Divi Vadthya:దివి వాధ్యా…బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇపుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.అవును..తాజాగా జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో ఇపుడు ఒక్కసారిగా నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపొయింది.
ఇష్టమైన వ్యక్తితో కలిసి స్ట్రెచింగ్
జిమ్‌లో వర్కౌట్ చేసిన తర్వాత తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దివి.. తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి స్ట్రెచింగ్, చెమటలు పట్టేలా వర్కౌట్స్ చేస్తూ గడుపుతున్నాననే అర్థం వచ్చేలా క్యాప్షన్ వదిలింది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ సినిమా అప్‌డేట్స్, ఫోటోషూట్స్, వెకేషన్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారన్న సంగతి తెల్సిందే. అయితే దివి మాత్రం తన పర్సనల్ ఇంట్రెస్ట్స్ , ఫిట్‌నెస్‌కు సంబంధించిన మూమెంట్స్ ..ఇలా అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తాజాగా ఆమె జిమ్ దుస్తుల్లో కనిపిస్తూ ఫోటో పోస్ట్ చేయడంతో ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.
కాన్ఫిడెన్స్ తో పాటు ఫిట్ నెస్ కూడా ముఖ్యమే
నిజానికి సిని ఇండస్ట్రీలో రాణించాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు ఫిట్ నెస్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా ఈ రోజుల్లో హీరోయిన్లు తమ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు కూడా . రెగ్యులర్ వర్కౌట్స్, స్ట్రెచింగ్, సరైన డైట్ వారి డైలీ లైఫ్ లో రొటీన్ అయిపోయాయి. ఇపుడు దివి షేర్ చేసిన ఈ ఫోటో కూడా ఆమె ఫిట్‌నెస్ రొటీన్‌పై ఎంత ఆసక్తిని చూపిస్తుందో అర్థం అవుతుంది.
బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింతగా ఫేమ్
ఇక దివి కెరీర్ విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన దివి వాధ్యా, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘క్యాబ్ స్టోరీస్’, ‘గాడ్‌ఫాదర్’, ‘గిన్నా’, ‘రుద్రంగి’ వంటి సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఆమె కనిపించడం విశేషం.ఇక ఈ భామ బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింతగా పరిచయమైందని చెప్పక్కర్లేదు.
ఎలాంటి సినిమా అప్‌డేట్స్‌తో ముందుకు వస్తుందో
మొత్తానికి ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్న దివి, తాజాగా జిమ్ వీడియో లతో రచ్చ చేస్తుంది.చూడాలి దివి వాధ్యా రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమా అప్‌డేట్స్‌తో ముందుకు వస్తుందో