E-Paper
Advertisement

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మామూలు సంపాదన కాదుగా?
Advertisement

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా హైపర్ ఆదికి అభిమానులు ఉన్నారు అంటేనే ఈయన క్రేజ్ ఎలా ఉందో స్పష్టమవుతుంది. జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో కమెడియన్ గా మొదలైన ఈయన ప్రస్థానం ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా కమెడియన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఒక్క ఎపిసోడ్ కు 5 లక్షలు..

ఇదిలా ఉండగా హైపర్ ఆది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది ఆస్తులకు (Assets)సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈయన ఒక్క ఎపిసోడ్ కు దాదాపు 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు స్పెషల్ ఈవెంట్స్ అంటూ భారీగానే సంపాదిస్తున్నారు.

ఒక్క రూపాయి ఆస్తి లేదు..

Advertisement

ఇలా హైపర్ ఆది ఒక ఎపిసోడ్ కు లక్షల్లో రెమ్యూనరేషన్ అంటే ఈపాటికి ఈయన కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారని అందరూ భావిస్తూ ఉంటారు కానీ తాజాగా ఆది తన ఆస్తులకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. తన చదువుల కోసం తండ్రి ఉన్న పొలం అమ్మారని అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సంపాదించిన దాంతో నాన్నకు ఊర్లో పొలం కొనిచ్చానని తెలిపారు. ఇండస్ట్రీలో నేను సంపాదించింది మొత్తం తన ఇద్దరి అన్నయ్యల పెళ్లిళ్లు, వారికి కావలసిన వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నానని, ఇప్పటివరకు నా పేరు మీద ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని ఆది తెలిపారు.

సొంత కారు కూడా లేదు..

ఇప్పటికి తాను హైదరాబాదులో సొంత ఇల్లు కొనలేదని బ్యాచిలర్ రూమ్ లోనే ఉంటున్నానని తెలిపారు. కనీసం సొంత కారు కూడా లేదని ఆది తెలియచేశారు. షూటింగ్ వాళ్లు పంపిన కారులోనే నేను వచ్చి వెళ్తుంటాను లేదంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతానని నాకంటూ ఏమి సంపాదించుకోలేదని, సంపాదించింది మొత్తం తన ఫ్యామిలీ కోసమే ఖర్చు చేశానంటూ ఈయన మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటూ తన పేరుపై రూపాయి ఆస్తి కూడా లేదని చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే తమను చదివించడం కోసం తన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారని అందుకే తన ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఆది చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈయన జబర్దస్త్ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!

Related News

లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది..ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ!

సామాన్లు బాగుండాలే..లిరిక్స్‌తో మళ్ళీ దొరికిపోయిన బషీర్ మాస్టర్!

ఏకంగా 50 కట్స్ తో టీవీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఏ ఛానల్ అంటే?

బిగ్ బాస్ సీజన్ 1 నుండి 10 వరకు.. హోస్టుల రెమ్యూనరేషన్లు తెలిస్తే షాక్!

మేము లవర్స్ కాదురా నాయనా..రీతు చౌదరి షాకింగ్ పోస్ట్..!

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Podarillu Today Episode : చక్రీకి దిమ్మతిరిగే షాక్.. మహా ప్లాన్ ఇదా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Big Stories

Advertisement
×