Film Chamber: టాలీవుడ్ లో సినీ థియేటర్ ఎగ్జిబిటర్లు, జూన్ 1న థియేటర్లను మూసివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య కీలక సమావేశం మే 24న హైదరాబాదులో జరగనుంది. ఈ సమావేశం ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కరించడానికి సినీ పరిశ్రమలో రెంట్ విధానాన్ని రద్దుచేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ పై చర్చించడానికి సమావేసం ఏర్పాటు కానుంది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే, అద్దె విధానాన్ని రద్దు చేయాలని ఎగ్జిబిటర్లు కోరడంతో, నిర్మాతలు మరోసారి చర్చకు ఆహ్వానించారు. దీనిపై పూర్తి వివరాలు చూద్దాం..
ప్రొడ్యూసర్స్ తో మరో సారి మీటింగ్..
తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలు అద్దె విధానం రద్దు చేయడం, షేరింగ్ విధానాన్ని అమలు చేయడం, థియేటర్ల బంద్ నిర్ణయంపై చర్చలు జరగనున్నాయి. తాజాగా ఈనెల 24న ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ తో జాయింట్ మీటింగ్ ను ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేయనున్నారు. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వారి నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ ప్రకటించనుంది. సమ్మె ప్రస్తుతానికి పక్కన పెట్టి, థియేటర్లు మూసివేయకుండా చూసేలా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల తో మాట్లాడనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన సమావేశంలో, ప్రస్తుతానికి సమ్మె జరగకుండా, సినిమాలు ధియేటర్లో రన్ చేస్తూనే ఈ వివాదంపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈనెల 24న మీటింగ్ జరగనుంది. ఏది ఏమైనా ఈసారి మీటింగ్ తో చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి.
వారి సమస్య ..అదేనా
ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మొదటిది అద్దె విధానం. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె విధానంలో థియేటర్లు సినిమా రిలీజ్ కు కొంత రెంటును చెల్లించాల్సి ఉంటుంది. ఇది సినిమా సక్సెస్ కాకపోయినా చెల్లించాలి. దీనితో వారికి ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ విధానాన్ని రద్దు చేసి మల్టీప్లెక్స్ లో లాగా, షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. కలెక్షన్స్ ఆధారంగా లాభాలను పంచుకోవడంతో కొంత ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చని వారి అభిప్రాయం.ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు మొదటి వారంలోనే కలెక్షన్స్ తగ్గడం మనం చూస్తున్నాం. దీనివల్ల థియేటర్లో నష్టపోతున్నాయి. ఈ సమస్య పరిష్కరించుకోవడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో సమన్వయం అవసరమని ఎగ్జిక్యూటర్లు భావిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే జూన్ 1 నుండి ధియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. రేపు జరగబోయే చర్చల తర్వాత వారి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ల మధ్య సమస్యలపై చర్చలు జరిగినప్పటికీ,అవి అంత పురోగతిని సాధించలేదు. ఆ మీటింగ్ లో 40 మంది డిస్ట్రిబ్యూటర్లు, పలువురు నిర్మాతలు దిల్ రాజు,సురేష్ బాబు,మైత్రి రవి,నాగవంశీ, తదితరులు హాజరైనప్పటికీ థియేటర్ల బంద్ నిర్ణయంపై స్పష్టమైన ఒప్పందం కుదరలేదు.ఈ నేపథ్యంలోనే మే 24న సమావేశం కీలకంగా మారనుంది.
Hari Hara Veeramullu : DCM నిబద్ధత… వీరమల్లులో వాటిని దగ్గరుండి డిలీట్ చేయించారు