BigTV English

Tollywood Heros: స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు.. ఏ హీరో ఏ సినిమా అంటే..?

Tollywood Heros: స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు.. ఏ హీరో ఏ సినిమా అంటే..?

Tollywood Heros: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాని ఓకే చేయలేకపోవచ్చు. అందుకు కారణాలు బోలెడు ఉంటాయి. మరొక సినిమాలతో బిజీగా ఉండడమో.. లేక కొన్ని ఫ్యామిలీ కారణాల వల్లనో… వేరే ఛానల్ లో సినిమాలు తీస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు అనే ధోరణిలో కొంతమంది స్టార్ హీరోలు కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలను వదిలేసుకున్నారు. తమ దగ్గరికి వచ్చిన కథని రిజెక్ట్ చేయడంతో వేరే హీరో ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కామన్.. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలు రిసర్వ్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఏవి.? ఏ హీరో నుంచి ఏ హీరోకు షిఫ్ట్ అయ్యిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..


హీరోలు మిస్ చేసుకున్న బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. 

కందిరీగ.. 


టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి.. కందిరీగ 2011 లో విడుదలైన తెలుగు చిత్రం… యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో సంతోష శ్రీనివాస్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.. అయితే ఈ మూవీని మొదటగా మాస్ మహారాజా రవితేజ దగ్గరికి ఈ సినిమా ముందుగా వెళ్లిందట.. ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించాల్సింది. రవితేజ వేరే సినిమాలతో బిజీగా ఉండడంవల్ల ఈ సినిమాని వద్దనుకున్నారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ గా తెరకెక్కించారు.

శతమానం భవతి..

శతమానంభవతి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ సినిమాకు మొదటి హీరో శర్వానంద్ ను అనుకోలేదట.. ముందుగా ఈ సినిమాను సాయి ధరంతేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. అందులో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాలని ముందుగానే డేట్ ని చెప్పడంతో సాయిధరమ్ తేజ్ ఆ సినిమాని చేయలేనని చెప్పారట. అందుకు కారణం చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఈ సినిమాను చేయలేను అని తప్పుకున్నాడు.. అంతేకాదు ఈ సినిమాకి శర్వానంద్ అయితే కరెక్ట్ అవుతుందని చెప్పాడు కూడా.  అలా ఈ మూవీ ఆ హీరో దగ్గరకు వెళ్ళింది..

బొమ్మరిల్లు.. 

2006లో బొమ్మరిల్లు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు డైరెక్టర్ భాస్కర్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అతని పేరు బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయింది.. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోగా సిద్ధార్థ ని అనుకోలేదట.. ఎన్టీఆర్ ని ఫిక్స్ చేశారట. అయితే ఎన్టీఆర్ అంటే మాస్ కి కేరాఫ్ అని ఆయన అభిమానులు భావిస్తుంటారు.. అలాంటిది ఇలాంటి క్లాస్ సినిమాలను చేస్తే ఫాన్స్ నిరాశ పడతారని వద్దనుకున్నారట. అలా ఆ సినిమా సిద్ధార్థ చేయాల్సి వచ్చింది.. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు చెప్పనక్కర్లేదు..

Also Read: తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న  హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

ఇది కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హన్సిక మోత్వానీ నటించిన దేశముదురు చిత్రం కూడా మొదట సుమంత్ దగ్గరికి వెళ్లిందట. ఎందుకు ఏమో తెలియదు కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ చెంతకీ చేరింది.. అలా ఆ సినిమా అల్లు అర్జున్ ఖాతాలో సూపర్ హిట్ గా నిలిచింది.. ఇలాంటి సినిమాలు ఈమధ్య బోలెడు వినిపిస్తున్నాయి..

Related News

Megastar Chiranjeevi : ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలి..తమ్ముడికి చిరు ఎమోషనల్ విషెస్..

Teja Sajja: అన్నీ నేనే చేశాను. నాకు బాడీ డబుల్ ఎవరూ లేరు

OG Trailer Update: ఓజీ ట్రైలర్ ఎప్పుడంటే? మరీ అంత లేటా?

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు

Mirai Film: మిరాయ్ సినిమాలో రాముడిగా  స్టార్ హీరో… థియేటర్లు తగలబడి పోవాల్సిందే?

Big Stories

×