BigTV English

Genelia D’Souza: తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డ జెనీలియా.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..?

Genelia D’Souza: తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డ జెనీలియా.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..?

Genelia D’Souza: ప్రముఖ స్టార్ హీరోయిన్ జెనీలియా (Genelia D’Souza) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా వివాహం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జెనీలియా తన కుమారులతో కలిసి ఎప్పటిలాగే మరొకసారి బయటకు వెళ్లారు. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా సడన్గా తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న జెనీలియా..

ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. జెనీలియా ఇద్దరు కొడుకులు కార్లో కూర్చొని ఉన్నారు. అందులో జెనీలియా ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే డ్రైవర్ తొందరపాటు కారణంగా జెనీలియా పూర్తిగా కూర్చోక ముందే డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కారు గనుక కొంచెం వేగంగా వెళ్లి ఉంటే ఆమె కచ్చితంగా కింద పడిపోయి వుండేది. దాంతో ప్రమాదానికి గురైయ్యేది. వెంటనే అలర్ట్ అయిన జెనీలియా ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ జాగ్రత్తగా ఉండండి మేడం అంటూ ఆమెకు సలహా ఇస్తూ.. డ్రైవర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు మనుషులు కారులో ఎక్కారో లేదో కూడా గమనించుకోరా.. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. అంటూ ఆయనపై విమర్శలు గుర్తిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.


జెనీలియా కెరియర్..

ఇక జెనీలియా విషయానికి వస్తే.. ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈమె పేరుకే ముంబై అమ్మాయి అయినా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది జెనీలియా. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ (Rithesh Deshmukh) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.. హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలలో కామెడీ పాత్రలు మాత్రమే చేసింది. ఇక 2020లో వచ్చిన ‘ఇట్స్ మై లైఫ్’ అనే హిందీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె.. 2022లో మజిలీ సినిమా రీమేక్ వేద్ లో నటించి ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాకి రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించడం గమనార్హం. అంతేకాదు ఇదే ఆయన మొదటి డైరెక్టోరియల్ డెబ్యూ కూడా. ఒకవైపు జెనీలియా సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటుంది. అంతేకాదు కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ అటు భర్త, ఇటు పిల్లలకు అన్నివేళలా సపోర్టుగా నిలుస్తోంది జెనీలియా. అందులో భాగంగానే సరదాగా పిల్లల కోసం బయటికి వెళ్లే ఈమె.. ఇప్పుడు సడన్గా ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

also read:Jabardast Edukondalu: కామెడీ షోతో కోట్లు సంపాదిస్తారా.. ఫ్యాక్ట్ చెప్పిన ఏడుకొండలు..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×