Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆది ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే హైపర్ ఆది(Hyper Aadi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆది తన ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అందరిలాగే తనక ఓ లవ్ స్టోరీ(Love Story) ఉందని బయటపెట్టారు.
తాను పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిపారు. అబ్బాయిలలో నేను టాపర్ అమ్మాయిలలో తను టాపర్ మేమిద్దరూ చదువులో టాపర్స్ కావడంతో మా ఇద్దరి మధ్య తెలియని ప్రేమ మొదలైందని తెలిపారు. ప్రతిరోజు ఆ అమ్మాయి నన్ను చూస్తూ ఉండేది నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదని అది తెలిపారు. ఒకరోజు కావలసిగానే తాను వేరే ప్లేస్ లో కూర్చున్నప్పటికీ ఆ అమ్మాయి నన్ను గమనిస్తూనే ఉండేదని అదంతా సినిమా రేంజ్ లో మా లవ్ స్టోరీ నడిచిందని తెలిపారు. అయితే పదో తరగతి పూర్తి అయినప్పటికీ తను నాతో మాట్లాడలేదు నేను కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపారు.
ఇంటర్ వెళ్లగానే తాను బాయ్స్ కాలేజ్, ఆ అమ్మాయి గర్ల్స్ కాలేజ్ కావడంతో మా మధ్య కమ్యూనికేషన్ లేదని ఆది తెలిపారు. ఇంటర్ తర్వాత తాను కంప్యూటర్ కోచింగ్ వెళ్లాను. నేను ఎక్కడైతే జాయిన్ అయ్యానో ఆ అమ్మాయి కూడా అక్కడే జాయిన్ అయింది. నా క్లాస్ అయిపోగానే తర్వాత బ్యాచ్ లో ఆ అమ్మాయి జాయిన్ అయిందని ఆది తెలిపారు. నేను అలా స్టెప్స్ దిగి వస్తున్నాను. ఆ అమ్మాయి క్లాస్ లోకి వెళుతుంది. ఇలా ప్రేమించిన అమ్మాయి దాదాపు రెండు సంవత్సరాలు తర్వాత కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని ఆది తెలిపారు.
ఇక ఆ అమ్మాయిని చూడగానే తన క్లాస్ అయిపోయే వరకు ఎదురు చూసి తనతో పాటు బస్సులో వెళ్ళిపోయామని అయితే ఆ అమ్మాయి వెళ్లేటప్పుడు తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ నాకు ఇచ్చింది. అప్పటినుంచి ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుతూనే ఉండే వాళ్ళం.. దెబ్బకి వాళ్లింట్లో ఫోన్ బిల్ భారీగా పెరిగిపోయిందని , దీంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఎవడు వీడు అంటూ అమ్మాయిని బాగా తిట్టారని ఆది తెలిపారు. ఏదేమైనా ఫస్ట్ లవ్ బెస్ట్ అని ఆది తెలిపారు .ఇక ఎంసెట్లో నాకంటే అమ్మాయికి చాలా మంచి ర్యాంకు వచ్చినప్పటికీ నా కోసం నేను జాయిన్ అయినా కాలేజీలో చేరిందని అలా నాలుగు సంవత్సరాలు మా ప్రేమ కొనసాగిందని తెలిపారు.. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు జాబ్ లేదు కానీ అమ్మాయికి ఇంట్లో పెళ్లి చేశారని, తనని పెళ్లి చేసుకుంటానని అడగడానికి కూడా మన దగ్గర సోర్స్ లేకపోవడంతో ఆ అమ్మాయిని వదులుకోవాల్సి వచ్చిందని తన లవ్ స్టోరీ గురించి ఆది చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?