Sourav Ganguly On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. కొంతమంది మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీని పొగిడితే, మరికొంతమంది మాత్రం అతడిని బండ బూతులు తిడుతూ ఉంటారు. ధోని వల్లే టీమిండియాలో ఛాన్సులు రాలేదని విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా మహేంద్ర సింగ్ ధోని గురించి బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగిల్స్ తీసే మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని బాంబు పేల్చారు. సిక్సర్లు కొట్టే ధోని మాత్రమే తనకు ఇష్టమని పేర్కొన్నారు. అతడు ఎప్పుడూ కూడా సిక్సర్లు ఆడాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వాడినని ప్రశంసల వర్షం కురిపించారు.
రెండు వరల్డ్ కప్ తో పాటు ఓ చాంపియన్స్ ట్రోఫీని అందించిన మహేంద్ర సింగ్ ధోని గురించి తాజాగా సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని.. ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే మహేంద్రసింగ్ ధోని అంటే తనకు అస్సలు నచ్చదని బాంబు పేల్చారు. అతడి కెరీర్ ప్రారంభంలో పెద్ద జుట్టు వేసుకొని… వచ్చినప్పుడు సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేవాడని గుర్తు చేశారు. ప్రతి బంతి మైదానం అవతల పడేదని వెల్లడించారు.
అప్పుడే ధోని అంటే తనకు ఇంట్రెస్ట్ పెరిగింది అన్నారు. కానీ ఎప్పుడైతే ధోని కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు అప్పటినుంచి… సిక్సర్లు కొట్టకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడని సౌరవ్ గంగూలీ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇప్పటికీ ఎప్పటికీ సిక్సర్లు కొట్టే ధోని మాత్రమే ఇష్టమని కొండ బద్దలు కొట్టి చెప్పారు. సింగిల్స్ తీసే ధోని అంటే తనకు అసహ్యం అని హేళన చేశారు. సింగిల్స్ తీస్తూ 10 వరల్డ్ కప్స్ తీసుకువచ్చిన తనకు ధోని నచ్చబోడని బాంబు పేల్చారు సౌరవ్ గంగూలీ.
టీమిండియాలో జార్ఖండ్ రాష్ట్రం నుంచి ధోని కంటే ముందు ఎవరూ రాలేదని సౌరవ్ గంగూలీ గుర్తు చేశారు. అయితే ధోని వచ్చిన తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని వివరించారు. ధోని కెరీర్ ప్రారంభంలో తాను ఎంతో హెల్ప్ చేశానన్నారు. అతని ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకోవాలని తానే సూచనలు చేసినట్లు వివరించారు. జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చి కూడా… రెండు వరల్డ్ కప్ ట్రోఫీ లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు అందించడం మామూలు విషయం కాదని వివరించారు. అలాంటోడు మళ్ళీ దొరకడం కష్టమేనన్నారు గంగూలీ.