E-Paper
Advertisement

4వ స్థానంలో దూబే క్లిక్ అయింటే, 300 కొట్టేవాళ్లం..బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై గంభీర్ సంచ‌ల‌నం !

4వ స్థానంలో దూబే క్లిక్ అయింటే, 300 కొట్టేవాళ్లం..బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై గంభీర్ సంచ‌ల‌నం !
Advertisement

Gambhir On Team India Batting Order: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రాంచీ వేదికగా రెండో టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 250 పరుగులు చేసినప్పటికీ కూడా టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. దీంతో వెస్టిండీస్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శివమ్ దూబే ప్రదర్శన పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే అతడిని నాలుగో వికెట్ కు పంపడంపై కూడా మండిపడుతున్నారు.

శివమ్ దూబే బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఓపెనర్లు మాత్రమే పర్మినెంట్ అని… మిగతా బ్యాటర్లందరూ తాను ఎప్పుడు పంపిస్తే అప్పుడే బ్యాటింగ్ చేయాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్ కూడా 9వ వికెట్ కు దిగమంటే దిగాల్సిందేనని స్పష్టం చేశారు. జట్టుకు అవసరం ఉన్నప్పుడు తాను ఎలాగైనా ఆటగాలను వాడుకుంటానని కుండ బద్దలు కొట్టి చెప్పారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

శివమ్ దూబే బ్యాటింగ్ ఆర్డర్ మార్చింది నేనే.. ఇందులో తప్పేంటి?

Advertisement

వెస్టిండీస్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా శివమ్ దూబేను తానే నాలుగో వికెట్ కు పంపానని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. స్పిన్ బౌలర్లకు మైదానం అనుకూలించిన నేపథ్యంలో శివమ్ దూబేను పంపానని వివరించారు. అప్పటికే సంజు శాంస‌న్ భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. అతడికి ఒక లెఫ్టాండర్ అయితే బాగుంటుందని తాను ఆలోచించానని స్పష్టం చేశారు. అయితే శివమ్ దూబే ఏడు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడని.. కాస్త క్లిక్ అయితే మ్యాచ్ మరోలాగా ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగవ వికెట్ కు వెళ్లిన శివమ్ దూబే టచ్ లోకి వస్తే 300 అయినా కొట్టే వాళ్ళమంటూ బాంబు పేల్చారు. సన్రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టే కాదు టీమిండియాతో కూడా 300 తాను కొట్టిస్తానని సంచలన ప్రకటన చేశారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

9వ వికెట్ కు కూడా శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాల్సిందే

Advertisement

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటానని గౌతమ్ గంభీర్ వెల్లడించారు. జట్టుకు అవసరం అనుకుంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను 9వ వికెట్ కు పంపిస్తానని సంచలన ప్రకటన చేశారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పని చేశానని గుర్తు చేశారు. ఓవరాల్ గా టీమిండియా గెలవడం కోసమే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

గంభీర్‌ను తిడతారు కానీ, అతడే లేకపోతే టీమిండియా ప్లేయర్లు అడుక్కుతినేవారు ?

టీమిండియా బతికి బయట పడాలంటే మా ముస్లిం బౌలర్లనే దింపాలి !

టీమిండియాపై షాయ్ హోప్ ఊచకోత..ట్రావిస్ హెడ్‌కు కొత్త టెన్షన్

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

Big Stories

Advertisement
×