Ram Prasad:తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తున్న మోస్ట్ పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ షో బిగ్ బాస్ 10 రోజులు గడుస్తున్న మరింత ఆసక్తికరంగా మారుతుంది.ఇప్పటికే సీజన్ మొదలై వారం గడవడంతో కంటెస్టెంట్ లపై ఒక అంచనాకి వచ్చేస్తునారు ఆడియన్స్.
అయితే కంటెస్టెంట్ అందరిలో ఎక్కువగా ఆడియన్స్ ఫోకస్ ఆటో రామ్ ప్రసాద్ మీద ఉందన్న సంగతి తెల్సిందే.ఇక టైటిల్ ఫేవరేట్ లో కూడా రామ్ ప్రసాద్ నే టాప్ లో ఉండటం విశేషం.
ఓటింగ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే
ఇక ఆటో రామ్ ప్రసాద్ కి సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీనులతో మంచి అనుబంధం ఉంది.వీరు ఒక టీమ్ గా కలిసి చేసిన జబర్దస్త్ స్కిట్స్ ఎన్నో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి కూడా. అయితే ఒకవేళ రామ్ ప్రసాద్ గనుక నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేషన్ డేంజర్ లో పడితే సుడిగాలి సుధీర్ బయట నుండి రామ్ ప్రసాద్ కి ఓటింగ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందా అంటూ లెక్కలు వేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.
సుడిగాలి సుధీర్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అలాంటిది సుధీర్ గనుక తన ఫాలోవర్స్ ని ,ఆడియన్స్ ని గనుక ఓట్ చేయుమని అడిగితే అది రామ్ ప్రసాద్ కి బాగా ఉపయోగపడుతుందన్న సంగతి తెల్సిందే.
బయట నుండి పడే ఓట్లు కీలకం
ఎందుకంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ లు ఎంత బాగా ఆడినా, నామినేషన్స్ లో ఉన్నప్పుడు బయట నుండి పడే ఓట్లు చాలా కీలకం.అందుకే సెలబ్రిటీ సపోర్ట్ కూడా కొన్నిసార్లు కంటెస్టెంట్లకు బాగా కలిసొస్తుంది. ఈ లెక్కన రామ్ ప్రసాద్‌కు ఇప్పటికే ఉన్న ఫ్యాన్ బేస్‌కు సుధీర్ అభిమానులు కూడా తోడైతే ఓటింగ్‌లో మంచి బూస్ట్ రావచ్చనే టాక్ వినిపిస్తోంది.
అంటే జబర్దస్త్ నుండి వెళ్ళిన ఆటో రామ్ ప్రసాద్ కి సుడిగాలి సుధీర్ సపోర్ట్ చేస్తే సీరియల్స్ లో నటించిన ముఖేష్ గౌడకి సీరియల్ ఫ్యామిలీ నుండి ఇలాగే సపోర్ట్ చేస్తారేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.మొత్తానికి ఎవరి ఫ్రెండ్స్ ని వారు సపోర్ట్ చేసుకునే పనిలో పడ్డారన్న మాట.
ఎలాంటి నాటకీయ పరిణామాలు ఎదురవుతాయో !
అయితే ఇక్కడ బిగ్ బాస్ లో ఎవరు సపోర్ట్ చేసినా అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప టైటిల్ కొట్టాలంటే మాత్రం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రదర్శన పైనే ఆధారపడి ఉంటుంది.టాస్క్ ఎలా ఆడుతున్నారు, ఎలా స్టాండ్ తీసుకుంటున్నారు, మిగతా కంటెస్టెంట్ లతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు,ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాడు? వీకెండ్‌లో అతని ఇమేజ్ ఎలా ఉంది? అనేది చాలా ముఖ్యం.
చూడాలి మరి..ముందు ముందు బిగ్ బాస్ లో ఎలాంటి నాటకీయ పరిణామాలు ఎదురవుతాయో !