E-Paper
Advertisement

OTT Movie : మనిషి నెత్తిపై మిస్టీరియస్ రెడ్ లైన్స్… ఈ ట్రెండింగ్ కొరియన్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : మనిషి నెత్తిపై మిస్టీరియస్ రెడ్ లైన్స్… ఈ ట్రెండింగ్ కొరియన్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఒక అదరగొట్టే కొరియన్ ఫాంటసీ-థ్రిల్లర్ సిరీస్, రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి ఎవరితో రిలేషన్ లో ఉన్నాడో తెలుసుకునే పవర్ ఉంటుంది. ఆ పవర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ 8వ కేన్స్ ఇంటర్నేషనల్ సిరీస్ ఫెస్టివల్‌లో బెస్ట్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న, కొరియన్ డ్రామాగా చరిత్ర సృష్టించింది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్, ఫాంటసీ, రెడ్ లైన్స్ యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందింది. దీనిపేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …

Wavve ఓటీటీలో స్ట్రీమింగ్

‘S Line’ 2025లో విడుదలైన కొరియన్ ఫాంటసీ-థ్రిల్లర్ సిరీస్. ఇది Wavve ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 2025 జూలై 11న ప్రీమియర్ అయింది. ఇది కొమాబి రాసిన ‘S Line’ వెబ్‌టూన్ ఆధారంగా జూయాంగ్ ఆన్ డైరెక్ట్ చేసిన 6 ఎపిసోడ్‌ల సిరీస్. ఇందులో లీ సూ-హ్యూక్, లీ డా-హీ, అరిన్, లీ యున్-సామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సిరీస్ కి 7.8/10 రేటింగ్ ను పొందింది.

స్టోరీలోకి వెళితే

“S Line” కథ ఒక వింత ఫాంటసీ చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి ఎవరితో అయినా శారీరక సంబంధం పెట్టుకుంటే ఎరుపు రంగు లైన్స్ (S Lines)  వారి తలల మీద కనిపిస్తాయి.  సాధారణంగా ఈ లైన్స్ ఎవరికీ కనిపించవు, కానీ షిన్ హ్యూన్-హ్యూప్ (అరిన్) అనే హైస్కూల్ అమ్మాయికి జన్మతః ఈ లైన్స్ చూసే సామర్థ్యం ఉంటుంది. ఆమె ఈ సామర్థ్యం వల్ల ఒంటరిగా జీవిస్తూ, తన కుటుంబంలోని బాధాకరమైన రహస్యాలను చూసి ట్రామా అనుభవిస్తుంది (ఉదా., ఆమె తండ్రి వేరొకరితో సంబంధం ఉందని తెలుసుకుని, ఆమె తల్లి అతన్ని చంపేస్తుంది).

కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ S Linesని చూడగలిగే ప్రత్యేక గ్లాసెస్ బ్లాక్ మార్కెట్‌లో కనిపిస్తాయి. ఈ గ్లాసెస్ ధరించినవారు ఎవరి హిస్టరీని అయినా చూడగలరు. దీనివల్ల సమాజంలో గందరగోళం, షేర్, బ్లాక్‌మెయిల్, హత్యలు వంటివి జరుగుతుంటాయి. ఇక హాన్ జీ-వుక్ (లీ సూ-హ్యూక్) ఒక ఫ్రీ-స్పిరిటెడ్ డిటెక్టివ్. ఈ లైన్స్ వెనుక రహస్యాన్ని, వాటితో సంబంధం ఉన్న మర్డర్ కేసులను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. లీ గ్యూ-జిన్ (లీ డా-హీ) ఒక హైస్కూల్ టీచర్. ఆమెకు ఎటువంటి S Line కనిపించకపోవడం ఒక మిస్టరీగా ఉంటుంది,

మొదటి ఎపిసోడ్‌లో, కాంగ్ సన్-ఆ (లీ యున్-సామ్) అనే హైస్కూల్ అమ్మాయి ఈ గ్లాసెస్‌ని కనిపెడుతుంది. దానితో ఆమె స్కూల్‌లో అందరి రిలేషన్స్ చూస్తుంది. ఆమె కిమ్ హ్యే-యాంగ్ (నామ్ క్యూ-హీ)కు ఒక టీచర్‌తో సంబంధం ఉందని తెలుసుకుని, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ గ్లాసెస్ ఆమెకు శక్తినిచ్చినా, ఆమె హఠాత్తుగా టీచర్‌తో జరిగిన గొడవలో పైకప్పు నుంచి తోసి చంపబడుతుంది.

సిరీస్ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ గ్లాసెస్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరని, ఎందుకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయని జీ-వుక్, హ్యూన్-హ్యూప్ కలిసి ఛేదించడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ ప్రయత్నంలో అసలు రహస్యం తెలుస్తుందా ? దాని పవర్ ఎక్కడినుంచి వచ్చింది ? ఈ లైన్స్ వల్ల సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఈ రెంటుకొచ్చిన ఆటగాడి టార్గెట్ ఇంటి ఓనరే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×