతో వెళ్లింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిన్నారికి అరటిపండు ఆశ చూపించాడు. గ్రామానికి కొంచెం దూరంలోని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అమానుషంగా లైంగిక దాడికి పాల్పడి, అనంతరం బాలికను హత్య చేసి ముళ్ళపొదల్లో పడేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వెంటనే పోలీసులకు సమాచారం
చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు గాలింపు చేపట్టి చిన్నారి మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడి అరెస్ట్? ప్రజల్లో ఆగ్రహం
ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతడు స్థానికుడు అయినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర ఉద్విగ్నతను కలిగించింది. బంధువులు, గ్రామస్థులు నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శనలు చేశారు.
పోక్సో చట్టం కింద కేసు
పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు నుంచి ఉరి వరకు శిక్ష విధించే అవకాశం ఉంది.
చిన్నారి కుటుంబానికి మద్దతుగా నిలిచిన సంఘాలు
ఈ ఘటనపై పలు బాలల హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్పందించాయి. తక్షణం న్యాయం చేయాలని, కేసు వేగంగా విచారించి నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతున్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయ సహాయం, ఆర్థిక పరంగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Covid 19 in Telangana: తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదు.. ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే!
సామాజిక మాధ్యమాల్లో ఆవేదన
ఈ అమానుష ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి బతకలేదేమో కానీ, మనుషులలో మానవత్వం కూడా చచ్చిపోయిందనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నిందితుడికి వేగంగా శిక్ష పడాలని దేశవ్యాప్తంగా ప్రజలు గళమెత్తుతున్నారు. కంబాలదిన్నెలో జరిగిన ఈ దారుణం, మన సమాజానికి మిగిలే మచ్చగా మారకూడదు. ఒక పసి ప్రాణం మృతి చెందింది. కానీ నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించి, చట్టం అమాయకుల రక్షణలో నిలబడుతుందని చూపాలని ప్రజలు అంటున్నారు.
కడపలో మూడేళ్ల బాలికపై అత్యాచారం
కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో దారుణం. పెళ్లికి వెళ్లిన మూడేళ్ల బాలికపై స్థానిక వ్యక్తి అత్యాచారం చేసి, చంపి ముళ్ళ పొదల్లో పారేశాడు. నిందితుడిని ఉరితీయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. pic.twitter.com/RBOz0atIzc
— ChotaNews App (@ChotaNewsApp) May 23, 2025