E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…

ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…
Advertisement

Eshwar Sai: ఈశ్వర్ సాయి ,మధురి రాథోడ్ ల వ్యవహారం అంత ఈజీగా ఎండ్ కార్డు వేసుకునేలా కనిపించట్లేదు.వేములవాడ రెడ్డి భవన్ లో రెడ్ తన భార్య శరణ్యకి దొరికినప్పటి నుండి మీడియాలో ఎక్కడ చూసిన వీరి వార్తలే దర్శనమిస్తున్నాయి.అయితే ఇప్పటికే ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డు వేయండిరా బాబోయ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నా అంత ఈజీగా మేము వదలలేమంటూ వరుసగా ఏకి పారేస్తున్నారు నెటిజన్లు .

ఈ క్రమంలోనే ఈశ్వర్ సాయికి సంబందించిన పాత వీడియోలు,ఫోటోలు వైరల్ అవుతు ట్రెండ్ అవుతున్నాయి.ఇక ఈ కోవలోనే ఈశ్వర్ సాయి చేసిన జిమ్ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

వీడియోకి నెగెటివ్ కామెంట్ల వర్షం

Advertisement

“When there is no one in gym”అనే క్యాప్షన్ తో పెట్టిన ఈ వీడియోలో ‘మున్ని బదునాం హుయి’ అంటూ హిందీ పాటకి తన ఇద్దరు ఫ్రెండ్స్ తో హుషారుగా డాన్స్ చేస్తుంటాడు ఈశ్వర్ సాయి.నిజానికి ఈ వీడియో పెట్టినప్పుడు పాజిటివ్ యాంగిల్ ఎన్నో కామెంట్స్ పెట్టిన నెటిజన్లు .కానీ ఇపుడు ఒక్కసారిగా మాధురి రాథోడ్ తో రెడ్డి భవన్ లో తన భార్యకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో అదే నెటిజన్లు అదే వీడియోకి నెగెటివ్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాఖీ పండక్కి రాఖీ కట్టించుకుని చూపించు

అప్పుడు సరదాగా కనిపించిన వీడియోనే ఇపుడు నెగెటివ్ యాంగిల్ లో నెటిజన్లకు దర్శనమిస్తుంది .ఈ వీడియో కింద ఎందుకురా మాధురి రాథోడ్ జీవితాన్ని నాశనము చేశావు అని కొంతమంది కామెంట్ చేస్తుంటే ,మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి మరి మీ మధ్య ఏమీ లేకపోతె రాఖీ పండక్కి రాఖీ కట్టించుకుని చూపించు అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

కొంచెమైనా నమ్మేట్టు ఉండాలి

Advertisement

ఇక ఇంకొంతమంది మొన్నేమో రెండు నెలల కిందటే ఎమోషనల్ గా దగ్గరయ్యాము ,నాకు ఓదార్పు కావలిసినప్పుడు తన షోల్డర్ నాకు ఆసరాగా దొరికింది అన్నాడు,ఇప్పుడేమో అసలు మామధ్య ఇంకా అక్కడిదాకా పోలేదు .జస్ట్ ప్రెండ్స్ మాత్రమే అంటూ కవరింగులు ఇస్తున్నాడు,చెబితే కొంచెమైనా నమ్మేట్టు ఉండాలి అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.

నిజానికి ఎవరు ఇలా కాంట్రవర్సిలలో ఇరుక్కున్నా ఇలా వారి పాత వీడియోల్ని వెలికి తీసి మరి ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు .ఆ జాబితాలో ఇపుడు ఈశ్వర్ సాయి చేరాడన్న మాట.

ఫోక్ ఇండస్ట్రీ అంటే అంతా ఇంతేనా

చూస్తుంటే ఈ వివాదం అప్పుడే ఎండ్ కార్డు వేసుకునేలా కనిపించడం లేదు.ఒక వైపు ఈశ్వర్ సాయి కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే మరో వైవు మాధురి రాథోడ్ కూడా ఈ వివాదం తర్వాత తాజాగా రియాక్ట్ కావడం మనకి తెల్సిందే.ఇక వీరి వ్యవహారంతో ఫోక్ ఇండస్ట్రీ అంటే అంతా ఇంతేనా అన్న మచ్చ పడటంతో జానపదకళాకారులు మూకుమ్మడిగా వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కూడా.

మరింత వైరల్ అవుతున్న పాటలు

ఇక ఈ వివాదం ఇలా తెగ చక్కర్లు కొడుతుంటే ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ లు కలిసి చేసిన “లయి లయి లబ్బరి బొమ్మ” ,”రాతిరి రాతిరి రాతిరిలో”,“సీటీ చీర”, వంటి పాటలు ఇపుడు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ మరింత వైరల్ అవుతున్నాయి.

మొత్తంగా సరదాగా “When there is no one in gym”అంటూ గతంలో పెట్టిన జిమ్ వీడియో ఇపుడు ట్రోలర్స్ కి ఇలా మాంచి స్టఫ్ అయిందన్న మాట !

Tags

Related News

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..

మంగ్లీ బతుకమ్మ పాట రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం

ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

Big Stories

Advertisement
×