BigTV English

Naga Chaitanya: శోభిత గురించి సమంతకు చైతూ ముందే చెప్పాడా.. వీడియో వైరల్!

Naga Chaitanya: శోభిత గురించి సమంతకు చైతూ ముందే చెప్పాడా.. వీడియో వైరల్!

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Nagachaitanya)ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన తన తదుపరి ప్రాజెక్టు పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య టైర్ 2 హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈయన వృత్తిపరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… నాగచైతన్య ఏం మాయ చేసావే (Yem Maaya Chesave)సినిమా ద్వారా సమంతతో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.


శోభితతో వివాహం…

ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని, దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన మూడు సంవత్సరాలకి వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. సమంత నుంచి విడాకులు(Divorce) తీసుకున్న నాగచైతన్య తిరిగి మరొక నటి శోభిత (Sobhita)ప్రేమలో పడటం ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నప్పటికీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. అయితే ఈమె డైరెక్టర్ రాజ్ నిడుమోరితో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు.


ఏం మాయ చేసావే…

ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. అయితే తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో భాగంగా నాగచైతన్య తన జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది అంటూ సమంతకు స్వయంగా చెబుతున్నారు. అయితే ఇది నిజమైన వీడియో కాదండోయ్.. వీరిద్దరూ కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో నాగచైతన్య సమంతతో మాట్లాడుతూ తన జీవితంలోకి మరొక అమ్మాయి వచ్చిందని తెలియజేశారు.

?igsh=YzkxZnowMzduMzM0

ఏ మాయ చేసావే సినిమాలో సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కొద్ది రోజులకు కలుస్తారు ఆ సమయంలో నాగచైతన్య చెబుతూ…”అవును జెస్సి నా లైఫ్ లో వేరే అమ్మాయి ఉందని చెప్పగానే సమంత ఎలా ఉంటుంది తను అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో నాగచైతన్య ఆ అమ్మాయి పరిచయం గురించి, తన మంచితనం గురించి వివరిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో కొంతమంది అభిమానులు సమంతకు శోభిత గురించి నాగచైతన్య ముందే చెప్పారు కానీ సమంత గమనించలేదు అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఈ డైలాగ్ చెప్పే సమయంలో తధాస్తు దేవతలు తదాస్తు అన్నట్టు ఉన్నారు అందుకే సమంత కాకుండా నాగచైతన్య జీవితంలోకి శోభిత వచ్చింది అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక ఏం మాయ చేసావే సినిమా జూలై 18వ తేదీ తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Actress Anjali: ఘనంగా నటి సీమంతపు వేడుక.. ఆలస్యంగా షేర్ చేసిన అంజలి!

Related News

Dharma Mahesh: మౌనం వీడిన హీరో ధర్మ మహేష్‌.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్‌..!

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Idli Kadai : మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు? పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్స్

Chandoo Mondeti : దారుణంగా అప్పులు చేసిన డైరెక్టర్, అప్పుల వాళ్ళని క్యూలో నిల్చబెట్టి క్లియర్ చేసిన ఫాదర్

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Balakrishna: బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

Tollywood: మడ్డీ ఫేమ్ ప్రగభల్ చిత్రం ‘జాకీ’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎవరు టచ్ చేయని పాయింట్ తో..

Sujeeth: పవన్ కంటే ముందు ఆ మెగా హీరోని లైన్ లో పెట్టిన సుజీత్…కథ కూడా సిద్ధం కానీ?

Big Stories

×