E-Paper
Advertisement

హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Advertisement

యాగ్‌రాజ్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థిని యూనిఫామ్‌తో హిజాబ్‌ ధరించేందుకు అనుమతి కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. యూనిఫామ్‌ విధానం స్కూల్ రూల్స్ ప్రకారమే ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హిజాబ్‌ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఆచారమని నిరూపించే తగిన మతపరమైన, న్యాయపరమైన ఆధారాలు పిటిషన్‌లో లేవని బెంచ్‌ పేర్కొంది.

Advertisement

యూనిఫామ్‌ అంటేనే క్రమశిక్షణ, సమానత్వం, సంస్థాగత గుర్తింపును కాపాడటమని కోర్టు కామెంట్ చేసింది. నిజానికి హిజాబ్ చుట్టూ దేశంలో ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని విద్యాసంస్థలు అనుమతి ఇస్తున్నాయ్. ఇంకొన్ని ఇవ్వట్లేదు. అటు అయ్యప్పమాల వేసుకునే పిల్లలను కొన్ని స్కూళ్లు బయటకు పంపిన ఘటనలు, ఆ తర్వాత ఆందోళనలు చేసినవీ ఉన్నాయ్.

సో ఈ ఎపిసోడ్ లో కోర్టు తీర్పు ప్రకారం విద్యాసంస్థల రూల్స్ ప్రకారమే డ్రెస్ కోడ్ ఉండాలన్నది. అయితే అన్ని విద్యాసంస్థలు ఇదే రూల్ పాటించాలని కాదు. మతపరమైన విషయాల్లో ఇలాంటి చిక్కుముడులు విప్పడం అంత ఈజీ అయితే కాదు.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×